
ముంబై: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న వినూ మాన్కడ్ ట్రోపీ సహా అన్ని విభాగాల క్రికెట్ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా అన్ని రాష్ట్రాల బోర్డులకు సమాచారం అందించారు.కరోనా ఉదృతంగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య 5 టీ20ల సిరీస్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు టీ20లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన బీసీసీఐ.. కరోనా కారణంగా మిగతా మూడూ టీ20లతో పాటు రానున్న వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనుంది. ఇప్పటికే మంగళవారం జరిగిన మూడో టీ20లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరిగిందని.. మిగతా మ్యాచ్‌లు అలాగే నిర్వహిస్తామని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
చదవండి:
మ్యాచ్ ఫిక్సింగ్.. ఎనిమిదేళ్ల నిషేధం
అలా చూసుకుంటే ధవన్ రేసు నుంచి తప్పుకున్నట్లే..
Comments
Please login to add a commentAdd a comment