
వడోదర: ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లోనూ భారత్ ఓడింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 97 పరుగులతో నెగ్గింది. దీంతో మిథాలీ బృందం 0–3తో సిరీస్ కోల్పోయింది. మొదట అలీసా హీలీ (133; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) విజృంభణతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7వికెట్లకు 332 పరుగులు చేసింది. అనంతరం మిథాలీ బృందం 44.4 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన (52; 10 ఫోర్లు) జెమీమా (42; 7 ఫోర్లు) రాణించారు.