ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక 75 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్‌ను 2–0తో దక్కించుకుంది. మొదట శ్రీలంక 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. కుశాల్ మెండిస్ (70; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), గుణతిలక (42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిసారా పెరీరా ( 31; 3 ఫోర్లు 1 సిక్స్), షనక (30; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం బంగ్లా 18.4 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మహ్మదుల్లా (41; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. గుణతిలక, మధుశంక రెండేసి వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment