రెండో టీ20లో భారత్ గెలుపు | Indian Women cricket team won by 9 runs in second T20 | Sakshi

రెండో టీ20లో భారత్ గెలుపు

Published Sun, Jan 26 2014 2:24 PM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

Indian Women cricket team won by 9 runs in second T20

విజయనగరం: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు 9 పరుగులతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. గోస్వామి 23, శర్మ 23, సోనియా డాబిర్ 23, కృష్ణమూర్తి 16, మిథాలి రాజ్ 12 పరుగులు చేశారు.

128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. జయాంగిణి 40, సిరివర్థనే 21 పరుగులు చేశారు. మిగతా క్రీడాకారిణులు విఫలమవడంతో లంక ఓటమి పాలయింది. గోస్వామి, శర్మ, సోనియా డాబిర్, గ్వైక్వాడ్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమయింది. మొదటి టీ20లో లంక గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement