సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న వినూ మన్కడ్ ట్రోఫీ అండర్-19 సౌత్‌జోన్ వన్డే లీగ్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ విజయాల బోణీ చేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన హైదరాబాద్... కర్ణాటకతో శుక్రవారం స్థానిక జింఖానా మైదానంలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో హైదరాబాద్ 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 248 పరుగులు సాధించింది. పి. సారుు వికాస్ రెడ్డి (99 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... షేక్ సొహైల్ (50) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం కర్ణాటక జట్టు సరిగ్గా 50 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. దేవ్ పడికల్ (60), నికిన్ జోస్ (61), జయేశ్ (58) అర్ధ సెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ (3/42), వినీత్ (2/36) రాణించారు.
ఆంధ్ర గెలుపు
తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 34 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట ఆంధ్ర జట్టు 40 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ కుమార్ రెడ్డి (58), గిరినాథ్ (63) అర్ధ సెంచరీలు సాధించారు. తమిళనాడు 43.3 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటై ఓడిపోరుుంది. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి మూడు వికెట్లు, ఆశిష్, ధ్రువ కుమార్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం హైదరాబాద్ ఖాతాలో నాలుగు, ఆంధ్ర ఖాతాలో ఎనిమిది పాయింట్లు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి.