భారత మహిళల జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధిచిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు,మూడు టీ20లు ఆడనుంది. తొలి టీ20 దంబుల్లా వేదికగా జూన్23న జరగనుంది.
కాగా న్యూజిలాండ్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ తర్వాత భారత్‌కు ఇదే తొలి సిరీస్. ఇక భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత వన్డే కెప్టెన్‌గా హార్మన్ ప్రీత్ కౌర్ ఎంపికైంది. అదే విధంగా శ్రీలంకతో సిరీస్‌కు భారత వెటరన్ పేసర్ జూలన్ గోస్వామి వ్యక్తిగత కారణాలతో దూరమైంది.
శ్రీలంకతో వన్డే సిరీస్‌కి భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా, హర్లీన్ డియోల్
టి20 సిరీస్‌కి భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్
చదవండి: T20 World Cup2022: 'భారత్ ప్రపంచకప్ గెలవాలంటే అతడు ఖచ్చితంగా జట్టులో ఉండాలి'
📸 📸: Mr @VVSLaxman281 - Head Cricket, NCA - interacts with the Sri Lanka-bound #TeamIndia, led by @ImHarmanpreet. 👍 👍 pic.twitter.com/yVQNGjHaD8
— BCCI Women (@BCCIWomen) June 18, 2022
Comments
Please login to add a commentAdd a comment