Published
Fri, Feb 2 2024 6:15 AM
| Last Updated on Fri, Feb 2 2024 10:24 AM
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలోకి 97.5 శాతం రూ.2,000 బ్యాంక్ నోట్లు తిరిగి వచ్చేసినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. ఇంకా ప్రజాబాహుళ్యంలో రూ.8,897 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నట్లు పేర్కొంది.
‘‘రూ. 2,000 బ్యాంకు నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 2024 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జనవరి 31వ తేదీన వ్యాపారం ముగిసే సమయానికి ఈ విలువ రూ. రూ.8,897 కోట్లకు తగ్గింది’’ అని ఆర్‌బీఐ తాజా ప్రకటన వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment