ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్ ఐపీఎల్ 2024లో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చని ఎన్‌సీఏ క్లీన్ చిట్ ఇచ్చింది. రాహుల్ మరో రెండు రోజుల్లో జట్టుతో కలుస్తానడి పేర్కొంది.
అయితే సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో రాహుల్ కేవలం బ్యాటర్‌గా మత్రమే కొనసాగాలని కండీషన్ పెట్టింది. ప్రస్తుతం రాహుల్ వికెట్‌కీపింగ్ భారాన్ని మోస్తే అతని గాయం తిరగబెట్టవచ్చని హెచ్చరించింది.
కాగా, రాహుల్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా రాహుల్ ఆ సిరీస్‌లోని తదుపరి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. గతేడాది ఐపీఎల్ సందర్భంగా కూడా గాయపడిన రాహుల్ ఈ సీజన్‌కు కూడా దూరమవుతాడని అంతా అనుకున్నారు. అయితే అతను ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో త్వరగా కోలుకుని త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులోకి వచ్చాడు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే.. ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. లక్నో సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. జైపూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో లక్నో.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment