Pound
-
రూపాయి సింబల్ ₹, డాలర్ $, పౌండ్ £...వీటి వెనుక కథ ఏమిటంటే...
ప్రతీ దేశానికీ ఆ దేశపు ప్రత్యేక కరెన్సీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. మన దేశంలో మారకంలో ఉన్నది రూపాయి. దీని సింబల్ హిందీలోని 'र' అక్షరాన్ని పోలివుంటుంది. రూపాయిలోని ‘ర’ ను ఆధారంగా చేసుకుని ఈ సింబల్ రూపొందించారు. ఇక డాలర్ విషయానికొస్తే 'D' అక్షరంతో మొదలవుతుంది. అయితే దీనిని 'S'అక్షరం మాదిరిగా ఎందుకు రాస్తారు? పౌండ్ విషయంలోనూ ఇటువంటి సందేహమే వస్తుంది. ఇది 'L' అక్షరం మాదిరిగా కనిపిస్తుంది. ఇలా ఉండటం వెనుక కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా డాలర్, బ్రిటన్ పౌండ్ విషయానికొస్తే డాలర్ గుర్తు $, పౌండ్ గుర్తు £ గా కనిపిస్తుంది. మనదేశ కరెన్సీ రూపాయిలోని తొలి అక్షరం 'R'. దీనికి దేవనాగరిలోని 'र'కలిపి ₹గా రూపొందించారు. దీనిని ఉదయ్ కుమార్ అనే కళాకారుడు రూపొందించారు. ఈ సింబల్ రూపకల్పనకు ప్రభుత్వం ఒక పోటీని నిర్వహించి, చివరికి ₹ చిహ్నాన్ని ఎంపిక చేసింది. డాలర్‌కు $ సింబల్ ఎలా వచ్చిందంటే.. హిస్టరీ వెబ్సైట్ రిపోర్టు ప్రకారం సౌత్ అమెరికాలో స్పానిష్ ఎక్స్ప్లోరర్స్కు భారీ మొత్తంలో వెండి లభ్యమయ్యింది.దీంతో స్పానిష్ ప్రజలు ఆ వెండితో నాణాలు తయారుచేయించుకోవడం ప్రారంభించారు. వీటిని peso de ocho అని అనేవారు. దీనికి షార్ట్ పదంగా 'pesos'అని పిలిచేవారు. అలాగే రాసేటప్పుడు దానిని ps అని రాసేవారు. మొదట్లో ఎస్ అక్షరంపై పి ఉంచారు. ఆ తరువాత పి అక్షరంలోని నిలువు గీతను మాత్రమే ఉంచి దానిని $ సింబల్‌గా మార్చారు. పౌండ్ సైన్ అలా ఎందుకుంటుందంటే... ఇప్పుడు పౌండ్ సైన్ £ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. లాటిన్ భాషల్ 1 పౌండ్‌ను Libra అని అంటారు. ఈ లిబ్రాలో L నుంచి స్టర్లింగ్ సింబల్ £ రూపొందింది. -
వైరల్ వీడియో : తన ఛాతీని కొట్టడం నేర్చుకుంటున్న చిన్న గొరిల్లా..!
-
అరుదైన కరెన్సీ నోటు వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా!
ఒక చారీటీ దుకాణంలో దొరికిన బ్యాంకు నోటు ఆన్లైన్ వేలంలో అత్యంత అధిక ధరకు అమ్ముడుపోయింది. ఆ నోటు విలుకంటే అధిక రెట్లు అమ్ముడుపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఏంటా కరెన్సీ నోటు? ఆ నోటుకి ఉన్న ప్రత్యేకత ఏంటో అనే కదా! వివరాల్లోకెళ్తే....పాలస్తీనాలోని ఎసెక్స్‌లో ఆక్స్‌ఫామ్ వాలంటీర్ పాల్ అనే వ్యక్తి బ్రెంట్వుడ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నప్పుడు 100 పౌండ్ల కరెన్సీ నోటు దొరికింది. అది 1927 ఏళ్ల నాటి బ్రిటిష్ మాండేట్ సమయంలో ఉన్నత స్థాయి అధికారులు జారీ చేసిన నోటు. ఆ నోటును పాల్ తన ఇంటి అరమారలో ఉంచాడు. ఆ తర్వాత దాన్ని అలా ఉంచకూడదని లండన్‌లోని స్పింక్ వేలం హౌస్‌లో వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆ నోటుని ఆన్లైన్లో వేలానికి ఉంచగానే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 1.3 కోట్ల రూపాయలు పలికింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి ఆనోటు విలువ కేవలం రూ. 29 లక్షలు కానీ వేలంలో ఊహించని విధంగా అధిక ధర పలకింది. ఈ మొత్తం ఆక్స్‌ఫామ్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వెళ్తుందని బ్రిటిష్ మీడియా తన నివేదికలో పేర్కొంది. ఇంతకీ ఈ ఆక్స్‌ఫామ్ సంస్థ తూర్పు ఆఫ్రికాలో కరువు పీడిత ప్రజలకు, ఉక్రెయిన్ నుండి వచ్చిన శరణార్థులను అక్కున చేర్చుకుని సేవలందిస్తోంది. (చదవండి: ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది) -
హోరాహోరీ పోరు: భారీగా పడిపోతున్న పౌండ్
లండన్ : బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో ఇరు పార్టీలు హోరాహోరీగా పోటీపడుతుండటంతో ఫౌండ్ విలువ భారీగా పడిపోతుంది. ఏ పార్టీకి మెజార్టీ ఫలితాలు దక్కకపోతుండటంతో పౌండ్ కూడా కుదుపులకు లోనవుతోంది. గురువారం ముగిసిన పోలింగ్ లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి థెరిసా మే, లేబర్ పార్టీ అధ్యక్షుడు జెరిమే కార్బిన్ లు పోటీ పడుతున్నారు. కరెన్సీ మార్కెట్లు మాత్రం కన్జర్వేటివ్ పార్టీకి చెందిన థెరిసా మేకే క్లియర్ మెజార్టీ వస్తుందని అంచనావేశాయి. కానీ ఫలితాలు పోటాపోటీగా వస్తుండటంతో పౌండ్ స్టెర్లింగ్ 1.27 డాలర్లకు పడిపోయింది. గురువారం ముగింపుకు ఇది రెండున్నర శాతం తగ్గింపు. యూరోకు వ్యతిరేకంగా కూడా పౌండ్ విలువ ఒకశాతం మేర పడిపోతోంది. జనవరి తర్వాత ఇదే అతిపెద్ద పతనమని తెలిసింది. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా ట్రేడర్లు స్పందిస్తున్నారు. 318 సీట్లతో కన్జర్వేటివ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని బీబీసీ అంచనావేసింది. కానీ పోల్ ఫలితాలు మాత్రం ఆశ్చర్యకరంగా వస్తున్నాయి. పౌండ్ విలువ మరింత కిందకి పడిపోతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. నేడు వెల్లడికాబోయే ఫలితాలతో బ్రెగ్జిట్ అంశం కూడా ముడిపడి ఉంది. పార్లమెంటులో తన బలం పెంచుకొని అనంతరం సమర్థవంతంగా బ్రెగ్జిట్ చర్చలను సాగించేందుకు థెరిసా మే మూడేళ్లు ముందుగానే ఎన్నికలకు పిలుపునిచ్చారు. -
తూకంలో దగా..
నిబంధనలు పాటించని వ్యాపారులు వినియోగదారుల జేబులకు చిల్లు ‘మామూలు’గా తీసుకుంటున్న తూనికలు, కొలతల అధికారులు మంచిర్యాలలోని మజీద్‌వాడకు చెందిన ఓ చిరు వ్యాపారి.. హోల్‌సెల్ దుకాణంలో ఈ మధ్య క్వింటాల్ బియ్యం, 5 కిలోల పెసరపప్పు, 5 లీటర్ల పల్లి నూనె (టిన్), 5 కిలోల ఉల్లిగడ్డలు, 5 కిలోల పంచదార, 5 కిలోల గోధుమలు ఇలా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసింది. ఇంటికి వచ్చాక తమ కిరాణం షాపులో ఉన్న కాంటాలో తూకం వేసి పరిశీలించగా.. 5 కిలోలు కొనుగోలు చేసిన పంచదార నాలుగు కిలోలే వచ్చింది. ఈ విషయమై జిల్లా కేంద్రంలోని తూనికలు, కొలతల అధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారం రోజుల క్రితం కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తుండగా ఆ వ్యాపారి తూనికలు వేసేందుకు రాళ్లను వినియోగించాడు. దీంతో ఆ మహిళ సదరు వ్యాపారిని ప్రశ్నించింది. దీంతో ‘నీ ఇష్టం ఉంటే కొను. లేకుంటే లేదు’ అంటూ వ్యాపారి సమాధానం ఇచ్చాడు. ఎవరి దగ్గరికెళ్లినా ఈ బండ రాళ్లే కనిపిస్తాయని చెప్పడం విడ్డూరం. మంచిర్యాల క్రైం : జిల్లాలో సరుకుల కొనుగోలు చేస్తున్న వినియోగదారులు పలుచోట్ల తూనికల్లో భారీగా మోసపోతున్నారు. కిరాణం, రేషన్, పండ్లు, కిరోసిన్ దుకాణాల్లో తూకాల్లో మోసాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే విధంగా.. బియ్యం వ్యాపారులు కూడా 50 కిలోల బ్యాగులో ఒకటి నుంచి రెండు కిలోలు తక్కువగా తూకం వేస్తున్నారు. వీటికితోడు పెట్రోల్, డీజిల్ కొలతల్లోనూ నిత్యం మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపై తూనికలు, కొలతల అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. అడపాదడపా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘మామూలు’గా తీసుకుంటున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కానరాని చట్టాలు.. తూనికల కొలతల్లో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు రూపొందించిన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ఎవరికైనా తూకంలో తేడా వస్తే ఫిర్యాదు చేస్తే అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు.. మారుతున్న కాలంలో ప్రతి దుకాణంలో ఎలక్ట్రానిక్ కాంటాలు వాడుతున్నారు. ఈ కాంటాలో మోసం జరుగుతూనే ఉంది. కాంటాలో కేజీలకు బదులు మిల్లీమీటర్లలో తేడా వచ్చే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. కాంటాలో సాంకేతిక తేడాలు రావడంతో వినియోగదారులు భారీగా నస్టపోతున్నారు. నిబంధనలు బేఖాతర్.. నిబంధలనల ప్రకారం ప్రతి ఏడాడి వ్యాపారులు వారివారి కాంటాలను సంబంధిత తూనికలు, కొలతల శాఖ కార్యాలయానికి తీసువెళ్లి అధికారులతో తనిఖీ చేయించి వాటిపై ముద్ర వేయించాలి. కానీ.. వ్యాపారులు మాత్రం ఏళ్ల వరకు తనిఖీలు చేయించుకోకుండానే యథేచ్చగా వ్యాపారం సాగిస్తున్నారు. కిలోబాటు ఏడాదికి 50 గ్రాముల వరకు అరుగుదల ఉంటుంది. కానీ.. వ్యాపారులు పట్టించుకోవడంలేదు. దీంతో కిలోకు తూకంలో 50 గ్రాముల తేడా వస్తుంది. ఈ రకంగా వినియోగదారులు పెద్దఎత్తున ఆర్థికంగా నష్టపోతున్నారు. అంతేకాక కొంతమంది వ్యాపారులు వివిధ రకాల వస్తువులను ముందుగానే ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఆ ప్యాకింగ్ కవర్లపై తయారీ తేదీ, కంపెనీ వివరాలు పొందుపరచడం లేదు. ఇప్పటికైనా అధికారులు తూకంలో జరిగే మోసాలను అరికట్టి వినియోగదారులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు. జిల్లాలో మూడు సంవత్సరాలుగా నమోదై కేసులు, వచ్చిన ఆదాయం.. 2014లో.. కాంటాలకు, బాట్లకు ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.6,54,410 ► దుకాణలపై దాడి చేయగా రాజీకి వచ్చి జరిమానాతో కలిపి ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.6,76,600 ►బాట్లపై ముద్ర లేకపోవడంతో చేసిన కేసులు 146 ►వస్తువులపై ఎమ్మార్పీ రేటు, సరైన చిరునామా లేకపోవడంతో నమోదు చేసిన కేసులు 120 2015లో.. ►కాంటాలకు, బాట్లకు ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.6,60,190 ►దుకాణలపై దాడి చేయగా రాజీకి వచ్చి జరిమానాతో కలిపి ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.5,10,600 ► బాట్లపై ముద్ర లేకపోవడంతో చేసిన కేసులు 92 ►వస్తువులపై ఎమ్మార్పీ రేటు, సరైన చిరునామా లేకపోవడంతో నమోదు చేసిన కేసులు 101 2016లో.. ► కాంటాలకు, బాట్లకు ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.7,20,630 ► దుకాణాలపై దాడి చేయగా రాజీకి వచ్చి జరిమానాతో కలిపి ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.5,40,300 ►బాట్లపై ముద్ర లేకపోవడంతో చేసిన కేసులు 102 ►వస్తువులపై ఎమ్మార్పీ రేటు, సరైన చిరునామా లేక పోవడంతో నమోదు చేసిన కేసులు 70 సమాచారం ఇస్తే చర్యలు కిరాణం షాపులు, కూరగాల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నాం. గడిచిన సంవత్సరం 172 కేసులు నమోదు చేశాం. కొన్ని దుకాణాలలో ఎలాంటి అడ్రస్ లేకుండా, వాటిపై ఎమ్మార్పీ రేటు లేకుండా అమ్ముతున్నారు. వినియోగదారులు సైతం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వస్తువులను కొనుగోలు చేయరాదు. తూనికలు, కొలతల్లో అనుమానం కలిగితే సమాచారం ఇవ్వాలి. వారిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. నిర్భయంగా 9849430056 నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు. వారి పేర్లు వెల్లడించం. – ఎండీ రియాజ్హైమద్ఖాన్, జిల్లా తూనికలు,కొలతల అధికారి, మంచిర్యాల -
తూకం.. మోసం !
- యథావిధిగా ప్రజాపంపిణీలో అక్రమాలు - ఈ-పాస్ మిషన్లను ఎలక్ట్రానిక్ కాటాలతో అనుసంధానం చేసినా దగానే - కాసుల పంట పండించుకుంటున్న డీలర్లు - నష్టపోతున్న కార్డుదారులు కర్నూలు (అగ్రికల్చర్): నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నా కొందరు డీలర్లు మాత్రం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారులు ఎప్పుడుకప్పుడు అక్రమాల గుట్టురట్టు చేస్తున్నా వారి పంథా మారడం లేదు. నిన్నటి వరకు ఈ–పాస్ మిషన్లతో ప్రజా పంపిణీలో అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయని, కోట్లాది రూపాయల సరుకులు ఆదా అవుతున్నాయని పాలకులు చెబుతూ వచ్చారు. అయితే కర్నూలులో సహా వివిధ జిల్లాలో డీలర్లు ఈ–పాస్ మిషన్లను ౖ»ñ పాస్ చేసి పేదల బియ్యాన్ని స్వాహా చేసిన కుంభకోణం బయట పడటంతో పాలకులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ–పాస్ మిషన్లతో ఎలక్రా్టనిక్ కాటాలను అనుసంధానం చేయడంతో తూకాల్లో దగా చేసే అవకాశమే లేదని, కచ్చితమైన తూకాల్లో సరుకులు ఇస్తున్నామని ఇంతవరకు అధికారులు భావిస్తూ వచ్చారు. ఈ–పాస్ మిషన్లతో కాటాలకు లింకప్ చేసినా డీలర్లు తమ చేతివాటంతో బియ్యాన్ని కాజేస్తున్నారు. జిల్లాలో 3422 మంది డీలర్లు ఉండగా 50శాతం పైగా డీలర్లు మోసానికి పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతోంది. డబ్బాతో తూకం.. అనేక మంది డీలర్లు డబ్బాలతో బియ్యం తూకం వేస్తున్నారు. డబ్బాతో బియ్యం వేస్తున్నపుడు డబ్బా ఎంత బరువు ఉందో ముందే చెక్ చేసుకొని ఆ బరువుకు తగ్గట్టుగా స్కేల్లో మార్పులు చేసుకోవాలి. కాని లాభార్జనకు అలవాటు పడిన డీలర్లు డబ్బా బరువును బియ్యంలో చూపుతూ ఆరకిలోకు పైగా బియ్యాన్ని ఒక కార్డుపై కొల్లగొడుతున్నారు. ఒక్కో డీలరుకు 1000కి పైగా కార్డులు ఉంటాయి. ఇన్ని కార్డుల మీద తూకంలో దగా చేస్తూ బియ్యాన్ని ఏ స్థాయిలో బొక్కేస్తున్నారు.. తనిఖీలు నామమాత్రం ఈ–పాస్ మిషన్లు వచ్చినా ప్రజా పంపిణీలో అక్రమాలు యథావిధిగా జరుగుతున్నా అధికారులు అరకొర దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఏఎస్ఓలు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్లార్లు, సీఎస్డీటీలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు విధిగా దుకాణాలను తనిఖీ చేసి తూకాలను పరిశీలించాలి. ఈ స్థాయిలో తనిఖీలు లేకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల కర్నూలు నగరపాలక సంస్థలో తూనికలు, కొలతల శాఖ , పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో డీలర్లు 20 కిలోల బియ్యం తూకంలో కిలో నుంచి 2 కిలోల వరకు బియ్యం కాజేస్తున్నట్లు వెలుగు చూసింది. కర్నూలులో ఆరు చౌక దుకాణాల్లో తూకాల్లో దగా నిర్ధారణ కావడంతో సంబంధిత డీలర్లపై కేసులు కూడా నమోదు చేశారు. జిల్లా అంతటా ఇలాగే జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 10.76 లక్షల కార్డులు ఉన్నాయి. ఒకవైపు డబ్బాను ఉపయోగిస్తూ అరకిలోకు పైగా స్వాహా చేస్తుండగా, మరోవైపు చేతివాటంతో 1.50 కిలోలు కాజేస్తున్నట్లు సమాచారం.. సాంతికేతకు అందని దగా ఎలక్ట్రానిక్ కాటాలను ఈ–పాస్ మిషన్లతో అనుసంధానం చేసినా తూకాల్లో డీలర్లు దగా చేస్తున్నా టెక్నాలజీ గుర్తించడం లేదు. టెక్నాలజీ అక్రమాలను పట్టలేదని డీలర్లు గుర్తించడంతో అక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసి 60శాతం కార్డు దారులకు బియ్యం పంపిణీ చేస్తే సర్వర్ ద్వారా 90శాతం పైగా కార్డులకు బియ్యం పంపిణీ చేసి కాసుల పంట పండించుకున్న డీలర్లు, తూకాల్లోను అక్రమాలకు పాల్పడుతుండటం గమానార్హం. ఎక్కడ ఎలాంటి అక్రమం జరిగినా కనిపెట్టవచ్చని ప్రకటించిన పాలకులు ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసినా, తూకాల్లో దగా చేస్తున్నా టెక్నాలజీ గుర్తించలేకపోవడంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ఎలా అనేది ప్రశ్నార్థకమైంది. -
పౌండ్...'టూ మినిట్ మిస్టరీ క్రాష్'
బ్రెగ్జిట్ ఉదంతం బ్రిటిష్ కరెన్సీని పట్టి పీడిస్తోంది. మార్చిలోగా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగనున్నట్లు బ్రిటీష్ ప్రధాని ప్రకటించిన (బ్రెక్సిట్) నేపథ్యంలో శుక్రవారం పౌండ్ అనూహ్య పరిస్థితుల్లో భారీ పతనం కావడంతో మార్కెట్లో మదుపర్లు తీవ్ర గందరగోళం పడిపోయారు. కేవలం రెండే రెండు నిమిషాల్లో రికార్డ్ స్థాయి పతనాన్ని నమోదుచేసింది. అమెరికన్ డాలరుతో మారకంలో ఒక దశలో 6 శాతం క్షీణించింది. ఇటీవల భారీగా పతనమైన నాలగవ ముఖ్యమైన కరెన్సీగా ఉన్న పౌండ్ ఈ రోజు మరోసారి 31 ఏళ్లలోనే కష్టాన్ని తాకింది. అయితే ఈ పతనానికి ట్రేడర్ల పొరపాటే కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. ఇట వజ్ ఔట్ ఆఫ్ ప్రపోర్షన్ అని సిడ్నీ రోచ్ఫోర్డ్ కాపిటల్ ఎనలిస్ట్ ముంఫోర్డ్ చెప్పారు. బ్రెగ్జిట్ ఉదంతం తర్వాత్ స్టెర్లింగ్ పౌండ్ భారీ పతనమని, ఇది అత్యంత నాటకీమ పరిణామమని, దీన్ని ఎవరూ ఊహించలేదని సింగపూర్ సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు మాట్ సింప్సన్ వ్యాఖ్యానించారు. సాధారణంగా ఆసియా మార్కెట్ సమయంలో స్టెర్లింగ్ లో వాల్యూమ్స్ ఆ తక్కువగా ఉంటాయనీ, కానీ అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలున్నప్పటికీ శుక్రవారం ధరల తుఫాను షాకిచ్చిందన్నారు. ఈ పరిణామంతో పౌండ్ విలువ 1.25 , 1.20 డాలర్ల స్థాయిలో కొందరు వ్యాపారులు మునిగిపోయారన్నారు. కాగా యూరప్ మార్కెట్లు భారత మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
భారీగా పతనమైన బ్రిటిష్ పౌండ్
-
భారీగా పతనమైన బ్రిటిష్ పౌండ్
లండన్ : బ్రిటిష్ కరెన్సీ పౌండ్ విలువ దారుణంగా పడిపోయింది. డాలర్ తో పోలిస్తే పౌండ్ విలువ 31ఏళ్ల కనిష్టానికి పతనమైంది. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ వాసులు ఓటు వేసిన ఉదంతం తరువాత భారీగా క్షీణించింది. అనంతరం ఇది మరో భారీ పతనం. జూన్ 1985 నాటికి విలువకు పడిపోయింది. ఈ పతనం మరింత కొనసాగనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఆందోళనలతో పెట్టుబడిదారులు కరెన్సీ విక్రయాలకు దిగారు. దీంతో పౌండ్ విలువ1శాతం నష్టంతో మూడు దశాబ్దాల కిందికి దిగజారింది. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిస్సా మే బ్రెగ్జిట్ మార్చి చివరి నుంచి మొదలవుతుందని ఆదివారం ప్రకటించారు. దీంతో సోమవారం స్టెర్లింగ్ పౌండ్ 1 శాతానికిపైగా నష్టపోయింది. ఈ అమ్మకాలు మంగళవారం కొనసాగాయి. అధికారిక 'ఆర్టికల్ 50' చట్టపరమైన నిష్క్రమణ ప్రక్రియ తర్వాత బ్రిటన్, ఈయూ ప్రాధమిక రెండు సంవత్సరాల నెగోషియేటింగ్ పీరియడ్ లోకి ప్రవేశించనున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పౌండ్ అతిపెద్ద పతనాలు 1971లో నిక్సన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా డాలర్‌ను బంగారంతో మార్చడాన్ని రద్దు చేసినప్పుడు దాదాపు పౌండ్ 3.4శాతం విలువ కోల్పోయింది. దీనిని అప్పట్లో 'నిక్సన్ షాక్'గా అభివర్ణించారు. 1978 నవంబర్ 1న యూకే ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం దెబ్బతినడంతో ఒక్క రోజులో 4.3శాతం విలువ కోల్పోయింది. దీనిని 'వింటర్ ఆఫ్ డిస్కాంటెంట్'గా పేర్కొన్నారు. యూకే 1992 సెప్టెంబర్ 16న ఈయూ ఎక్స్చేంజి రేట్ వ్యవస్థ నుంచి వైదొలగింది. ఈ నేపథ్యంల పౌండ్ 4.29శాతం విలువ కోల్పోయింది. 2009 జూన్ 20న ఆర్థిక సంక్షోభం కారణంగా పౌండ్ 3.9శాతం విలువ కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా డాలర్ తోపోలిస్తే దేశీ కరెన్సీ రూపాయి 0.02పైసల నష్టంతో ఉంది. గత మూడు రోజులుగా లాభాలతో ఉన్న రూపాయి నష్టాల్లోకి జారుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 4 పైసలు పెరిగింది. 66.54 వద్ద మొదలై 66.90 దగ్గ ఉంది. -
యూకే విహారయాత్ర 10 శాతం చౌక
బ్రెగ్జిట్ ఫలితాల ప్రభావంతో పౌండ్ విలువ క్షీణించడం వల్లే... విహార యాత్ర కోసం యూకే వెళ్లాలనుకుంటున్నారా? అయితే తక్షణమే ప్యాకేజీ సొమ్మును పూర్తిగా చెల్లించేయండి. ఎందుకంటే... బ్రెగ్జిట్ ఫలితాల ప్రభావంతో రూపాయితో పౌండ్ మారకం విలువ 10 శాతం క్షీణించడంతో మీ విహార యాత్ర ఖర్చు ఆ మేరకు తగ్గనుంది. పౌండ్ విలువలో క్షీణత వల్ల ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఐర్లాండ్‌లకు హాలిడే ట్రిప్పులు 10 శాతం చౌకగా లభించనున్నాయి. ఇప్పటికే హాలిడే ప్యాకేజీలు బుక్ చేసుకొని బస, స్థానిక రవాణా, పర్యాటక ప్రదేశాల సందర్శన వంటి వాటికి ఇంకా సొమ్ము చెల్లించని వారూ చార్జీల్లో 10 శాతం మేర లబ్ధి పొందొచ్చు. ఉదాహరణకు ఏడు రోజుల యూకే ప్యాకేజీ (రూ. 1.1 లక్షలు)పై రూ. 5 వేల నుంచి రూ. 6 వేలు, 10 రోజుల ప్యాకేజీ (రూ. 1.44 లక్షలు)పై రూ. 7 వేల నుంచి రూ. 8 వేలు తగ్గనుంది.