Bank notes
-
అనుపమ్ ఖేర్ బొమ్మ కరెన్సీతో బురిడీ
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్‌ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్‌కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్‌తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్‌రంగ్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రూ.7,409 కోట్ల విలువైన 2,000 నోట్లు ఇంకా ప్రజల్లోనే..
ముంబై: ఉపసంహరించిన రూ. 2000 డినామినేషన్ బ్యాంకు నోట్లలో 97.92 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం తెలిపింది. ప్రజల వద్ద ఇప్పటికీ రూ.7,409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. ఉపసంహరణ ప్రకటించిన గత ఏడాది మే 19న బిజినెస్ వ్యవహార సమయం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఈ ఏడాది జూలై 31న ఇదే సమయానికి ఈ విలువ రూ.7,409 కోట్లకు తగ్గింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం, లేదా మార్చుకునే సౌకర్యం దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లలో 2023 అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంది. అటుపై 2023 అక్టోబర్ 9వ తేదీ నుండి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2000 నోట్లను స్వీకరిస్తున్నాయి. ప్రజలు రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపడానికి తగిన సౌలభ్యతను కూడా కలి్పంచడం జరిగింది. 2016 నవంబర్‌లో అప్పుడు అమలులో ఉన్న రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. -
97.5% రూ.2,000 నోట్లు వచ్చేశాయ్..!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలోకి 97.5 శాతం రూ.2,000 బ్యాంక్ నోట్లు తిరిగి వచ్చేసినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. ఇంకా ప్రజాబాహుళ్యంలో రూ.8,897 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నట్లు పేర్కొంది. ‘‘రూ. 2,000 బ్యాంకు నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 2024 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జనవరి 31వ తేదీన వ్యాపారం ముగిసే సమయానికి ఈ విలువ రూ. రూ.8,897 కోట్లకు తగ్గింది’’ అని ఆర్బీఐ తాజా ప్రకటన వివరించింది. -
అరుదైన కరెన్సీ నోటు వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా!
ఒక చారీటీ దుకాణంలో దొరికిన బ్యాంకు నోటు ఆన్లైన్ వేలంలో అత్యంత అధిక ధరకు అమ్ముడుపోయింది. ఆ నోటు విలుకంటే అధిక రెట్లు అమ్ముడుపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఏంటా కరెన్సీ నోటు? ఆ నోటుకి ఉన్న ప్రత్యేకత ఏంటో అనే కదా! వివరాల్లోకెళ్తే....పాలస్తీనాలోని ఎసెక్స్‌లో ఆక్స్‌ఫామ్ వాలంటీర్ పాల్ అనే వ్యక్తి బ్రెంట్వుడ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నప్పుడు 100 పౌండ్ల కరెన్సీ నోటు దొరికింది. అది 1927 ఏళ్ల నాటి బ్రిటిష్ మాండేట్ సమయంలో ఉన్నత స్థాయి అధికారులు జారీ చేసిన నోటు. ఆ నోటును పాల్ తన ఇంటి అరమారలో ఉంచాడు. ఆ తర్వాత దాన్ని అలా ఉంచకూడదని లండన్‌లోని స్పింక్ వేలం హౌస్‌లో వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆ నోటుని ఆన్లైన్లో వేలానికి ఉంచగానే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 1.3 కోట్ల రూపాయలు పలికింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి ఆనోటు విలువ కేవలం రూ. 29 లక్షలు కానీ వేలంలో ఊహించని విధంగా అధిక ధర పలకింది. ఈ మొత్తం ఆక్స్‌ఫామ్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వెళ్తుందని బ్రిటిష్ మీడియా తన నివేదికలో పేర్కొంది. ఇంతకీ ఈ ఆక్స్‌ఫామ్ సంస్థ తూర్పు ఆఫ్రికాలో కరువు పీడిత ప్రజలకు, ఉక్రెయిన్ నుండి వచ్చిన శరణార్థులను అక్కున చేర్చుకుని సేవలందిస్తోంది. (చదవండి: ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది) -
కోవిడ్‌తో విలవిల..
బీజింగ్: చైనాలో కోవిడ్–19 మృతుల సంఖ్య రోజురోజుకూ ఎగబాకుతోంది. ఇప్పటివరకూ ఈ వైరస్ బారిన పడి 1,523 మంది మరణించగా మొత్తం 66వేల మంది దీని బారినపడినట్లు నిర్ధారణ అయిందని చైనా ఆరోగ్య కమిషన్ శనివారం వెల్లడించింది. చైనా మొత్తమ్మీద కోవిడ్ బారిన పడినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 66,492కు చేరుకోగా, వీరిలో 11, 053 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య 8096కు పెరిగింది. కోవిడ్ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ తగ్గుతోందని చైనా ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించిందని, వ్యాధికి కేంద్రబిందువుగా భావిస్తున్న హుబే ప్రాంతం మినహా మిగిలిన చోట్ల తగ్గుదల నమోదవుతోందని తెలిపింది. ఇదిలా ఉండగా.. కోవిడ్–19ను నియంత్రించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా వంటి టెక్నాలజీలను వాడాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఆ తల్లీ బిడ్డ డిశ్చార్జ్ కోవిడ్ బారినపడ్డ 67 రోజుల వయసున్న పసిబిడ్డ చికిత్స తర్వాత∙ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి విడుదలైంది. జియాంగ్ అనే ఇంటిపేరున్న ఈ బిడ్డను హుబేలోని సెంట్రల్ ఆసుపత్రిలో చేర్చారు. గుయిఝూ ప్రాంతం నుంచి సెలవులు గడిపేందుకు గత నెల 16న హుబే వచ్చిన జియాంగ్ తల్లిదండ్రులకు వ్యాధి సోకినట్లు జనవరి 25న నిర్ధారణ అయింది. ఇదే సమయంలో బిడ్డలోనూ వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో ఫిబ్రవరి రెండవ తేదీ జియాంగ్ను ఆసుపత్రిలో చేర్పించడం తెల్సిందే. వచ్చే వారం 406 మంది విడుదల? ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వూహాన్ నుంచి తీసుకొచ్చి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కేంద్రాల్లో పర్యవేక్షణలో ఉంచిన 406 మందిని వచ్చే వారం విడుదల చేసే వీలుంది. కోవిడ్ సోకలేదని నిర్ధారణ చేసుకున్నాకే విడుదలచేస్తారని అధికారులు శనివారం తెలిపారు. 650లో 406 మందిని న్యూఢిల్లీలోని ఐటీబీపీ కేంద్రాల్లో పర్యవేక్షణలో ఉంచగా, మిగిలిన వారిని మానేసర్‌లోని సైనిక శిబిరంలో పర్యవేక్షణలో ఉంచారు. ఆ కరెన్సీ నోట్ల చలామణీ బంద్ కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు చైనా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వైరస్‌ను నియంత్రించే లక్ష్యంతో తాజాగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధికి కేంద్రబిందువుగా భావిస్తున్న ప్రాంతాల్లోని కరెన్సీ నోట్ల చలామణీని తాత్కాలికంగా ఆపేశారు. ఈ నోట్ల ద్వారా వైరస్ ఇతరులకు సోకుతుందేమో అన్న అనుమానంతో ఈ చర్యలు చేపట్టినట్లు అంచనా. పాతనోట్ల స్థానంలో కొత్తనోట్లు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వైస్ గవర్నర్ ఫాన్ వైఫీ తెలిపారు. కోవిడ్‌కు విరుగుడుగా చైనా వైద్యం? కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు చైనా సంప్రదాయ వైద్యాన్ని సమర్థంగా ఉపయోగిస్తోంది. వ్యాధి సోకిందని నిర్ధారణ అయిన వారిలో కనీసం సగంమందికి సంప్రదాయ వైద్యంతో సాంత్వన చేకూరిందని చైనా ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న హుబేలో తాము అల్లోపతితోపాటు చైనీస్ వైద్యం అందించడం మొదలుపెట్టామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఉపాధ్యక్షుడు వాంగ్ హెషింగ్ తెలిపారు. అల్లోపతి వైద్యంలో కరోనా వైరస్ నివారణకు నిర్దిష్టమైన చికిత్సలేకపోవడంతో ఈ వార్తకు ప్రాధాన్యమేర్పడింది. -
దేశవ్యాప్తంగా 110 ప్రాంతాల్లో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: సీబీఐ అధికారులు మంగళవారం రికార్డు స్థాయిలో సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 110 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను ప్రధాని మోదీ హయాంలో అవినీతిపై చేపట్టిన అతిపెద్ద చర్యగా భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ.250 కోట్ల స్కాలర్ షిప్ కుంభకోణానికి సంబంధించి పలు విద్యా సంస్థలపై దాడులు జరిపింది. అదేవిధంగా, యూపీలో రద్దయిన నోట్ల చెలామణీ ఆరోపణలపై నాలుగుచోట్ల సోదాలు జరిపింది. రూర్కెలాలోని బోకారో స్టీల్ ప్లాంట్‌లో అవినీతి కేసులో రాంచీ, బొకారో, కోల్‌కతాలోని అధికారుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ.. అవినీతి, నేర పూరిత ప్రవర్తన, ఆయుధాల స్మగ్లింగ్ తదితర నేరాలకు సంబంధించి 30 కేసులు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఆయుధాల లైసెన్స్ జారీలో అక్రమాలకు సంబంధించి 13 చోట్ల సోదాలు చేశామని సీబీఐ తెలిపింది. మంగళవారం ఉదయం ఏకకాలంలో ప్రారంభమైన ఈ సోదాల్లో 500 మంది అధికారులు పాల్గొన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నగదు, నగలతోపాటు పలు బ్యాంకు పత్రాలు, స్థిరాస్తులు, మ్యూచువల్ ఫండ్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. రూ.1,139 కోట్ల బ్యాంకింగ్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ గత వారం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 చోట్ల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. -
మొత్తం నాణేలే..!
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ మండలం కనుకుల ఎస్బీ హెచ్ లో శనివా రం కరెన్సీ కొరతతో పూర్తిగా రూ.10 నాణేలనే పంపిణీ చేశారు. బ్యాంకులో నోట్లు కాకుండా రూ.33 లక్షల విలువైన రూ.10 నాణేలే వచ్చా యి. దాదాపు రూ.2.50 లక్షలను నాణేలుగానే ఇవ్వడంతో ఖాతాదారులు బ్యాంకు ముందు కూర్చొని ఇలా లెక్కించుకుంటున్నారు. పోలీసులు నాణేల పంపిణీని నిలిపివేయించడంతో సిబ్బందితో వాగ్వాదం సద్దుమణిగినిగింది.. -
మన రూపాయే మహారాజు..
ప్రపంచంలో అమెరికన్ డాలర్‌కు ఉండే ప్రాధాన్యం ఎలా ఉన్నా.. మన రూపాయికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య విషయంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే మన రూపాయి చాలా ముందుంటుంది. దేశీ కరెన్సీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలివీ.. 1. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2012-13 నాటికి దేశంలో అక్షరాలా 7,647 కోట్ల బ్యాంకు నోట్లు చలామణీలో ఉన్నాయి. అమెరికన్ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు. అమెరికాలో 3,450 కోట్ల నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయి. యూరోజోన్‌తో పోలిస్తే అయిదు రెట్లు ఎక్కువ. అక్కడ 1,580 కోట్ల కరెన్సీ నోట్లు చలామణీలో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, యూరోజోన్ , ఆస్ట్రేలియా, కెనడా కరెన్సీ నోట్లన్నీ కలిపినా కూడా మన ముందు బలాదూరే. ఇవన్నీ కలి పినా సంఖ్య 5,644 కోట్ల క్యాష్ నోట్లను మించదు. ఇక, నాణేల విషయానికొస్తే.. మన దగ్గర 8,991 కోట్ల కాయిన్లు సర్క్యులేషన్లో ఉన్నాయి. 2. విలువ పరంగా చూస్తే మన కరెన్సీ నోట్ల విలువ రూ. 12,46,800 కోట్లు కాగా, కాయిన్ల విలువ రూ. 16,800 కోట్ల పైచిలుకు ఉంటుంది. అదే అమెరికన్ కరెన్సీ నోట్ల విలువ 1,198 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 72 లక్షల కోట్లు). 3. మన దగ్గర కరెన్సీ నోట్ల ముద్రణ కూడా భారీగానే ఉంటోంది. 2013లో ప్రపంచవ్యాప్తంగా 15,400 కోట్ల కరెన్సీ నోట్లను ముద్రించగా, భారత్ సుమారు 2,000 కోట్ల నోట్లను ముద్రించింది. దాదాపు 5,400 కోట్ల నోట్లతో చైనా అగ్ర స్థానంలో నిల్చింది. 4. డబ్బు ముద్రించడానికే కాదు.. పాతబడిపోయినవాటిని ధ్వంసం చేయడానికీ బోలెడంత ఖర్చవుతుంది. ఇందుకు కావాల్సిన యంత్రాల కొనుగోలు, మెయింటెనెన్స్‌కు ఆర్బీఐకి రూ. 523 కోట్లు ఖర్చయ్యింది. 5. కరెన్సీ ముద్రణ ఖర్చుల విషయానికొస్తే.. రూ.10 విలువ ఉండే నోటును ప్రింట్ చేయాలంటే 96 పైసలు ఖర్చవుతుంది. అదే రూ. 100 నోటు ముద్రణకు రూ. 1.79 వ్యయమవుతుంది. రూ. 20 నోటుకు రూ. 1.50, రూ. 50 నోటుకు రూ. 1.81 ఖర్చవుతుంది. 100 నోటు కన్నా 50 రూపాయల నోటు ముద్రణ ఖర్చే ఎక్కువ ఉండటం గమనార్హం. ఇక, రూ. 500 నోటును ప్రింట్ చేయడానికి రూ. 3.58, రూ. 1,000 నోటు ముద్రణకు రూ. 4.06 ఖర్చవుతుంది. పదిరూపాయల నాణెం తయారికి రూ. 6.10 వ్యయమవుతుంది.