బ్రెగ్జిట్ ఫలితాల ప్రభావంతో పౌండ్ విలువ క్షీణించడం వల్లే...
విహార యాత్ర కోసం యూకే వెళ్లాలనుకుంటున్నారా? అయితే తక్షణమే ప్యాకేజీ సొమ్మును పూర్తిగా చెల్లించేయండి. ఎందుకంటే... బ్రెగ్జిట్ ఫలితాల ప్రభావంతో రూపాయితో పౌండ్ మారకం విలువ 10 శాతం క్షీణించడంతో మీ విహార యాత్ర ఖర్చు ఆ మేరకు తగ్గనుంది. పౌండ్ విలువలో క్షీణత వల్ల ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఐర్లాండ్‌లకు హాలిడే ట్రిప్పులు 10 శాతం చౌకగా లభించనున్నాయి.
ఇప్పటికే హాలిడే ప్యాకేజీలు బుక్ చేసుకొని బస, స్థానిక రవాణా, పర్యాటక ప్రదేశాల సందర్శన వంటి వాటికి ఇంకా సొమ్ము చెల్లించని వారూ చార్జీల్లో 10 శాతం మేర లబ్ధి పొందొచ్చు. ఉదాహరణకు ఏడు రోజుల యూకే ప్యాకేజీ (రూ. 1.1 లక్షలు)పై రూ. 5 వేల నుంచి రూ. 6 వేలు, 10 రోజుల ప్యాకేజీ (రూ. 1.44 లక్షలు)పై రూ. 7 వేల నుంచి రూ. 8 వేలు తగ్గనుంది.
యూకే విహారయాత్ర 10 శాతం చౌక
Published Sat, Jun 25 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM
Advertisement
Advertisement