కమలేశ్ జైన్(PC: Twitter)
Indian Cricket Team: ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రధాన సిబ్బందిలో ఒకరైన కమలేశ్ జైన్ బంపరాఫర్ కొట్టేశారు. టీమిండియా హెడ్ ఫిజియోగా ఆయన ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ కార్యదర్శి, ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లను ఆయన మెప్పించినట్లు సమాచారం.
ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు ఫిజియోగా కమలేశ్ నియామకం దాదాపు ఖరారైనట్లేనని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. కాగా మాజీ ఫిజియో నితిన్ పటేల్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్‌గా వెళ్లిన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ ఇంటర్వ్యూలు నిర్వహించింది.
ఇక 2012 నుంచి కేకేఆర్‌తో ఉన్న కమలేశ్.. 2022లో ప్రధాన ఫిజియోగా ప్రమోట్ అయ్యారు. ఇక ఇప్పుడు టీమిండియాలో భాగమయ్యే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.కాగా కమలేశ్ జైన్ చెన్నైకి చెందినవారు.
చదవండి👉🏾Kane Williamson: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment