మీ సర్జరీల మాటేమిటి..? నటిపై దారుణంగా ట్రోల్స్‌ | Jacqueline Fernandez gets trolled for her views on cosmetic surgery at the 2006 | Sakshi
Sakshi News home page

Jacqueline Fernandez: మీరు ఎన్నిసార్లు చేయించుకున్నారు.. జాక్వెలిన్‌పై నెటిజన్ల ఆగ్రహం

Published Thu, Dec 8 2022 8:09 PM | Last Updated on Thu, Dec 8 2022 8:25 PM

Jacqueline Fernandez gets trolled for her views on cosmetic surgery at the 2006 - Sakshi

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ బాలీవుడ్‌లో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి. గతంలో ఆమె ప్లాస్టిక్ సర్జరీలపై మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీంతో ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీ అందం కోసం చేయించుకున్న సర్జరీల మాటేమిటి అని ప్రశ్నిస్తున్నారు. 2006లో శ్రీలంక మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని గెలుచుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్లాస్టిక్‌ సర్జరీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. 'ప్లాస్టిక్‌ సర్జరీ  మహిళల సహజ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. అలా చేయించుకోవడం వల్ల వచ్చే అందం నిజమైంది కాదు. అలాంటి వాటికి నేను  పూర్తిగా వ్యతిరేకిని' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్‌మీడియా వేదికగా ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. 'ఇప్పటిదాకా మీరు ఎన్నిసార్లు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. అందంగా కనిపించడం కోసం మీరు చేయించుకున్న శస్త్రచికిత్సల మాటేమిటి' అని ప్రశ్నించారు.  తాజాగా జాక్వెలిన్ సర్కస్‌ ట్రైలర్‌ ప్రీమియర్‌లో కనిపించింది.  అక్షయ్‌కుమార్‌ ప్రధానపాత్రలో నటించిన రామ్‌ సేతు చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement