ముంబై: రిజర్వ్ బ్యాంక్ తాజాగా తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వినియోగంపై మరింతగా దృష్టి పెడుతోంది. బ్యాంకింగ్ పర్యవేక్షణ అవసరాలకు వీటిని వినియోగించుకునేలా తగు సిస్టమ్స్‌ను రూపొందించేందుకు అంతర్జాతీయ కన్సల్టెన్సీలు మెకిన్సే అండ్ కంపెనీ, యాక్సెంచర్ సొల్యూషన్స్‌ను ఎంపిక చేసింది. భారీ డేటాబేస్‌ను విశ్లేషించేందుకు, బ్యాంకులు.. ఎన్‌బీఎఫ్‌సీల నియంత్రణను మెరుగుపర్చేందుకు ఈ సిస్టమ్స్ ఉపయోగపడనున్నాయి.
ఈ కాంట్రాక్టు విలువ రూ. 91 కోట్లు. ఆర్‌బీఐ గతేడాది సెప్టెంబర్‌లో ఏఐ, ఎంఎల్ కన్సల్టెంట్ల నియామకం కోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహా్వనించింది. ప్రాథమిక మదింపులో ఏడు సంస్థలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. బోస్టన్ కన్సలి్టంగ్ గ్రూప్ (ఇండియా), డెలాయిట్ టచ్ తోమాత్సు ఇండియా, ఎర్న్‌స్ట్ అండ్ యంగ్, కేపీఎంజీ అష్యూరెన్స్ అండ్ కన్సలి్టంగ్ సరీ్వసెస్ తదితర సంస్థలు కూడా పోటీపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment