దుబాయ్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 154 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 282 పరుగులు చేసింది. హర్నూర్ సింగ్ (130 బంతుల్లో 120; 11 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ యశ్ ధుల్ (68 బంతుల్లో 63; 4 ఫోర్లు) రాణించాడు. ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (35; 1 ఫోర్) ఫర్వాలేదనిపించాడు.
చివర్లో రాజ్‌వర్ధన్ (23 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు; 2 సిక్స్‌లు) మెరిపించాడు. ఛేదనలో యూఏఈ 34.3 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. రాజ్‌వర్ధన్ (3/24) బంతితోనూ మెరిశాడు. గర్వ్ సాంగ్వాన్, విక్కీ, కుశాల్ తాంబే తలా రెండు వికెట్లు తీశారు. యూఏఈ ఓపెనర్ కై స్మిత్ (70 బంతుల్లో 45; 6 ఫోర్లు) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. రేపు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడనుంది.
చదవండి: బోర్డుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా.. టెస్టులు ఆడటం కష్టమే: స్టార్ ఆల్‌రౌండర్
Comments
Please login to add a commentAdd a comment