vinu mankad trophy
-
కరోనా కలకలం.. బీసీసీఐ కీలక నిర్ణయం
ముంబై: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న వినూ మాన్కడ్ ట్రోపీ సహా అన్ని విభాగాల క్రికెట్ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా అన్ని రాష్ట్రాల బోర్డులకు సమాచారం అందించారు.కరోనా ఉదృతంగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య 5 టీ20ల సిరీస్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు టీ20లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన బీసీసీఐ.. కరోనా కారణంగా మిగతా మూడూ టీ20లతో పాటు రానున్న వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనుంది. ఇప్పటికే మంగళవారం జరిగిన మూడో టీ20లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరిగిందని.. మిగతా మ్యాచ్‌లు అలాగే నిర్వహిస్తామని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. చదవండి: మ్యాచ్ ఫిక్సింగ్.. ఎనిమిదేళ్ల నిషేధం అలా చూసుకుంటే ధవన్ రేసు నుంచి తప్పుకున్నట్లే.. -
హైదరాబాద్‌కు తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న వినూ మన్కడ్ ట్రోఫీ అండర్-19 సౌత్‌జోన్ వన్డే లీగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ విజయాల బోణీ చేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన హైదరాబాద్... కర్ణాటకతో శుక్రవారం స్థానిక జింఖానా మైదానంలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో హైదరాబాద్ 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 248 పరుగులు సాధించింది. పి. సారుు వికాస్ రెడ్డి (99 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... షేక్ సొహైల్ (50) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం కర్ణాటక జట్టు సరిగ్గా 50 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. దేవ్ పడికల్ (60), నికిన్ జోస్ (61), జయేశ్ (58) అర్ధ సెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ (3/42), వినీత్ (2/36) రాణించారు. ఆంధ్ర గెలుపు తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 34 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట ఆంధ్ర జట్టు 40 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ కుమార్ రెడ్డి (58), గిరినాథ్ (63) అర్ధ సెంచరీలు సాధించారు. తమిళనాడు 43.3 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటై ఓడిపోరుుంది. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి మూడు వికెట్లు, ఆశిష్, ధ్రువ కుమార్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం హైదరాబాద్ ఖాతాలో నాలుగు, ఆంధ్ర ఖాతాలో ఎనిమిది పాయింట్లు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
మళ్లీ ఓడిన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: వినూ మన్కడ్ ట్రోఫీ అండర్-19 వన్డే టోర్నీలో హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం కేరళతో జరిగిన మూడో మ్యాచ్‌లో హైదరాబాద్ 2 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. వినీత్ రెడ్డి (58) రాణించగా, సారుువికాస్ రెడ్డి 28 పరుగులు చేశాడు. కేరళ బౌలర్లలో అఖిల్ అనిల్ 4, ఫనూస్ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కేరళ 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోరుు 205 పరుగులు చేసి గెలిచింది. అర్జున్ అజి (71) అర్ధసెంచరీ సాధించగా, రోహన్ 37 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ 3, మికిల్ జైస్వాల్ 2 వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆంధ్ర:231 (మహీప్ కుమార్ 93, చైతన్య 44; లిఖిత్ 2/35, రిషి బోపన్న 3/37), కర్ణాటక: 234/7 (నికిన్ జోషి 49, రిషి బోపన్న 65 నాటౌట్; వర్మ 3/27). తమిళనాడు: 236/7 (ఆదిత్య 109, అభిషేక్ 44, ముఖిలేశ్ 33; నిహాల్ 2/53), గోవా:71 (సూయశ్ ప్రభుదేశాయ్ 34; కిషన్ కుమార్ 4/20, రంగనాథ్ 2/7, అజిత్రామ్ 2/13).