కర్మాగారంలో కార్మికుడి మృతి | labourer died in factory | Sakshi
Sakshi News home page

కర్మాగారంలో కార్మికుడి మృతి

Published Fri, Jan 20 2017 12:12 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

labourer died in factory

హిందూపురం రూరల్‌ : మండలంలోని మణేసముద్రం సమీపంలో ఏ1 స్టీల్‌ పరిశ్రమలో క్రేన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివపాల్‌ యాదవ్‌(42) అనే కార్మికుడు గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. విధి నిర్వహణలో ఉండగా క్రేన్‌ నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడని వివరించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement