ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కొలొంబో వేదికగా ఇవాళ (జులై 23) మధ్యాహ్నం మొదలైన తుది సమరంలో టాస్ గెలిచిన భారత్.. పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌కు ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్‌జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది.
పాక్ ఇన్నింగ్స్‌లో అయూబ్, ఫర్హాన్, తాహిర్‌లతో పాటు ఒమైర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) కూడా రాణించారు. ఖాసిం అక్రమ్ (0), కెప్టెన్ మహ్మద్ హరీస్ (2), మెహ్రన్ ముంతాజ్ (13) విఫలం కాగా.. మహ్మద్ వసీం జూనియర్ (17), సూఫియాన్ ముఖీమ్ (4) నాటౌట్‌గా నిలిచారు. 14 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.
భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ దక్కించుకున్నారు. భారత బౌలరల్లో నిషాంత్ (5.30) మినహా అందరూ 6 అంతకంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు.
హర్షిత్ రాణా 6 ఓవర్లలో 51 పరుగులు, హంగార్గేకర్ 6 ఓవర్లలో 48, అభిషేక్ శర్మ 9 ఓవర్లలో 54, యువ్‌రాజ్ సింగ్ దోడియా 7 ఓవర్లలో 56, మానవ్ సుతార్ 9 ఓవర్లలో 68, రియాన్ పరాగ్ 4 ఓవర్లలో 24.. ఇలా ప్రతి భారత బౌలర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
బ్యాటర్లకు స్వర్గధామమైన పిచ్‌పై టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పిదమని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యర్ధి భారీ టార్గెట్ నిర్ధేశించినప్పటికీ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని, టీమిండియా బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉందని, ఎలాగైనా తామే గెలుస్తామని భారత అభిమానులు సోషల్‌మీడియా వేదికగా యువ భారత జట్టుకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment