ACC Men's Emerging Teams Asia Cup 2023: India And Pakistan May Again Meet In Final - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: జులై 23న భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌..!

Published Thu, Jul 20 2023 12:42 PM | Last Updated on Thu, Jul 20 2023 1:00 PM

ACC Mens Emerging Teams Asia Cup 2023: India And Pakistan May Again Meet In Final - Sakshi

ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023 టోర్నీలో నిన్న (జులై 19) భారత్‌-ఏ, పాక్‌-ఏ జట్ల మధ్య గ్రూప్‌ దశ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యువ భారత్‌ 8 వికెట్ల తేడాతో పాక్‌ సేనను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించి, అద్భుత విజయాన్ని అందుకుంది.

తొలుత హంగార్గేకర్‌ (5/42), మానవ్‌ సుతార్‌ (3/36) బంతితో విజృంభించగా.. ఆతర్వాత ఐపీఎల్‌ హీరో సాయి సుదర్శన్‌ (110 బంతుల్లో 104 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్‌ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి  నికిన్‌ జోస్‌ (53), కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ (21 నాటౌట్‌), అభిషేక్‌ శర్మ (20) సహకరించారు. ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్‌, పాక్‌లు ఇదివరకే సెమీస్‌కు చేరాయి.

కాగా, ఇదే టోర్నీలో భారత్‌, పాక్‌లు మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇదివరకే సెమీస్‌కు చేరిన భారత్‌, పాక్‌లు ఈ గండాన్ని అధిగమిస్తే ఫైనల్లో మరోసారి ఎదురెదురుపడే ఛాన్స్‌ ఉంది. రేపు (జులై 21) తొలి సెమీఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్‌ జట్లు.. రెండో సెమీఫైనల్లో భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి.

ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు జులై 23న కొలొంబో వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో ఆటగాళ్ల ఫామ్‌ దృష్ట్యా శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్‌, పాక్‌లకే ఫైనల్‌కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సో.. ఇదే ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌లు మరోసారి తలపడటం ఖాయం. సెమీఫైనల్‌ (తొలి సెమీస్‌ ఉదయం 10 గంటలకు), ఫైనల్‌ మ్యాచ్‌లు ఆయా తేదీల్లో స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement