హైదరాబాద్: భారత యువ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అంటున్నారు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్. ఒక క్రికెటర్‌గానే కాదు.. వ్యక్తిగా కూడా ద్రవిడ్ తనకు అత్యంత ఇష్టమని కేటీఆర్ పేర్కొన్నారు. అందుకు కారణం ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్‌లో భారత క్రికెట్ జట్టును విజేతగా నిలిచేందుకు తోడ్పడిన శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వాలంటూ రాహుల్ ద్రవిడ్ కోరడమే.
ఇందుకు బీసీసీఐ అంగీకరిస్తూ శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనిపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన వార్తపై కేటీఆర్ స్పందిస్తూ... ఒక క్రికెటర్‌గానే కాదు.. వ్యక్తిగా కూడా ద్రవిడ్ తనకు అత్యంత ఇష్టమని ట్వీట్ చేశారు.
ప్రపంచకప్ గెలవగానే బోర్డు... ఆటగాళ్లకు రూ 30 లక్షలు, హెడ్ కోచ్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున ప్రోత్సాహకాల్ని బీసీసీఐ ప్రకటించింది. దీనిపై ద్రవిడ్ అసంతృప్తి వెలిబుచ్చాడు. జట్టు కోసం తన సిబ్బంది అంతా సమష్టిగా శ్రమించారని, ఈ ఫలితంలో పేరొచ్చినా... ప్రోత్సాహకం వచ్చినా సమానంగా దక్కాల్సిందేనని డిమాండ్ చేశాడు. దిగ్గజ ఆటగాడి మాటకు విలువిచ్చిన బీసీసీఐ... ఏడాదికి పైగా యువ జట్టుకు సేవలందించిన కోచింగ్ సిబ్బందికి సమాన నజరానాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
This is why Rahul Dravid is not only my favourite cricketer but also my favourite person as well 🙏 https://t.co/xsSas8wdSV
— KTR (@KTRTRS) 26 February 2018
Comments
Please login to add a commentAdd a comment