ఇస్లామాబాద్: అక్టోబర్ లేదా నవంబర్‌లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధం జరగబోతోందని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బుధవారం రావల్పిండిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బహుశా, రెండు దేశాల మధ్య ఇదే తుది యుద్ధం కానుంది’ అని పేర్కొన్నారని పాకిస్తాన్ టుడే తెలిపింది. ‘భారత్‌లో ముస్లిం వ్యతిరేక భావజాలం ఉందని జిన్నా ఏనాడో చెప్పారు. ఆ దేశంతో చర్చలు జరిగే అవకాశాలున్నాయని ఇంకా భావించే వారు మూర్ఖుల కిందే లెక్క’ అని రషీద్ వ్యాఖ్యానించారు. కశ్మీరీలకు సంఘీభావం తెలపాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ఆయన ముహర్రం తర్వాత కశ్మీర్ లోయను సందర్శిస్తానన్నారు. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ ఈ అంశంపై అంతర్జాతీయ మద్దతు కూడగట్టే విషయంలో తీవ్రంగా విఫలమై, ఏకాకిగా మారిపోవడం తెల్సిందే.
(చదవండి: భారత్‌తో అణు యుద్ధానికైనా రెడీ)
Comments
Please login to add a commentAdd a comment