ఆసియా ‘ఎమర్జింగ్’ కప్ టోర్నీ తుది పోరుకు రంగం సిద్ధమైంది. కొలంబోలో నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడుతుంది. బలాబలాలను బట్టి చూస్తే యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టే ఫేవరెట్‌గా ఉంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టోర్నీలో చెరో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన ధుల్, సాయి సుదర్శన్ మంచి ఫామ్‌లో ఉన్నారు.
బౌలింగ్‌లో కూడా నిశాంత్ సింధు 10 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ టీమ్‌ను చూస్తే పలువురు ఆటగాళ్లు మొహమ్మద్ వసీమ్, కెప్టెన్ మొహమ్మద్ హారిస్, ఫర్హాన్, అర్షద్ ఇక్బాల్‌లకు ఇప్పటికే సీనియర్ టీమ్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో వీరు చెలరేగితే టీమిండియా తీవ్ర పోటీ ఎదురువ్వక తప్పదు.
తుది జట్లు(అంచనా):
భారత్: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, యశ్ ధుల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నికిన్ జోస్, నిశాంత్ సింధు, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, రాజవర్ధన్ హంగర్గేకర్, యువరాజ్
పాకిస్తాన్: సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, అమద్ బట్, మహ్మద్ వసీం జూనియర్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్
చదవండి: IND vs WI: అశ్విన్‌తో అట్లుంటది మరి.. విండీస్ కెప్టెన్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment