Conman Sukesh Chandrasekhar Pens Romantic Note For Bomma Jacqueline Fernandez On Her Birthday - Sakshi
Sakshi News home page

Jacqueline Fernandez: నా బర్త్‌ డే కంటే ఎక్కువ.. వైరలవుతున్న ప్రేమలేఖ!

Published Fri, Aug 11 2023 6:07 PM | Last Updated on Fri, Aug 11 2023 8:34 PM

Sukesh Chandrasekhar Pens Romantic Note For Jacqueline Fernandez - Sakshi

బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ పరిచయం అక్కర్లేని పేరు. 2009లో అల్లాదీన్ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించింది. ఇవాళ ఆమె 38వ ఏడాదిలో అడుగు పెడుతున్నారు. మోడలింగ్‌పై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించింది. అయితే తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపాడు. 

(ఇది చదవండి: చిరంజీవిపై రామ్‌ గోపాల్‌ వర్మ ఆసక్తికర ట్వీట్‌!)

రూ. 200 కోట్ల మానీలాండరింగ్‌ కేసులో  ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో సుకేశ్ చంద్రశేఖర్ తన ఫ్రెండ్‌కు విషెస్ చెప్పాడు. నటి పుట్టినరోజు సందర్భంగా సుకేశ్ ఆమెకు ఓ ప్రేమ లేఖ రాశారు. ఈ ప్రేమలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

నిన్ను చాలా మిస్సవుతున్నా

సుకేశ్ లేఖలో రాస్తూ..'నా బేబీ జాక్వెలిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీర్వదాలు నీకు ఎప్పుడు ఉంటాయి. నా జీవితంలో ప్రతి ఏడాది నీ పుట్టినరోజు అత్యంత ఇష్టమైన రోజు. నా బర్త్‌ డే కంటే కూడా ఎక్కువ. బేబీ నువ్వు రోజు రోజుకి మరింత అందంగా..యవ్వనంగా తయారవుతున్నావ్. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా. వచ్చే ఏడాది నీ పుట్టినరోజును కలిసి జరుపుకుంటానని ఆశిస్తున్నా. ఈ గ్రహంలోని ఏ శక్తి నిన్ను ప్రేమించకుండా ఆపలేదు.' అంటూ తీవ్రమైన భావోద్వేగంతో రాసుకొచ్చాడు. గతంలో చంద్రశేఖర్ ఆమెను కౌగిలించుకోవడం, కేక్ తినిపించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యాడు. అయితే గతంలో సుఖేష్ చంద్రశేఖర్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను జాక్వెలిన్ ఫెర్నాండెజ్  ఖండించిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? జూ.ఎన్టీఆర్‌తో ఆ సినిమాలో )


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement