
వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్-19 ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. 17 మంది ప్లేయర్లు, ఐదుగురు స్టాండ్ బై ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇక అండర్-19 ప్రపంచకప్ భారత జట్టు కెప్టెన్‌గా ఢిల్లీ ఆటగాడు యశ్ దుల్, వైస్ కెప్టెన్‌గా ఆంధ్రా ప్లేయర్ షేక్ రషీద్ ఎంపికయ్యాడు. అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన యశ్ దుల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
ఎవరీ యశ్ దుల్..
న్యూఢిల్లీలోని జనక్‌పురికి చెందిన యశ్ దుల్‌కి ఢిల్లీ అండర్-16, అండర్-19, ఇండియా ‘ఎ’ అండర్-19 జట్లకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. యశ్ దుల్ 11 ఏళ్ల వయస్సులో బాల్ భవన్ స్కూల్ అకాడమీలోకి ప్రవేశించి అక్కడి నుంచే తన కలలు సాకారం చేసుకునే దిశగా అడుగులు వేశాడు. ఈ యువ ఆటగాడు ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడుగా ఉన్నాడు. డీడిసీఈ(ఢిల్లీ ఎండ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్) తరుపున 5 మ్యాచ్‌లు ఆడిన యశ్ దుల్ 302 పరుగులు చేశాడు.
ఇక యష్ తండ్రి కాస్మెటిక్ బ్రాండ్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు, కానీ తన పిల్లల కెరీర్‌కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవలసి వచ్చింది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. "చిన్న వయస్సు నుంచే యశ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతడు ఆడటానికి చిన్నతనంలోనే మంచి క్రికెట్ కిట్ నేను కొనిచ్చాను. నేను అతడికి అత్యుత్తమ ఇంగ్లీష్ విల్లో బ్యాట్‌లను ఇచ్చాను. యశ్ కేరిర్ కోసం మేము మా ఖర్చులను తగ్గించుకున్నాము. మా నాన్న ఆర్మీ మేన్, తనకు వచ్చిన పింఛను ఇంటి నిర్వహణకు ఉపయోగపడేది. అతడు తన కేరిర్‌లో అద్బుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను" అని యష్ దుల్ తండ్రి పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: ఒడిశా ఆటగాడికి బంఫర్ ఆఫర్.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు!