టి20 సిరీస్ నూ క్లీన్ స్వీప్ చేశారు
రాంచీ: శ్రీలంక మహిళలతో జరిగిన టి20 క్రికెట్ సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్ లో లంకను మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. కౌశల్య(25), జయాంగిని(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బిష్త్ 3, పాటిల్ 2 వికెట్లు పడగొట్టారు.
90 పరుగుల టార్గెట్ ను 37 బంతులు మిగిలుండగానే వికెట్ నష్టపోయి భారత్ చేరుకుంది. 13.5 ఓవర్లలో 91 పరుగులు చేసింది. మంధన 43, వనిత 34, వేద కృష్ణమూర్తి 13 పరుగులు చేశారు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను మిథాలీ సేన క్లీన్ స్వీప్ చేసింది.