
గాలే: భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనలో తలపడేందుకు సిద్ధమైంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ మూడో రౌండ్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 11, 13, 16 తేదీల్లో జరుగనుంది. 2021 ప్రపంచకప్ కోసం ఈ టోర్నీలను నిర్వహిస్తున్నారు. గత ప్రపంచకప్ రన్నరప్ భారత్ ఈ రేసులో నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
కానీ పాక్, విండీస్‌లతో జరిగిన సిరీస్‌ల్లో ఓడిపోవడంతో శ్రీలంక ఖాతానే తెరవలేదు. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టుకు భారత్‌తో ఈ సిరీస్ కీలకంగా మారింది. ‘మేం బాగా సన్నద్ధమయ్యాం. విండీస్‌లో జరగబోయే ప్రపంచ టి20 ఈవెంట్‌లో రాణించేందుకు సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడుతుంది’ అని కెప్టెన్ మిథాలీ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment