మళ్లీ ఓడిన హైదరాబాద్ | hyderabad defeated in vinu mankad trophy | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన హైదరాబాద్

Published Fri, Oct 7 2016 10:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

hyderabad defeated in vinu mankad trophy

సాక్షి, హైదరాబాద్: వినూ మన్కడ్ ట్రోఫీ అండర్-19 వన్డే టోర్నీలో హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం కేరళతో జరిగిన మూడో మ్యాచ్‌లో హైదరాబాద్ 2 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. వినీత్ రెడ్డి (58) రాణించగా, సారుువికాస్ రెడ్డి 28 పరుగులు చేశాడు. కేరళ బౌలర్లలో అఖిల్ అనిల్ 4, ఫనూస్ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కేరళ 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోరుు 205 పరుగులు చేసి గెలిచింది. అర్జున్ అజి (71) అర్ధసెంచరీ సాధించగా, రోహన్ 37 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ 3, మికిల్ జైస్వాల్ 2 వికెట్లు తీశారు.

 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు

ఆంధ్ర:231 (మహీప్ కుమార్ 93, చైతన్య 44; లిఖిత్ 2/35, రిషి బోపన్న 3/37), కర్ణాటక: 234/7 (నికిన్ జోషి 49, రిషి బోపన్న 65 నాటౌట్; వర్మ 3/27).  తమిళనాడు: 236/7 (ఆదిత్య 109, అభిషేక్ 44, ముఖిలేశ్ 33; నిహాల్ 2/53), గోవా:71 (సూయశ్ ప్రభుదేశాయ్ 34; కిషన్ కుమార్ 4/20, రంగనాథ్ 2/7, అజిత్‌రామ్ 2/13).



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement