
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 60 ఏళ్ల వయసు దాటిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రసామాజిక, న్యాయసేవా మంత్రిత్వ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారు ఎవరూ బయటకు రాకూడదని, అదే విధంగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు ఇంట్లో తమ గదిని వదిలి బయటకు అసలు రావద్దని చెప్పారు. ఈ మేరకు సామాజిక, న్యాయసేవ మంత్రిత్వ శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది.
► 60 ఏళ్ల వయసు దాటి, శ్వాసకోశ, కిడ్నీ, గుండె జబ్బులు, మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి కరోనా వైరస్ రిస్కు ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి
► వీళ్లందరూ ఇంటికి వచ్చే అతిథులను కలవకూడదు
► భౌతిక దూరం పాటిస్తూ..యోగా లాంటి వ్యాయామాలు చేయాలి
► వ్యక్తిగత శుభ్రత బాగా పాటించాలి
► వేడి ఆహారం తీసుకోవడంతో పాటు అందులో పోషకాలు ఉండేలా చూసుకోవాలి
► దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులకు ఫోన్ చేయాలి
► నీళ్లు ఎక్కువగా తాగాలి మానసిక రుగ్మతలు ఉంటే 08046110007 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చెయ్యాలి
వీళ్లు ఏమి చేయకూడదంటే..
► కరోనా వైరస్ లక్షణాలున్న వారిని కలవకూడదు
► ఎవరితోనూ కరచాలనం చేయకుండా ఉండాలి
► జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు
► హారర్ సినిమాలు, బ్రేకింగ్ న్యూస్‌లు చూడకూడదు
► పొగాకు, మద్యం సేవించే అలవాటు ఉంటే తక్షణమే మానేయాలి.