రిటైర్‌మెంట్ గడువు దగ్గర పడుతున్న వారిలో, పదవి విరమణ పొందిన వారిలో ఇంకా పని చేయాలనే తపన చూస్తూంటాం. అందుకు వారు ఎంతో ప్రయత్నించాలి. వయసు భారం అనుకోకుండా సరైన నైపుణ్యాలు ఉంటే ఎన్నో అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయంగా ఇంకా పనిచేయాలనుకునే వృద్ధులతో పోలిస్తే భారతీయ వృద్ధులకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు మెకిన్సే హెల్త్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ రిపోర్ట్ పేర్కొంది. అందుకుగల కొన్ని కారణాలను విశ్లేషించింది.
మెకిన్సే 21 దేశాల్లోని 55 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న దాదాపు 21,000 మందిపై సర్వే చేసి ఈ నివేదిక రూపొందించింది. అందులో 1,000 మంది భారతీయులున్నారు. నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియా 7.8 శాతం జీడీపీ వృద్ధిరేటు సాధించాలంటే వృద్ధులుసైతం పనిచేయాలని గతంలో కొందరు అభిప్రాయపడ్డారు. కొంతమంది భారతీయ వృద్ధులకు ఇప్పటికీ కుటుంబ సంరక్షణే భారంగా మారుతోంది. మరికొందరు సంపన్నులను అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. అన్నీ అనుకూలంగా ఉన్నవారు సాంకేతికతపై, స్మార్ట్‌ఫోన్‌ల వాడకంపై ఆసక్తి చూపినప్పటికీ దాన్ని పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు.
ఇదీ చదవండి: పాతపద్ధతే మేలు.. ‘ఎక్స్’ ప్రకటన
నాలెడ్జ్ గ్యాప్, వారు అధికంగా పనిచేయకపోవడం వంటి అడ్డంకులున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి వారికి సరైన శిక్షణ ఇవ్వడంతోపాటు అవగాహన పెంపొందించడం ఎంతో అవసరం. 55-64 ఏళ్ల వయసు ఉన్న వారిలో కంటే 80 ఏళ్లు దాటిన వారిలో 20-25 శాతం అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలపై అవగాహన, ఆర్థిక ప్రణాళిక, నైపుణ్య శిక్షణతో దిగువ మధ్యతరగతి వృద్ధుల కుటుంబాల్లో ఆదాయ మార్గాలను పెంపొందించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment