![Jacqueline Fernandez Comments on Sukesh Chandrasekhar money laundering case - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/18/jacke.gif.webp?itok=ABvarek1)
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో కీలక విషయాలు వెల్లడించింది. కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో సుకేశ్ చంద్రశేఖర్‌పై సంచలన కామెంట్స్ చేసింది. కాగా ఈ కేసులో కీలక నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌పై బాలీవుడ్ నటి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అతని వల్లే తన కెరీర్ పూర్తిగా నాశమైందని వాపోయింది. సుకేశ్ తన భావోద్వేగాలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
జాక్వెలిన్ మాట్లాడుతూ..'సుకేష్ చంద్రశేఖర్ నా కెరీర్ నాశనం చేశాడు. అతను ఒక మోసగాడు. నేను అతని తప్పులను గుర్తించలేకపోయా. నన్ను నయవంచనకు గురిచేశాడు. తనను తప్పుదారి పట్టించాడు. నా భావోద్వేగాలతో ఆడుకున్నాడు.' అంటూ తన వాంగ్మూలంలో వివరించింది. ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. కాగా.. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇటీవలే ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment