న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాశాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అంశం బయటకు రావడంతో ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్, మాజీ డీజీ( తిహార్ జైళ్ల శాఖ)తనను బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. తాను అతిపెద్ద క్రిమినల్ అయితే.. కేజ్రీవాల్ మహా క్రిమినల్ అంటూ ఆరోపించాడు సుకేశ్.
‘కేజ్రీవాల్ జీ నీ ప్రకారం నేను దేశంలోనే అతిపెద్ద నేరస్థుడిని. అప్పుడు నా దగ్గర నుంచి రూ.50 కోట్లు ఎందుకు తీసుకున్నావు, రాజ్యసభ సీటు ఎందుకు ఇస్తానని చెప్పావు? అది నిన్ను ఎలా చూపుతుంది.. మహా నేరస్థుడిగా?’అని లేఖలో పేర్కొన్నాడు సుకేశ్ చంద్రశేఖర్. మరోవైపు.. సీట్ల పంపిణీ విషయంలో 20-30 మంది నుంచి పార్టీకి రూ.500 కోట్లు విరాళం ఇచ్చేలా తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించాడు.
అంతకు ముందు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌పై ఆరోపణలు చేశాడు సుకేశ్. జైలులో భద్రంగా ఉండేందుకని సత్యేంద్ర జైన్‌కు రూ.50 కోట్లు ఇచ్చానని పేర్కొంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు లేఖ రాశాడు. కొద్ది రోజుల క్రితం ఈ అంశం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొట్టిపారేశారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు కేజ్రీవాల్.
ఇదీ చదవండి: గుజరాత్ నుంచి వైదొలగమని బీజేపీ ఆఫర్ ఇచ్చింది: కేజ్రీవాల్
Comments
Please login to add a commentAdd a comment