జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ సెప్టెంబరుతో ముగియనుంది. అయితే ఎన్‌సీఏ హెడ్‌గా మరో ఏడాది కాలం పాటు అతడి పదవీకాలాన్ని పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది.
బెంగళూరు శివార్లలో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిరి్మస్తున్న కొత్త ఎన్‌సీఏ 2025లో ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష్మణ్ కొనసాగితే బాగుంటుందని బోర్డు భావించింది. కొన్నాళ్ల క్రితం వరకు వ్యక్తిగతంగా కొంత అనాసక్తి ప్రదర్శిస్తూ లక్ష్మణ్ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇప్పుడు బోర్డు జోక్యంతో అతను కొనసాగనున్నాడు. ఎన్‌సీఏ హెడ్‌గా ఉన్న సమయంలో ఇంజ్యూరీ మేనేజ్‌మెంట్, ప్లేయర్ రీహాబిలిటేషన్, కోచింగ్ కార్యక్రమాలు, వివిధ వయో విభాగాల క్రికెట్ టోరీ్నల ప్లానింగ్ వంటి అంశాల్లో లక్ష్మణ్ సమర్థంగా పని చేశాడు. ఎన్‌సీఏ కోచ్‌లు హృషికేశ్ కనిత్కర్, సాయిరాజ్ బహుతులే, షితాన్షు కొటక్ కూడా కొనసాగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment