ICC Womens Championship
-
భారత్‌దే సిరీస్
గాలె: ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత జట్టు 2–0తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన రెండో వన్డేలో మిథాలీ రాజ్ బృందం 7 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సరిగ్గా 50 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిథాలీ (121 బంతుల్లో 52; 4 ఫోర్లు), తాన్యా భాటియా (66 బంతుల్లో 68; 9 ఫోర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం లంక 48.1 ఓవర్లలో 212 పరుగులకు పరిమితమైంది. మాన్సి జోషి, రాజేశ్వరి చెరో 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరుగనుంది. -
శ్రీలంక మహిళలతో భారత్ పోరు
గాలే: భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనలో తలపడేందుకు సిద్ధమైంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ మూడో రౌండ్లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 11, 13, 16 తేదీల్లో జరుగనుంది. 2021 ప్రపంచకప్ కోసం ఈ టోర్నీలను నిర్వహిస్తున్నారు. గత ప్రపంచకప్ రన్నరప్ భారత్ ఈ రేసులో నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. కానీ పాక్, విండీస్‌లతో జరిగిన సిరీస్‌ల్లో ఓడిపోవడంతో శ్రీలంక ఖాతానే తెరవలేదు. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టుకు భారత్‌తో ఈ సిరీస్ కీలకంగా మారింది. ‘మేం బాగా సన్నద్ధమయ్యాం. విండీస్‌లో జరగబోయే ప్రపంచ టి20 ఈవెంట్లో రాణించేందుకు సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడుతుంది’ అని కెప్టెన్ మిథాలీ చెప్పింది. -
చివరి వన్డేలోనూ భారత మహిళల ఓటమి
వడోదర: ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లోనూ భారత్ ఓడింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 97 పరుగులతో నెగ్గింది. దీంతో మిథాలీ బృందం 0–3తో సిరీస్ కోల్పోయింది. మొదట అలీసా హీలీ (133; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) విజృంభణతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7వికెట్లకు 332 పరుగులు చేసింది. అనంతరం మిథాలీ బృందం 44.4 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన (52; 10 ఫోర్లు) జెమీమా (42; 7 ఫోర్లు) రాణించారు. -
పరువు నిలబెట్టుకోవాలని...
వడోదర: ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన మిథాలీ బృందం ఆదివారం జరిగే చివరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఆసీస్‌ను నిలువరించాలంటే భారత్ సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బ్యాటింగ్‌లో స్మృతి మంధాన మెరుపులు మినహా మిగతావారు ఆకట్టుకోలేకపోయారు. ఆమెకు తోడు కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. మరోవైపు సీనియర్ పేసర్ జులన్ గోస్వామి గైర్హాజరీలో శిఖా పాండే, పూజ వస్త్రకర్ ప్రభావం చూపలేకపోతున్నారు. స్పిన్నర్లు ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్ కూడా ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు టాపార్డర్ రాణించడంతో రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆసీస్ ఆదివారం జరిగే పోరులోనూ గెలవాలని చూస్తోంది. రెండు వన్డేల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన బోల్టన్‌తో పాటు పెర్రీ, మూనీ, కెప్టెన్ మెగ్ లానింగ్ ఫామ్‌లో ఉండటం కంగారూలకు కలిసొచ్చే అంశం. -
విజయం కోసం...
వడోదర: ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్ తొలి వన్డేలో ఓటమి పాలైన భారత మహిళల జట్టు నేడు జరుగనున్న రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అస్వస్థత కారణంగా తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డిం గ్లో సమష్టిగా విఫలమైన భారత్ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. గురువారం జరుగనున్న మ్యాచ్‌లో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఉదయం గం. 9.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
స్మృతి మంధన డకౌట్
పోట్చెస్ట్రూమ్ : ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధన డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిథాలీ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో 88, రెండో వన్డేలో సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన డాషింగ్ ఓపెనర్ మంధన ఈ మ్యాచ్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచారు. దీంతో భారత మహిళలు పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ (4) సైతం త్వరగా ఔటై పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో ఓపెనర్ దీప్తీ శర్మతో వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. జట్టు స్కోరు 57 పరుగుల వద్ద హర్మన్(25) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. దీంతో భారత్ 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో దీప్తీ శర్మ(33), వేద కృష్ణమూర్తి(25)లు పోరాడుతున్నారు. 25 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 88/3 -
మహిళల వన్డే కూడా రద్దు
భారత్‌పై 2-0తో సిరీస్ ఇంగ్లండ్ కైవసం లండన్: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అటు భారత్, ఇంగ్లండ్ పురుషుల జట్ల వన్డేతో పాటు ఈ రెండు దేశాల మహిళల జట్ల మధ్య జరగాల్సిన వన్డే కూడా రద్దయింది. లార్డ్స్‌లో సోమవారం జరగాల్సిన ఈ మూడో వన్డే రద్దు కావడంతో... మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ మహిళల జట్టు 2-0తో కైవసం చేసుకుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరిగినందున... ఇంగ్లండ్‌కు ఐదు పాయింట్లు, భారత్‌కు ఒక పాయింట్ దక్కాయి.