McKinsey and Company
-
అందుకే వృద్ధులకు ఉపాధి కరవు: మెకిన్సే నివేదిక
రిటైర్మెంట్ గడువు దగ్గర పడుతున్న వారిలో, పదవి విరమణ పొందిన వారిలో ఇంకా పని చేయాలనే తపన చూస్తూంటాం. అందుకు వారు ఎంతో ప్రయత్నించాలి. వయసు భారం అనుకోకుండా సరైన నైపుణ్యాలు ఉంటే ఎన్నో అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయంగా ఇంకా పనిచేయాలనుకునే వృద్ధులతో పోలిస్తే భారతీయ వృద్ధులకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు మెకిన్సే హెల్త్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ రిపోర్ట్ పేర్కొంది. అందుకుగల కొన్ని కారణాలను విశ్లేషించింది. మెకిన్సే 21 దేశాల్లోని 55 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న దాదాపు 21,000 మందిపై సర్వే చేసి ఈ నివేదిక రూపొందించింది. అందులో 1,000 మంది భారతీయులున్నారు. నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియా 7.8 శాతం జీడీపీ వృద్ధిరేటు సాధించాలంటే వృద్ధులుసైతం పనిచేయాలని గతంలో కొందరు అభిప్రాయపడ్డారు. కొంతమంది భారతీయ వృద్ధులకు ఇప్పటికీ కుటుంబ సంరక్షణే భారంగా మారుతోంది. మరికొందరు సంపన్నులను అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. అన్నీ అనుకూలంగా ఉన్నవారు సాంకేతికతపై, స్మార్ట్ఫోన్ల వాడకంపై ఆసక్తి చూపినప్పటికీ దాన్ని పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు. ఇదీ చదవండి: పాతపద్ధతే మేలు.. ‘ఎక్స్’ ప్రకటన నాలెడ్జ్ గ్యాప్, వారు అధికంగా పనిచేయకపోవడం వంటి అడ్డంకులున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి వారికి సరైన శిక్షణ ఇవ్వడంతోపాటు అవగాహన పెంపొందించడం ఎంతో అవసరం. 55-64 ఏళ్ల వయసు ఉన్న వారిలో కంటే 80 ఏళ్లు దాటిన వారిలో 20-25 శాతం అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలపై అవగాహన, ఆర్థిక ప్రణాళిక, నైపుణ్య శిక్షణతో దిగువ మధ్యతరగతి వృద్ధుల కుటుంబాల్లో ఆదాయ మార్గాలను పెంపొందించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. -
ఏఐ వినియోగంపై ఆర్బీఐ దృష్టి
ముంబై: రిజర్వ్ బ్యాంక్ తాజాగా తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వినియోగంపై మరింతగా దృష్టి పెడుతోంది. బ్యాంకింగ్ పర్యవేక్షణ అవసరాలకు వీటిని వినియోగించుకునేలా తగు సిస్టమ్స్‌ను రూపొందించేందుకు అంతర్జాతీయ కన్సల్టెన్సీలు మెకిన్సే అండ్ కంపెనీ, యాక్సెంచర్ సొల్యూషన్స్‌ను ఎంపిక చేసింది. భారీ డేటాబేస్‌ను విశ్లేషించేందుకు, బ్యాంకులు.. ఎన్‌బీఎఫ్‌సీల నియంత్రణను మెరుగుపర్చేందుకు ఈ సిస్టమ్స్ ఉపయోగపడనున్నాయి. ఈ కాంట్రాక్టు విలువ రూ. 91 కోట్లు. ఆర్బీఐ గతేడాది సెప్టెంబర్‌లో ఏఐ, ఎంఎల్ కన్సల్టెంట్ల నియామకం కోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహా్వనించింది. ప్రాథమిక మదింపులో ఏడు సంస్థలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. బోస్టన్ కన్సలి్టంగ్ గ్రూప్ (ఇండియా), డెలాయిట్ టచ్ తోమాత్సు ఇండియా, ఎర్న్స్ట్ అండ్ యంగ్, కేపీఎంజీ అష్యూరెన్స్ అండ్ కన్సలి్టంగ్ సరీ్వసెస్ తదితర సంస్థలు కూడా పోటీపడ్డాయి. -
ప్రపంచాన్ని ఊపేస్తున్న మెటావర్స్ ఫీవర్..వినియోగంలోకి వచ్చేది అప్పుడే!
న్యూఢిల్లీ : మెటావర్స్కు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వినియోగంలోకి రావడానికి మరో 8–10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. 2030 నాటికి రిటైల్, తయారీ, మీడియా, హెల్త్‌కేర్, టెలికం, ప్రొఫెషనల్ సర్వీసెస్, బ్యాంకింగ్ తదితర రంగాలు దీనిపై గణనీయంగా వెచ్చించనున్నాయి. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే అండ్ కంపెనీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో మెటావర్స్ సాధనాల వినియోగం తీరుతెన్నులను వివరించారు. దీని ప్రకారం 2017లో కృత్రిమ మేథ (ఏఐ) విషయంలో ఎలాంటి ధోరణులు కనిపించాయో ఇప్పుటు మెటావర్స్‌ను కంపెనీలు వినియోగించడంపైనా అలాంటి ధోరణులే కనిపిస్తున్నాయి. స్వల్ప, దీర్ఘకాలికంగా మెటావర్స్ సొల్యూషన్స్‌ను ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు గతేడాది 57 శాతం మంది చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ తెలిపినట్లు సర్వేలో తేలింది. ఇటీవలి సాంకేతికత పురోగతి కారణంగా ఇంటర్నెట్లో తదుపరి విప్లవంగా మెటావర్స్ ముందు వరుసలో ఉండనుందని నివేదిక పేర్కొంది. భారీగా పెట్టుబడులు .. మెటావర్స్ విభాగంలోకి ప్రైవేట్ ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. గతేడాది ప్రథమార్ధంలో 120 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. వివిధ మాధ్యమాల ద్వారా కస్టమర్‌కు సర్వీసులు అందించడం, రియల్ టైమ్‌లో ఉత్పత్తుల డిజైనింగ్‌ను పరీక్షించడం వంటి అంశాల్లో ఇది ఉపయోగపడగలదని వివరించింది. 3డీ/టెక్నికల్ ఆర్టిస్ట్‌లు, మోషన్ డిజైనర్లు, గ్రాఫిక్స్ ఇంజినీర్లు మొదలైన వారు ఈ టెక్నాలజీ విస్తరణలో కీలకపాత్ర పోషిస్తారని నివేదిక తెలిపింది. అయితే, దీన్ని భారీ స్థాయిలో విస్తరించాలంటే .. పెట్టుబడులపై రాబడులు, టెక్నాలజీ, టాలెంట్ సంసిద్ధత వంటి అంశాలపై స్పష్టత అవసరమని నివేదిక పేర్కొంది. -
మనకు ఇంకో 40 శాతం నీరు కావాలి
న్యూయార్క్: నీరు లేకుండా ప్రాణికి భూమి మీద మనుగడే లేదు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో నీటి వనరులు అందుబాటులో ఉండడం, లేకపోవడం మధ్య ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉంది. ఆగస్టు 28వ తేదీన ప్రారంభమైన ప్రపంచ నీటి వారోత్సవాల సందర్భంగా శాస్త్రవేత్తలు, వాణిజ్యవేత్తలు, విధాన నిర్ణేతలు, సామాజిక సంస్థలు నీటికి సంబంధించిన పలు అంశాలపై దృష్టిని కేంద్రీకరించాయి. వాటిలో కొన్ని ప్రధానమైన అంశాలు ఇలా ఉన్నాయి. 1. భూగోళంపై అందుబాటులోవున్న నీటి వనరుల్లో కేవలం 0.5 శాతం నీరు మాత్రమే మానవ వినియోగానికి పనికొస్తోంది. 2. 2030 సంవత్సరానికి మానవ వినియోగానికి మరో 40 శాతం నీరు అవసరమని మ్యాక్ కిన్సే అండ్ కంపెనీ అంచనా వేసింది. 3. ప్రపంచంలో 65 కోట్ల మంది ప్రజలకు ఇప్పటికీ సురక్షిత నీరు అందుబాటులో లేదు. 4. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడం వల్ల డయేరియాతో ఏటా 8,42,000 మంది పిల్లలు, పెద్దలు మృత్యువాత పడుతున్నారు. 5. ఆఫ్రికాలోని 42 శాతం వైద్య సౌకర్యాలకు సురక్షిత నీరు అందుబాటులో లేదు. 6. 1990 నుంచి 2015 మధ్య కాలంలో సబ్ సహారా ఆఫ్రికాలో రోజుకు 47 వేల మందికి మాత్రమే సురక్షిత మంచినీరు అందుబాటులోకి వచ్చింది. 7. ప్రపంచంలో 147 దేశాలు మాత్రమే మంచినీరు లక్ష్యాన్ని సాధించగలిగాయి. చైనాలో 50 కోట్ల మంది ప్రజలకు మాత్రమే మంచినీరు అందుబాటులో ఉంది. 8. ప్రపంచంలోని ప్రజలందరికి సురక్షితమైన నీరు అందించడం ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలో ఒకటి. 9. ప్రపంచంలో 90 శాతం నీరు వ్యవసాయ అవసరాలకే వినియోగం అవుతోంది. సెప్టెంబర్ రెండవ తేదీతో ప్రపంచ నీటి వారోత్సవం ముగియనున్న తరుణంలో భారత్‌లోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడం శుభ పరిణామం. -
2025 నాటికి సూపర్ రిచ్ సిటీలు ఇవే
ప్రపంచంలోనే రిచ్చెస్ట్ సిటీ ఏది? టోక్యో, ఆ తర్వాత న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, సియోల్, లండన్, పారిస్.. ప్లీస్ హోల్డాన్! మరో పదేళ్లలో ఈ జాబితా తలకిందులు కానుంది. మోస్ట్ ఎమర్జింగ్ సిటీలుగా అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న కొన్ని నగరాలు న్యూయార్క్, లండన్, టోక్యోలను అధిగమించి 2025 నాటికి సూపర్ రిచ్ సిటీలుగా అవతరించనున్నాయి. పలు అధ్యయనాలు అనంతరం ప్రఖ్యాత మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ మెకిన్సే అండ్ కంపెనీ ఫ్యూచర్ రిచ్ సిటీల జాబితాను రూపొందించింది. ఆ జాబితాలోని ఏడు నగరాల ఫొటోలు, వివరాలు మీకోసం.. (ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) . దోహా- ఖతార్: ఇప్పటికే సంపన్న నగరంగా ఉన్న దోహా అద్భుతమైన జీడీపీ వృద్ధి రేటుతో 2025నాటికి రిచ్చెస్ట్ సిటీల్లో ఒకటిగా అవతరిస్తుంది. 2. బెర్గన్- నార్వే: ఎనర్జీ ఇండస్ట్రీ, షిప్పింగ్, మెరైన్ పరిశోధనల్లో తనదైన ముద్రతో నార్వే ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉన్న బెర్గన్ మరో పదేళ్లలో సూపర్ రిచ్ సిటీ అవుతుంది. 3. ట్రొన్హెయిమ్- నార్వే: మొబైల్ టెక్నాలజీకి పుట్టినిల్లయిన ట్రొన్హెయిమ్.. నార్వేలోని మరో ముఖ్యనగరం. స్టార్ట్ అప్ ల హబ్ గా 2025లోగా ఇది ధనిక నగరంగా అవతరించనుంది. 4. హ్వాసియోంగ్- దక్షిణ కొరియా: శాంసంగ్, ఎల్ జీ, హ్యుందాయ్ కపెనీల జన్మస్థానమైన ఈ నగరం మరికొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలో ధనిక నగరం కానుంది. 5. అసాన్- దక్షిణ కొరియా: సమీప భవిష్యత్ లో గ్లోబల్ షిప్పింగ్ హబ్ గా అవతరించనున్న అసాన్ కూడా రిచ్చెస్ట్ సిటీ రేస్ లో దూసుకుపోతోంది. 6. రైన్ రుహ్ర్- జర్మనీ: యూరప్ లోని అతిపెద్ద నగరాల్లో మూడో స్థానం(ఫస్ట్ లండన్, సెకెండ్ పారిస్) లో ఉన్న జర్మన్ మెగాసిటీ రైన్ రూహ్ర్ ధనిక నగరంగా అవతరించడం ఎంతోదూరంలోలేదు. 7. మకావు- చైనా: అతితక్కువ కాలంలో బీభత్సంగా అభివృద్ధి చెందిన చైనా నగరం మకావు.. గతేడాది ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసినా 2025 నాటికి రిచ్చెస్ట్ సిటీ అవుతుందని అంచనా.