ఒక చారీటీ దుకాణంలో దొరికిన బ్యాంకు నోటు ఆన్‌లైన్ వేలంలో అత్యంత అధిక ధరకు అమ్ముడుపోయింది. ఆ నోటు విలుకంటే అధిక రెట్లు అమ్ముడుపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఏంటా కరెన్సీ నోటు? ఆ నోటుకి ఉన్న ప్రత్యేకత ఏంటో అనే కదా!
వివరాల్లోకెళ్తే....పాలస్తీనాలోని ఎసెక్స్‌లో ఆక్స్‌ఫామ్ వాలంటీర్ పాల్ అనే వ్యక్తి బ్రెంట్‌వుడ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నప్పుడు 100 పౌండ్ల కరెన్సీ నోటు దొరికింది. అది 1927 ఏళ్ల నాటి బ్రిటిష్ మాండేట్ సమయంలో ఉన్నత స్థాయి అధికారులు జారీ చేసిన నోటు. ఆ నోటును పాల్ తన ఇంటి అరమారలో ఉంచాడు. ఆ తర్వాత దాన్ని అలా ఉంచకూడదని లండన్‌లోని స్పింక్ వేలం హౌస్‌లో వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడువుగా ఆ నోటుని ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచగానే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 1.3 కోట్ల రూపాయలు పలికింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి ఆనోటు విలువ కేవలం రూ. 29 లక్షలు కానీ వేలంలో ఊహించని విధంగా అధిక ధర పలకింది. ఈ మొత్తం ఆక్స్‌ఫామ్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వెళ్తుందని బ్రిటిష్ మీడియా తన నివేదికలో పేర్కొంది. ఇంతకీ ఈ ఆక్స్‌ఫామ్ సంస్థ తూర్పు ఆఫ్రికాలో కరువు పీడిత ప్రజలకు, ఉక్రెయిన్ నుండి వచ్చిన శరణార్థులను అక్కున చేర్చుకుని సేవలందిస్తోంది.
(చదవండి: ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది)
Comments
Please login to add a commentAdd a comment