Kamlesh
-
కేకేఆర్ కమలేశ్‌కు బంపరాఫర్.. ఏకంగా టీమిండియాతో! కీలక బాధ్యత!
Indian Cricket Team: ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రధాన సిబ్బందిలో ఒకరైన కమలేశ్ జైన్ బంపరాఫర్ కొట్టేశారు. టీమిండియా హెడ్ ఫిజియోగా ఆయన ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ కార్యదర్శి, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లను ఆయన మెప్పించినట్లు సమాచారం. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు ఫిజియోగా కమలేశ్ నియామకం దాదాపు ఖరారైనట్లేనని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. కాగా మాజీ ఫిజియో నితిన్ పటేల్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్‌గా వెళ్లిన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇక 2012 నుంచి కేకేఆర్‌తో ఉన్న కమలేశ్.. 2022లో ప్రధాన ఫిజియోగా ప్రమోట్ అయ్యారు. ఇక ఇప్పుడు టీమిండియాలో భాగమయ్యే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.కాగా కమలేశ్ జైన్ చెన్నైకి చెందినవారు. చదవండి👉🏾Kane Williamson: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ -
హిందూ సమాజ్ నేత దారుణ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అంతగా గుర్తింపు లేని రాజకీయ పార్టీ హిందూ సమాజ్ అధ్యక్షుడు కమలేష్ తివారీ (45) దారుణ హత్యకు గురయ్యారు. లక్నోలో అత్యంత రద్దీగా ఉండే నాకా హిందోలా ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో శవమై కనిపించారు. లక్నో పశ్చిమ ఏఎస్పీ వికాస్ త్రిపాఠీ అందించిన వివరాల ప్రకారం కమలేష్ తివారీని ఆయన ఇంట్లోనే అతి దారుణంగా హత్య చేశారు. హత్యకు ముందు ఇద్దరు వ్యక్తులు ఆయనను కలవడానికి వచ్చారు. వారితో మాట్లాడుతున్న తివారీ పాన్ల కోసం తన అనుచరుడ్ని బయటకి పంపించారు. మార్కెట్ నుంచి అతను తిరిగి వచ్చేసరికి జరగరాని ఘోరం జరిగిపోయింది. రక్తపు మడుగులో తివారీ శవమై కనిపించారు. తివారీని కలవడానికి వచ్చినవారు ఆ ఇంట్లో అరగంట కంటే ఎక్కువ సేపు గడిపినట్టు పోలీసులు చెబుతున్నారు. హంతకుల్ని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. హిందూ మహాసభతో విభేదాల కారణంగా బయటకు వచ్చిన తివారీ హిందూ సమాజ్ పార్టీని స్థాపించారు. తివారీ హత్య కేసులో ఐదుగురి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముస్లిం మత గురువు అన్వర్-ఉల్ -హక్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తివారీ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్తను హత్య చేసేందుకు మహ్మద్ ముఫ్తీ నదీమ్ కాజ్మి, ఇమామ్ మౌలానా అన్వర్-ఉల్-హక్ కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త తలకు రూ.1.5 కోట్లు వెల కట్టారని ఆరోపించారు. కమలేష్ తివారీ హత్యకు సూరత్‌లో కుట్ర చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురిని సూరత్‌లో శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు తీసుకొచ్చారు. కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చి నివాళి అర్పించే వరకు తివారీ పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. తివారీ హత్య నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్నోతో పాటు పలు ప్రాంతాల్లో భద్రతను యూపీ పోలీసులు కట్టుదిట్టం చేశారు. -
దారిచూపే ఫుట్‌పాత్ స్కూల్!
స్ఫూర్తి ‘‘కమలేష్‌కు పిచ్చిగాని పట్టలేదు కదా?!’’ ‘‘నాకూ అలాగే అనిపిస్తోంది’’ ‘‘ఉన్న వ్యాపారమేదో చేసుకోక... ఏమిటీ పని?’’ పది సంవత్సరాల క్రితం అహ్మదాబాద్(గుజరాత్)లోని భూదర్పురాలో...సరిగ్గా ఇలాంటి మాటలే వినిపించాయి. దీనికి కారణం కమలేష్ పర్మర్ స్కూల్ పెట్టాలనుకోవడం, అది కూడా ఫుట్‌పాత్ మీద! నిజానికి, కమలేష్ తన వ్యాపారమేదో తాను చేసుకునే రకమే. అయితే ఒక చిన్న సంఘటన అతనిలో మార్పు తీసుకువచ్చింది. ఒకరోజు తన కొడుకును స్కూలు నుంచి తీసుకునిఒక మురికివాడ మీదుగా వస్తుండగా కొందరు పిల్లలు కనిపించారు. వాళ్లతో కమలేష్‌కు మాట్లాడాలనిపించింది. ‘‘ఏరా... చదువుకుంటున్నారా?’’ అని అడిగాడు. ‘‘చదువుకుంటున్నాం’’ అని స్కూలు పేరు కూడా చెప్పారు. ఎలా చదువుతున్నారో తెలుసుకోవడానికి ఆ పిల్లలను చిన్న చిన్న ప్రశ్నలు అడిగాడు కమలేశ్. ఒక్కరూ ఒక్క సమాధానం చెప్పలేదు. స్కూలుకు వెళుతున్నారనే మాటేగానీ... వారికి ఏమీ తెలియదనే విషయం ఆయనకు అర్థమైంది. మనసుకు బాధ కలిగింది. పిల్లాడిని రోజూ స్కూలు నుంచి తీసుకువచ్చే క్రమంలో మురికివాడలో తప్పనిసరిగా ఆగేవాడు. స్కూల్లో ఏం చెబుతున్నారు? ఇంట్లో ఎంత సమయం చదువుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో అడిగేవాడు. ‘‘ఈయనకు పెద్దగా పనేమీ లేనట్లు ఉంది’’ అనుకునేవాళ్లు ఆ పిల్లల తల్లిదండ్రులు. ఇంటికొచ్చి భోజనం చేస్తున్నప్పుడు అతనిలో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. తింటూనే ఆలోచించడం మొదలుపెట్టాడు. ‘అవును. నేను ఆ పిల్లల కోసం స్కూలు ఒకటి మొదలు పెట్టాలి’ అనుకున్నాడు. తాను పెద్దగా చదువుకోలేదు. బోధన చేసిన పూర్వానుభవం కూడా లేదు. కానీ ఒక మంచి ఆలోచన ముందు దారులన్నీ తమకు తాము తెరుచుకుంటాయి కదా! బ్లాక్‌బోర్డు, చాక్‌పీసులు కొనగలడు. మరి స్థలం సంగతి? స్థలం అద్దెకు తీసుకొని స్కూలు నడిపేంత స్థోమత తనకెక్కడ ఉంది? అప్పుడు అతని దృష్టి ఫుట్‌పాత్ మీద పడింది. ‘ఫుట్‌పాత్ స్కూలు’ అన్నాడు కాస్త గట్టిగానే. దేవతలు తథాస్తు అనే ఉంటారు. మురికివాడల్లోకి వెళ్లి తన ఆలోచన గురించి చెప్పినప్పుడు పిల్లల తల్లిదండ్రులు వింతగా చూశారు. ‘‘గవర్నమెంట్ స్కూళ్లలోనే చదువు సరిగ్గా చెప్పడం లేదు. మీరేం చెబుతారు’’ అన్నారు ఒకరిద్దరు. వాళ్లను ఒప్పించడం తలకు మించిన భారం అయింది. ఎట్టకేలకు తమ పిల్లలను బడికి పంపించడానికి ఒప్పుకున్నారు. ‘‘మా వాడికి ఒక్క ముక్క చదువు రాదయ్యా... మీ స్కూల్లో చేర్పించుకొని వాడిని దారిలో పెట్టండి’’ అనేవాళ్ల సంఖ్య పెరుగుతూ పోయింది. ‘‘కమలేష్ సార్ అందరికీ అర్థమయ్యేలా చక్కగా పాఠం చెబుతారు. గతంలో వేరే స్కూలులో చదువుకున్నాను. అప్పుడు స్కూలుకు వెళ్లాలంటే భయగా ఉండేది. ఇప్పుడు మాత్రం సంతోషంగా ఉంది’’ అంటున్నాడు ఏడు సంవత్సరాల యశ్ పర్మర్. విశేషం ఏమిటంటే, గతంలో కమలేష్ దగ్గర చదువుకున్న విద్యార్థులలో కొందరు వీలు చేసుకొని ఈ ఫుట్‌పాత్ స్కూల్లో పాఠాలు బోధిస్తున్నారు. ‘‘ఆయన గురించి ఏం చేయడానికి అయినా సిద్ధమే’’ అంటున్నాడు త్వరలో డిగ్రీ పట్టా పుచ్చుకోనున్న జ్యోతినాథ్ వాఘేలా. ‘‘ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఆయన పేద పిల్లల కోసం పాటు పాడుతున్నాడు. ఆయన ఎప్పుడూ అడిగిన నా స్థాయిలో ఆర్థిక సాయం చేయడానికి సిద్ధం’’ అంటున్నారు తులసీరామ్ అనే చిరువ్యాపారి. కమేలేష్ ఒక్కడుగా మొదలు పెట్టిన పనికి ఇప్పుడు అనేక చేతులు తోడయ్యాయి. అరవై ఏడు సంవత్సరాల ఈ పెద్దాయన కోరుకున్నది కూడా అదే!