ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయలో గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పద్మాపురం ఉద్యానవనంలోని రెండు పగోడాల (షెల్టర్లు)కు శనివారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. ఇవి పూర్తిగా కాలిపోయాయి. ఒకటి పర్యాటకులు విశ్రాంతి కోసం, మరొకటి అధికారుల సమావేశాలకు వినియోగిస్తుంటారు. ఈ ఘటనపై అరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.