'నన్ను జైలుకు పంపినా నా అభిప్రాయం ఇదే' | Kashmir not an integral part of India, says J&K MLA Engineer Rashid | Sakshi
Sakshi News home page

'నన్ను జైలుకు పంపినా నా అభిప్రాయం ఇదే'

Published Tue, Jun 21 2016 11:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

'నన్ను జైలుకు పంపినా నా అభిప్రాయం ఇదే'

'నన్ను జైలుకు పంపినా నా అభిప్రాయం ఇదే'

శ్రీనగర్: భారత్‌లో జమ్మూ కశ్మీర్ అంతర్భాగం కాదని ఆ రాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ రషీద్ అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజాభిప్రాయానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఈ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. రషీద్ శాసనసభకు రాజీనామా చేసి పాకిస్తాన్‌కు వలస పోవాలని లేదా వేర్పాటువాదులతో చేరాలని సూచించారు.

‘‘నన్ను జైలుకు పంపినా, ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించినా కశ్మీర్‌పై నా అభిప్రాయం ఇదే. చారిత్రక వాస్తవం అర్థం చేసుకోండి. ఈ విషయంలో ప్రజాభిప్రాయం తప్ప మరో మార్గం లేదని న్యూఢిల్లీకి తెలియజేయండి ’’ అని రషీద్ సభలో అన్నారు. భారత్ సార్వభౌమత్వానికి తాను వ్యతిరేకం కాదని, భారత్-పాక్ మధ్య వివాదానికి కారణమైన జమ్మూ కశ్మీర్ గురించే మాట్లాడుతున్నానని చెప్పారు. ఐరాస తీర్మానాలను మరుగునపరిచే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement