Satyendra Jain
-
Delhi: సత్యేంద్రజైన్ వెంటనే లొంగిపోవాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జెయిన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం(మార్చ్ 18) కొట్టివేసింది. జైన్ వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బేలా ఎమ్. త్రివేది, పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం జైన్ బెయిల్ పిటిషన్‌ను విచారించింది.‘బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం, పిటిషనర్ వెంటనే లొంగిపోవాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అనారోగ్య కారణాల వల్ల తన క్లైంట్ లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని సత్యేంద్ర జైన్ తరపు న్యాయవాది కోరగా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. గత సంవత్సరం మే 26 నుంచి సత్యేంద్రజైన్ మధ్యంతర మెడికల్ బెయిల్‌పై బయటే ఉన్నారు. ఈయనకు గతేడాది జులై 21న వెన్నెముక ఆపరేషన్ జరిగింది. కాగా, 2015 నుంచి 2017 వరకు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేస్తూ అక్రమ ఆస్తులు పోగేశారన్న అభియోగాలపై 2022 జైన్ అరెస్టయ్యారు. ఇదే కేసుకు సంబంధించి జైన్ తన కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడి అక్రమ లావాదేవీలు చేశారని ప్రాథమికంగా తేల్చిన ఈడీ ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి.. ఎన్నికల బాండ్లు.. ఎస్బీఐకి సుప్రీం డెడ్‌లైన్ -
సత్యేందర్ జైన్ బెయిల్ గడువు మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ ఆరోపణలెదుర్కొంటున్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. బెయిల్ గడువు శుక్రవారంతో ముగియడంతో జస్టిస్ ఏఎస్ బొపన్న సారథ్యంలోని ధర్మాసనం విచారించాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేకపోవడంతో జస్టిస్ బేలా ఎం. త్రివేది బెయిల్ గడువును డిసెంబర్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. జైన్ పెట్టుకున్న రెగ్యులర్ బెయిల్ దరఖాస్తుపై విచారణ కూడా అదే రోజున ఉంటుందని స్పష్టం చేశారు. మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై గత ఏడాది మేలో జైన్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
Satyendar Jain: మధ్యంతర బెయిల్ మంజూరు
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కి ఎట్టకేలకు ఊరట లభించింది. అనారోగ్యం రిత్యా ఆయనకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు ఈ కేసులో తాత్కాలిక ఉపశమనం లభించినట్లయ్యింది. సత్యేందర్ జైన్‌ను ఢిల్లీ వదలి వెళ్లొద్దని చెబుతూ..షరతులతో కూడిని బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ఈ ఉత్తర్వు జూలై 11 వరకు అమలులో ఉంటుందని, అలాగే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కోర్టుకి సమర్పించాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఇదిలా ఉండగా, మనీలాండరిగ్ కేసులో గతేడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సత్యేందర్ జైన్‌ను మే 30న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించగా ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. ఇదిలా ఉంటే ఆహారపు అలవాట్ల మార్పుతో జైన్ అనారోగ్యం పాలయ్యారు. జైన్ గురువారం శ్వాసకోసం ఇబ్బందులతో అకస్మాత్తుగా జైల్లో కళ్లుతిరిగి పడిపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన్ని హుటాహుటినా జయప్రకాశ్ నారాయణ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. అనారోగ్యం రిత్యా జైన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. (చదవండి: జైల్లో కుప్పకూలిన జైన్) -
జైల్లో కుప్పకూలిన జైన్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై 2022 మే నుంచి తీహార్ జైల్లో ఉన్న మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ గురువారం కుప్పకూలిపోయారు. జైల్లో కళ్లు తిరిగిపడిన జైన్‌ను పోలీసులు హుటాహుటిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లోక్‌నాయక్ జయ్‌ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి ఐసీయూకి మార్చారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం జైలు బాత్రూమ్లో జైన్ కాలుజారి పడిపోయారని జైలు అధికారి చెప్పారు. ‘‘కీలక అవయవాలకు గాయాలయ్యాయా అని వెంటనే వైద్యులు పరిశీలించి అంతా సాధారణంగా ఉందని తేల్చారు. వెనుకవైపు, ఎడమ కాలు, భుజం విపరీతంగా నొప్పి ఉన్నాయని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం’’ అన్నారు. స్నానాలగదిలో కళ్లు తిరిగి పడిపోవడంతో వెన్నెముకకు తీవ్ర గాయమైందని ఆప్ తెలిపింది. ‘‘ఢిల్లీ ప్రజలకు మంచి వైద్యం, ఆరోగ్యం అందించాలని చూసిన జైన్‌ను ఒక నియంత ఇలా శిక్షిస్తున్నాడు. దేవుడు అంతా చూస్తున్నాడు. అందరికీ న్యాయం జరుగుతుంది’ అంటూ ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్‌చేశారు. జైన్‌ను చెప్పడంతో జైలు అధికారులు సోమవారమే సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చూపించారు. ‘‘జైన మతవిశ్వాసాలను బాగా పాటించే జైన్ జైల్లో కేవలం పళ్లు, పచ్చి కూరగాయలు తింటున్నారు. దాంతో 35 కిలోలు తగ్గారు. రాత్రంతా బీఐపీఏపీ మెషీన్‌తో శ్వాస ఇవ్వాలి’’ అని ఆప్ తెలిపింది. -
జైలు బాత్రూమ్లో కుప్పకూలిన సత్యేంద్ర జైన్.. ఆసుపత్రి తరలింపు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన గురువారం ఉదయం తీహార్ జైలులోని బాత్రూమ్లో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో, జైలు అధికారులు సత్యేంద్ర జైన్‌ను వెంటనే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. కాగా, జైన్ గడచిన వారం రోజుల్లో అనారోగ్యంతో రెండుసార్లు ఆసుపత్రిలో చేరారు. తీహార్ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సత్యేంద్ర జైన్ తన వార్డులోని బాత్రూమ్లో పడిపోయారు. దీనికిముందు మే 22న అనారోగ్యం కారణంగా సత్యేంద్ర జైన్‌ను ఢిల్లీ పోలీసులు సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకువచ్చారు. అయితే, బాత్రూమ్లో పడిపోవడంతో ఆయన వెన్నముకకు గాయమైనట్టు తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి జైన్ మనీ లాండరింగ్ కేసులో నిందితునిగా ఉన్నారు. అందులో భాగంగానే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. Jailed AAP leader Satyendar Jain admitted to hospital after slipping in washroom#satyendrajain #AAP https://t.co/6L82iMxk83 — Kalinga TV (@Kalingatv) May 25, 2023 ఇది కూడా చదవండి: పార్లమెంట్: రాజ్యసభలో రెడ్, లోక్‌సభలో గ్రీన్ కార్పెట్.. ఎందుకో తెలుసా? -
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు వైద్య పరీక్షలు
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న జైన్‌కు శనివారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్లో పరీక్షలు చేయించామని, మరోసారి వైద్యుల అభిప్రాయం తీసుకోవాలన్న ఆయన కోరిక మేరకు సోమవారం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లామని జైలు అధికారులు తెలిపారు. ఆయన వెంట పోలీసులున్నారని చెప్పారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు పరీక్షించాక ఆయన్ను తిరిగి జైలుకు తీసుకొచ్చారన్నారు. జైన్‌ను 2022 మే 31వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. జైన్ త్వరగా కోలుకోవాలని ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆకాంక్షించారు. ‘జైన్‌ను బీజేపీ చంపాలనుకుంటోంది. ఇంతటి క్రూరత్వం పనికిరాదు, మోదీజీ’ అంటూ ట్వీట్ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో జైన్ 35 కిలోలు తగ్గారని ఆయన లాయర్ అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు. -
కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. కేబినెట్లో సౌరవ్, అతిషిలకు చోటు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్లో కేజ్రీవాల్ ఇద్దరి చోటు కల్పించారు. సౌరవ్ భరద్వాజ్, అతిషికి సీఎం కేజ్రీవాల్ చోటు కల్పించారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు లేఖ రాశారు. కాగా, 48 గంటల్లో వారితో ప్రమాణ స్వీకారం చేపించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సీబీఐ వారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది. దీంతో వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్.. కేబినెట్లో సౌరవ్, అతిషికి చోటు కల్పించారు. ఇదిలా ఉండగా.. మనీశ్ సిసోడియా ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యశాఖతో సహా అనేక ఉన్నత స్థాయి శాఖలను కలిగి ఉన్నారు. సత్యేంద్ర జైన్ ఢిల్లీ ఆరోగ్య, జైళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే, సిసోడియాకు చెందిన ఫైనాన్స్, విద్యతో సహా కొన్ని పోర్ట్‌ఫోలియోలు కైలాష్ గహ్లోట్, రాజ్ కుమార్ ఆనంద్‌లకు కేటాయించారు. Delhi Chief Minister Arvind Kejriwal sent names of AAP MLAs Saurabh Bhardwaj and Atishi to Delhi LG to be elevated as ministers in the cabinet: Sources pic.twitter.com/IqemD3j19W — ANI (@ANI) March 1, 2023 -
ఆప్ నేతకు రూ. 60 కోట్లు ఇచ్చా: సుకేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: రూ. 200 కోట్ల మానీలాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న కాన్మన్ సుకేశ్ చంద్రశేఖర్.. గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేశాడు. తాజాగా మరోసారి ఆప్ పార్టీపై, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. పార్టీ నేత సత్యేంద్ర జైన్‌కు రూ. 60 కోట్లు ఇచ్చిన్నట్లు పేర్కొన్నాడు. అంతేగాక పార్టీ అధినేత కేజ్రీవాల్‌ను సైతం కలిసినట్లు తెలిపాడు. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్‌ను మంగళవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఉన్నతస్థాయి కమిటీ సుకేశ్ వాంగ్మూలాన్ని స్వీకరించిందని, దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉందని అతని తరపు న్యాయవాది అనంత్ మాలిక్ మీడియాకు తెలిపారు. తనను రాజ్యసభకు నామినేట్ చేస్తానని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత జైన్‌కు 2016లో అసోలాలోని తన ఫామ్‌హౌజ్‌లో రూ.50 కోట్లకు పైగా ఇచ్చానని సుకేశ్ తెలిపాడు. తర్వాత హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో కేజ్రీవాల్ జైన్‌తో కలిసి పాల్గొన్నారని చంద్రశేఖర్ పేర్కొన్నాడు. అంతేగాక 2019లో జైలులో తన భద్రత కోసం జైన్ రూ. 10 కోట్లు వసూలు చేశాడని చంద్రశేఖర్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు రాసిన లేఖలో ఆరోపించారు.పార్టీ కోసం 20 మంది వ్యక్తులను వెతికి వారి నుంచి పార్టీ కోసం 500 కోట్ల ఫండ్ సమకూర్చాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసినట్లు ఆరోపించాడు. సత్యేంద్ర జైన్ తనను బెదిరించారని తెలిపాడు. అప్పటి జైళ్ల శాఖ డీసీ సందీప్ గోయెల్‌కు రూ.12.50 కోట్లు చెల్లించినట్లు కూడా పేర్కొన్నాడు. తాను నేరస్థుడు అని భావిస్తే.. నా నుంచి రూ.50 కోట్లు ఎందుకు స్వీకరించారని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. అయితే చంద్రశేఖర్ ఆరోపణలు అబద్దమని ఆప్ కొట్టిపారేసింది. ఇవన్నీ బీజేపీ ఆడుతున్న నాటకాలని విమర్శించింది. చదవండి: యూనిఫామ్ ఉందని మరిచారా సార్! మహిళతో ఎస్సై డ్యాన్స్ వీడియో వైరల్ కాగా ఇదే కేసులో బాలీవుడ్ నటులు నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విలువైన బంగ్లాతో పాటు విలువైన కానుకలు సుకేశ్ స్వీకరించినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఈడీతో పాటు ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. -
10 మంది సేవకులు
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‌కు అందుతున్న రాజభోగాలపై రోజుకో వీడియో వెలుగులోకి వస్తోంది. తాజాగా ఒక వ్యక్తి ఆయన గదిని శుభ్రం చేయడం, పక్క శుభ్రంగా సర్దడం వంటి దృశ్యాలు కనిపించాయి. జైన్‌కు కావల్సినవన్నీ చేసి పెట్టడానికి దాదాపుగా 10 మంది సేవకుల్ని కేటాయించినట్టుగా తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. గది శుభ్రం చేయడం , మంచంపై దుప్పట్లు మార్చడం, బయట నుంచి ఆహారం, పళ్లు, మినరల్ వాటర్ తేవడం, బట్టలుతకడం వంటి పనుల కోసమే ఎనిమిది మంది ఉన్నారు. వారందరూ సరిగా పనులు చేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడానికి మరో ఇద్దరు వ్యక్తులు ఉంటారని తీహార్ జైలు వర్గాలు జాతీయ చానెళ్లకు వెల్లడించాయి. జైల్లో సత్యేంద్ర జైన్‌కు అందుతున్న సకల సదుపాయాలపై ఢిల్లీ కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తాను ఉల్లి, వెల్లుల్లి లేని జైన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటానని, అది తనకు జైల్లో ఇవ్వడం లేదంటూ సత్యేంద్ర జైన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పళ్లు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం లేదన్న ఆ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధల్ తోసిపుచ్చారు. -
తీహార్ లీక్స్.. బయటకొచ్చిన సత్యేంద్ర జైన్ మరో వీడియో
-
ఢిల్లీ మంత్రి జైలు విలాసాలపై ఘాటుగా స్పందించిన కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో శిక్షననుభవిస్తున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్ ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. జైలులో పోక్సో కేసులో నిందితుడైన ఖైదీతో మసాజ్ చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. జైలులో ఉంటూనే సకల రాజభోగాలు అనుభవిస్తున్నారు. గదిలోనే రుచికరమైన ఆహారం, తనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లాగిస్తూ ఇటీవల కెమెరాకు చిక్కారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా సత్యేంద్ర జైన్ జైలు విలాసాలపై పుదుచ్చేరి మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఘాటుగా స్పందించారు. మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియోథెరపీలో డిగ్రీ చేశాడా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. జైన్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ జాతీయా మీడియాతో గురువారం మాట్లాడారు. చదవండి: మసాజ్ వీడియో మరువకముందే మరొకటి.. జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు.. తీహార్ జైలు పాలకుల తప్పిదం.. ఢిల్లీ రాజకీయ పాలనకు అద్దం పడుతోందని మండిపడ్డారు. తమ సొంత మంత్రి జైలులో ఉంటే అధికారులు మాత్రం ఎలా చర్యలు తీసుకుంటారని సెటైర్లు వేశారు. ‘సొంత మంత్రి జైలులో ఉండటం చాలా అరుదైన సందర్భం.. లోపల ఉన్న జైలు బాస్ ఇప్పటికీ బాస్‌గా కొనసాగుతున్నాడు. అతను ఏదైనా చేయగలడు, అడగగలడు. అతని ఆదేశాలకు జూనియర్లు కట్టుబడి ఉంటారు. అవకతవకలు జరిగాయని సూపరింటెండెంట్ని ప్రభుత్వ సస్పెండ్ చేసింది. మరి మంత్రి సంగతేంటి? ఇలా ఎన్నికైన ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేసే వ్యవస్థ మనకు లేదా. ఆప్ నేతకు మసాజ్ చేస్తున్న ‘పెద్దమనిషి’ ఫిజియో కాదని తెలిసింది. అతను అత్యాచారం కేసులో నిందితుడని జైలు అధికారులు పేర్కొంటున్నారు. మరి అతనికి ఫిజియోథెరపీలో డిగ్రీ ఉందా.. లేదా రేప్ చేయడానికి ముందు అతను ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేశారా’ అంటూ ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అనుమతి ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ జైన్ సస్పెన్షన్ లేదా తొలగింపును రాష్ట్రపతికి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. కాగా భారత తొలి మహిళా ఐపీఎస్ అధికారిణీ అయిన కిరణ్ బేడీ.. 1993లో ఢిల్లీ జైళ్ల ఐజీగా నియమితులయ్యారు. తిహార్‌లో జైళ్ల డైరెకర్ట్ జనరల్‌గా ఉన్న సమయంలో పలు జైలు సంస్కరణలు ప్రవేశపెట్టినందుకు రామన్ మెగాసెస్ అవార్డు పొందారు. 2015లో బీజేపీలో చేరారు. చదవండి: అయినాసరే ఆడబిడ్డల్ని గమనిస్తూ ఉండాలి: కిరణ్ బేడీ -
అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్..
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తిహార్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోను రిలీజ్ చేసిన బీజేపీ కేజ్రీవాల్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే ఆప్ దీనికి కౌంటర్ ఇచ్చింది. సత్యేందర్ జైన్ చేయించుకుంది మసాజ్ కాదని, ట్రీట్మెంట్అని వివరణ ఇచ్చింది. జైలులో ఉన్న ఆయన 4 నెలలుగా ఆహారం తీసుకోలేదని, కేవలం పండ్లు మాత్రమే తింటున్నారని తెలిపింది. ఈ కారణంగానే ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స అందించాలని కోర్టు ఆదేశించిందని చెప్పింది. సత్యేందర్ జైన్ నరాల సమస్యతో బాధుపడుతున్నారని, ఆక్సీజన్ తీసుకోలేక ఇబ్బందిపడుతున్నారని పేర్కొంది. అందుకే ఆక్యుప్రెషర్ థెరపీ ద్వారా చికిత్స అందించినట్లు చెప్పుకొచ్చింది. సత్యేందర్ జైన్ రోజు గుడికి వెళ్లకుండా ఆహారం తీసుకోరని, జైలులో ఉన్న కారణంగా పండ్లపైనే ఆదారపడ్డారని ఆప్ వివరించింది. ఆయనకు చేసింది మసాజ్ కాదని, థెరపీ అని స్పష్టం చేసింది. #WATCH | CCTV video emerges of jailed Delhi minister Satyendar Jain getting a massage inside Tihar jail. pic.twitter.com/VMi8175Gag — ANI (@ANI) November 19, 2022 రూ.16 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సత్యేంజర్ జైన్‌ను మే 30న అరెస్టు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. బెయిల్ కోసం రెండుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ నిరాశే ఎదురైంది. అయితే బీజేపీ విడుదల చేసిన సత్యేందర్ జైన్ మసాజ్ వీడియో పాతదని, ఇప్పటికే ఈ ఘటనతో సంబంధం ఉన్న జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. చదవండి: ఆప్ మంత్రికి తీహార్ జైల్లో మసాజ్.. వీడియో వైరల్ -
‘నేను పెద్ద దొంగనైతే.. కేజ్రీవాల్ మహా దొంగ’
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాశాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అంశం బయటకు రావడంతో ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్, మాజీ డీజీ( తిహార్ జైళ్ల శాఖ)తనను బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. తాను అతిపెద్ద క్రిమినల్ అయితే.. కేజ్రీవాల్ మహా క్రిమినల్ అంటూ ఆరోపించాడు సుకేశ్. ‘కేజ్రీవాల్ జీ నీ ప్రకారం నేను దేశంలోనే అతిపెద్ద నేరస్థుడిని. అప్పుడు నా దగ్గర నుంచి రూ.50 కోట్లు ఎందుకు తీసుకున్నావు, రాజ్యసభ సీటు ఎందుకు ఇస్తానని చెప్పావు? అది నిన్ను ఎలా చూపుతుంది.. మహా నేరస్థుడిగా?’అని లేఖలో పేర్కొన్నాడు సుకేశ్ చంద్రశేఖర్. మరోవైపు.. సీట్ల పంపిణీ విషయంలో 20-30 మంది నుంచి పార్టీకి రూ.500 కోట్లు విరాళం ఇచ్చేలా తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించాడు. అంతకు ముందు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌పై ఆరోపణలు చేశాడు సుకేశ్. జైలులో భద్రంగా ఉండేందుకని సత్యేంద్ర జైన్‌కు రూ.50 కోట్లు ఇచ్చానని పేర్కొంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు లేఖ రాశాడు. కొద్ది రోజుల క్రితం ఈ అంశం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొట్టిపారేశారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు కేజ్రీవాల్. ఇదీ చదవండి: గుజరాత్ నుంచి వైదొలగమని బీజేపీ ఆఫర్ ఇచ్చింది: కేజ్రీవాల్ -
సుకేశ్ నుంచి ఆప్ మంత్రికి నెలకి రూ.2కోట్లు.. చిక్కుల్లో కేజ్రీవాల్!
న్యూఢిల్లి: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్.. జైలు నుంచే అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిన విషయం తెలిసిందే. జైలులో అన్ని సౌకర్యాలు అందించేందుకు సుమారు 80 మందికిపైగా అధికారులకు లక్షల్లో ముడుపులు అందించాడు. ఇలా సుకేశ్ నుంచి లంచాలు పుచ్చుకున్న అధికారులు అతడికి సకల మర్యాదలు చేసినట్లు సమాచారం. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. తాను జైలులో సురక్షితంగా ఉండేందుకు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ముడుపులు ముట్టజెప్పానని వెల్లడించటం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సుకేశ్ లేఖ రాసినట్లు తెలిసింది. తనను జైలులో తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, తనకు రక్షణ కల్పించేందుకు జైలులోనే ఉన్న సత్యేంద్ర జైన్‌కు ప్రొటెక్షన్ మనీ ఇచ్చానని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు సుకేష్ ఇచ్చినట్లు వెల్లడించింది. అందులో రాజ్యసభ నామినేషన్ కోసం రూ.50 కోట్లు తీసుకుందని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఒక మోసాల పార్టీ అంటూ ఆరోపించింది. ఖండించిన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు సుకేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అవన్ని తప్పుడు ఆరోపణలని, గుజరాత్ ఎన్నికలు, మోర్బీ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసిన కుట్రగా ఆరోపించారు. ‘అన్ని కట్టుకథలు. మోర్బీ ఘటనపై దృష్టి మళ్లించే ప్రయత్నాలు. గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో వారు భయపడుతున్నారు. ఆప్ వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆర్థిక నేరస్థుడిని ఉపయోగించి సత్యేంద్ర జైన్‌పై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు.’ అని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇదీ చదవండి: Rs 200 crore extortion case: బాలీవుడ్ హీరోయిన్, భర్తకు ఈడీ షాక్ -
ఢిల్లీ మంత్రి భార్యకు ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య పూనమ్ జైన్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. జులై 14న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. కోల్‌కతాకు చెందిన కంపెనీల్లో హవాలా లావాదేవీలకు సంబంధించి సత్యేంద్ర జైన్ అరెస్టు (మే 30) తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. జైన్ భార్య, తదితరులపై నమోదైన అక్రమ ఆస్తులు, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఏప్రిల్‌లో రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2017, ఆగస్టు 25న, సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సత్యేందర్ జైన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. జైన్ ఢిల్లీలో పలు షెల్ కంపెనీలను కొనుగోలు చేసినట్లు సమాచారం. 2010 నుండి 2014 వరకు కోల్‌కతాకు చెందిన ముగ్గురు హవాలా ఆపరేటర్లకు చెందిన 54 షెల్ కంపెనీల ద్వారా 16.39 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రి అయిన తరువాత ప్రయాస్, ఇండో, అకించన్ కంపెనీల వాటాలను 2015లో భార్య పూనమ్‌కు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ. మరోవైపు జైన్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక సీబీఐ కోర్టు జూలై 11 వరకు పొడిగించింది. -
ఒమిక్రాన్ కేసుల జోరు.. భారత్‌లో మూడో వేవ్, ఢిల్లీలో ఐదో వేవ్: ఆరోగ్య మంత్రి
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌గా మార్పు చెంది మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశవ్యాప్తంగా కొవిడ్ మూడవేవ్ ప్రారంభం కాగా.. ఢిల్లీలో ఐదో వేవ్ మొదలైందని ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. బుధవారం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10వేలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు. కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి చేరిందన్నారు. మరోవైపు ఢిల్లీలో.. గడిచిన 24 గంటల్లో 5వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పటికే 2శాతం బెడ్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రైవేటు హాస్పిటల్స్‌లో 40శాతం పడకలు కరోనా రోగుల కోసం రిజర్వ్ చేయాలని ఆదేశాలు జారీచేసినట్టు మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. మంగళవారం కోవిడ్ -19 నిర్ధారణ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి గురించి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది, అయితే పూర్తి కోలుకునేంత వరకు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని తెలిపారు. కేసుల పెరుగుదల ప్రారంభమైతే, అదే స్థాయిలో ఆక్సిజన్ డిమాండ్ అవసరముంటుందని వాటిని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని జైన్ చెప్పారు. గతంలో 50,000-55,000 పరీక్షలు జరిగేవని, అయితే ఇప్పుడు ప్రతిరోజూ దాదాపు 70,000-90,000 పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రారంభమైన ప్రయాణికుల కష్టాలు కరోనా ఆంక్షల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి. 100శాతం సామర్థ్యంతో సేవలందించేందుకు మెట్రో, బస్సులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. పలు మెట్రో స్టేషన్ల వద్ద భారీగా జనం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మెట్రోల్లో కేవలం కూర్చుని ప్రయాణించేందుకే అనుమతి ఉంది. దీంతో సీట్ల సంఖ్యను మించి ఒక్కరిని కూడా రైల్లోకి భద్రతా సిబ్బంది అనమతి ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణికులు తమ వంతు కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. చదవండి: కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి -
‘ఆక్సిజన్ మరణాల’ పై తీవ్ర దుమారం: ఖండిస్తున్న రాష్ట్రాలు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ రెండో దశ ఈ ఏడు దేశాన్ని గజగజ వణికించింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన విషయం తెలిసిందే. కేసులు రెండు లక్షలు దాటగా.. మృతుల సంఖ్య పదివేలు దాటడం కల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా వైద్యారోగ్య సేవలు కరువయ్యాయి. ముఖ్యంగా ప్రాణవాయువు ఆక్సిజన్ తీవ్రంగా వేధించింది. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక వందలాది మృతి చెందారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆక్సిజన్ కొరతతో ఎవరూ మృతి చెందలేదని తాజాగా మంగళవారం ప్రకటించడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు రాష్ట్రాల మంత్రులు కేంద్ర ప్రకటన ‘పచ్చి అబద్ధం’ అని ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రకటనపై ఢిల్లీ, కర్ణాటక మంత్రులు స్పందించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. ఈ ప్రకటన ‘పూర్తి అవాస్తవం’ అని పేర్కొన్నారు. చాలా మరణాలు ఆక్సిజన్ కొరతతో సంభవించాయని బుధవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సత్యేందర్ జైన్ తెలిపారు. ఆక్సిజన్ కొరతతో మరణాలు లేకుంటే ఆస్పత్రులు ఎందుకు హైకోర్టులను ఆశ్రయిస్తున్నాయి? అని ప్రశ్నించారు. ఆస్పత్రులు, మీడియా ఆక్సిజన్ కొరత వార్తలను చూస్తునే ఉన్నాయి. ఆక్సిజన్ మరణాలు సంభవిస్తున్నాయని టీవీ ఛానల్స్ కూడా ప్రసారం చేశాయా లేదా అని నిలదీశారు. కళ్లారా మరణాలను చూశామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. ఇలాగే ఉంటే త్వరలోనే కరోనా వైరస్ కూడా లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని సత్యేందర్ జైన్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో అయితే ఆక్సిజన్ మరణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒక్క జిల్లాలోనే (చామరాజ్నగర్ జిల్లా ఆస్పత్రి) 36 మంది ఆక్సిజన్ కొరతతో మరణించారని ఓ నివేదిక ధర్మాసనానికి చేరింది. ఈ నివేదికను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్నారాయణ్ ఖండించారు. అవి ఆక్సిజన్ మరణాలు కాదని.. ఆ ఆస్పత్రి నిర్లక్ష్యంతో సంభవించిన మరణాలుగా అభివర్ణించారు. ‘ఆ మరణాలు ఆక్సిజన్‌తో జరగలేదు. దీనిపై విచారణ కొనసాగుతోంది’ అని తెలిపారు. ‘గుడ్డిగా కేంద్రం ప్రభుత్వం అనాలోచితంగా చేసిన ప్రకటన’ అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ తెలిపారు. ‘చాలామంది తమ ఆత్మీయులు, బంధువులను ఆక్సిజన్ కొరతతో కోల్పోయారు. ఆస్పత్రులు, మీడియా వీటిని రోజూ చూస్తూనే ఉన్నాయి. ఆక్సిజన్ కొరతతో మరణించారని టీవీల్లో ప్రసారాలు వచ్చాయి’ అని తెలిపారు. ఈ అంశంపై వేణుగోపాల్ రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ పిటిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటన చేసిందని.. తప్పించుకునే ధోరణిలో చేసిన ప్రకటనగా ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. కరోనా మృతులకు నష్ట పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పించుకోవడానికి ఈ ప్రకటన చేసిందని గుర్తు చేస్తున్నారు. -
Covid-19 Vaccine: మే 1న టీకా ఇవ్వలేం
సాక్షి, ఢిల్లీ: కోవిడ్ విజృంభిస్తోన్న వేళ కరోనా కట్టడికి కేంద్రం ప్రభుత్వం మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించినప్పటికి వాస్తవంగా అది సాధ్యం కాదంటున్నాయి పలు రాష్ట్రాలు. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి టీకా కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. వారికే సరిపడా వ్యాక్సిన్లు లేవు. ఈ నేపథ్యంలో మే 1 నుంచి 18 ఏళుల పైబడిన వారందరికి వ్యాక్సిన్ అందించడం సాధ్యం కాదని పలు రాష్ట్రాలు కేంద్రానికి విన్నవించాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో దశ వ్యాక్సినేషన్ కోసం తమ దగ్గర టీకాలు లేవని.. అందువల్ల మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ‘‘ప్రసుత్తం మా దగ్గర టీకాలు లేవు. వ్యాక్సిన్లకు సంబంధించి కంపెనీలకు అభ్యర్థనలు పంపాం. ఎప్పుడు వస్తాయో త్వరలోనే చెప్తాం. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత ఇస్తాం’’ అన్నారు. ఇక ఢిల్లీలో 18 ఏళ్లు పైబడిన వారందరికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమకు 1.34 కోట్ల టీకాలు అవసరం అవుతాయని కేజ్రీవాల్ టీకా కంపెనీలను కోరారు. ఇక ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 25,986 కేసులు వెలుగు చూడగా.. 368 మంది మరణించారు. చదవండి: ఢిల్లీలో మూడవ దశకు కరోనా వైరస్? -
అందరికీ కరోనా వ్యాక్సిన్
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిన నాలుగు వారాల్లోనే ఢిల్లీ వాసులందరికి అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. పాలిక్లినిక్స్ లాంటి సదుపాయాల ఏర్సాటు చేసి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. వ్యాక్సిన్ పురోగతిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మూడు ప్రధాన నగరాల్లో పర్యటించిన నేపథ్యంలో సత్యేందర్ జైన్ ఈ మేరకు ప్రకటన చేశారు. వ్యాక్సిన్ పురోగతిని సమీక్షించనున్న ప్రధాని కరోనా వైరస్ వ్యాక్సిన్ పురోగతిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా ప్లాంట్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించారు. వ్యాక్సిన్ ట్రయల్స్ పురోగతిని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. జైడస్ కాడిలా తన టీకా జైకోవ్-డికు సంబంధించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్ విజయవంతంగా ముగిసిందని ఇది వరకే ప్రకటించింది. ఆగస్టు నుంచి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను కూడా ప్రారంభించింది. మరోపక్క భారత్ బయోటెక్ కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం మూడో దశలో కొనసాగుతోంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) టీకా తయారీ కోసం గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో కలిసి పని చేస్తోంది. -
ఢిల్లీలో మూడవ దశకు కరోనా వైరస్?
సాక్షి, ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుంది. దీంతో ఢిల్లీలో కరోనా మూడవ దశకు చేరుకున్నట్లు ఉందన్న అభిప్రాయాలపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. మూడో వేవ్ ప్రారంభమైందనడానికి ఇప్పుడే నిర్ధారణకు రాలేమని, మరో వారం రోజులు వేచి చూడాల్సి ఉందని ఆయన చెప్పారు. అయితే ఢిల్లీలో కరోనా మూడవ దశకు చేరే అవకాశం మాత్రం ఉందన్నారు. ఒక్క రోజులోనే ఎన్నడూ లేని విధంగా కొత్తగా 5,673 కేసులు నమోదు కావడమే ఇందుకు కారణం. గత వారం రోజులుగా ఢిల్లీలో రోజూ సగటున సుమారు 4వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. (ప్రజల్లో తగ్గుతోన్న కరోనా ‘యాంటీ బాడీస్’ ) దేశ వ్యాప్తంగా కేసుల తీవ్రత తగ్గుతున్నప్పటికీ రాజధానిలో మాత్రం అమాంతం కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఊహించలేనిదని మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వచ్చేది పండుగల సీజన్‌తో పాటు శీతాకాలం కావడంతో ఇప్పటివరకు అనుసరిస్తోన్న పద్ధతుల్లో కొన్ని మార్పులు చేశామని తెలిపారు. ఓ వ్యక్తికి కరోనా సోకితే అతని కుటుంబంతో సహా వారి సన్నిహితులకూ కరోనా పరీక్షలు చేస్తామని వివరించారు. మొదటగా వ్యాధి నిర్ధారణ అయిన 4-5 రోజుల అనందరం తిరిగి మరోసారి పరీక్షలు చేస్తామని చెప్పారు. ఈనెల ప్రారంభంలోనే ఢిల్లీలో రోజుకు సగటున 15వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెచ్చరించింది. లక్షణాలు ఉన్నవారికి మొదట పరీక్షలు చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలని, ఆసుపత్రుల్లో ఇందుకు తగ్గట్లు పడకలు సిద్ధం చేయాలని సూచింంచింది. ప్రస్తుతం ఢిల్లీలో 29,378 యాక్టివ్ కేసులుండగా మొత్తం కేసుల సంఖ్య 3.7 లక్షలకు చేరుకుంది. (కరోనా పాజిటివ్, కేంద్ర మంత్రి ఫన్నీ మీమ్ ) -
‘దీన్ని సెకండ్ వేవ్ అనలేం’
న్యూఢిల్లీ: కాస్తా తెరపినిచ్చింది అనుకునేలోపే దేశ రాజధానిలో కరోనా మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఏకంగా ఢిల్లీలో 2,509 కేసులు నమోదయ్యాయి. దాంతో రాజధానిలో వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దీన్ని సెకండ్ వేవ్ అనకూడదు. ఓ రెండు నెలల పాటు జీరో కేసులు నమోదయ్యి.. ఆ తర్వాత కొత్తగా కేసులు వెలుగు చూస్తే దానిని సెకండ్ వేవ్ అంటాం. ఢిల్లీలో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కాకపోతే కేసుల సంఖ్యలో తేడాలు కనిపిస్తున్నాయి. దీని గురించి ఆందోళన చెందకూడదు’ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,79,569కి చేరింది. ఇక మరణాల సంఖ్య 4,481కి చేరింది. (చదవండి: కరోనా బారిన 'ద రాక్' కుటుంబం) సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ‘ఇక బుధవారం నాడు మరణాల సంఖ్య 0.75శాతంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే 2.5శాతం మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం పరీక్షల సంఖ్యను పెంచుతున్నాము. ఒక్కరోజులోనే 30-35 వేల పరీక్షలు నిర్వహిస్తున్నాము’ అని తెలిపారు. ఇక ప్రజలు కూడా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడంతో పాటు తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని సత్యేంద్ర జైన్ కోరారు. గత వారం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ప్రభుత్వం కోవిడ్ -19 పరీక్షలను 20,000 నుంచి 40,000 కు పెంచుతామని ప్రకటించారు. -
‘అందుకే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లా’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో దాదాపు 30 రోజులు పోరాడిన తర్వాత విధుల్లో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ దేశ రాజధానిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌కు మెరుగైన చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లాస్మా థెరఫీ చికిత్సకు ఇచ్చిన అనుమతి గడువుతీరడంతో తాను ప్రైవేట్ ఆస్పత్రికి మారాల్సివచ్చిందని ఆయన వెల్లడించారు. తనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు ఒకరోజు ముందు తాను మామగారిని కోల్పోవడంతో తమ కుటుంబం భయాందోళనకు గురైందని చెప్పారు. తొలుత తాను చేరిన రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏ ప్రైవేట్ ఆస్పత్రి కంటే మెరుగైదని స్పష్టం చేశారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యులు తనకు ప్లాస్మా థెరఫీ ఇవ్వాలని నిర్ణయించారని, అందుకు ఆ ఆస్పత్రికి అనుమతి లేదని, ఎన్జేపీ అనుమతి కూడా గడువుతీరడంతో అనుమతి కోసం వేచిచూడాలని తాను భావించానన్నారు. కుటుంబ సభ్యులు, వైద్యుల ఒత్తిడితో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాల్సివచ్చిందని చెప్పుకొచ్చారు. పదిరోజుల తర్వాత ఆ ఆస్పత్రులకు ప్లాస్మా థెరఫీ అందించేందుకు అనుమతి లభించిందని తెలిపారు. నాలుగు రోజుల కిందటి వరకూ తాను ప్రతిరోజూ ఆక్సిజన్ తీసుకున్నానని..కొద్దిరోజుల పాటు ఆక్సిజన్ లేకుండా ఉండగలగడంతో విధులు నిర్వహించేందుకు తనను వైద్యులు అనుమతించారని మంత్రి జైన్ తెలిపారు. కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను జూన్ 17న రాజీవ్ గాంధీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించి ఆక్సిజన్‌ను అందించారు. ప్లాస్మా థెరఫీ నిర్వహించిన అనంతరం మంత్రి జైన్ ఆరోగ్యం మెరుగుపడింది. చదవండి : తిరిగి విధుల్లో చేరిన ఢిల్లీ ఆరోగ్యమంత్రి -
తిరిగి విధుల్లో చేరిన ఢిల్లీ ఆరోగ్యమంత్రి
న్యూఢిల్లీ : కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నేటి నుంచి తిరిగి విధులు ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మంత్రి నిత్యం ఆసుప్రతులను సందర్శించేవారని, ఆరోగ్య కార్యకర్తలతో సమావేశమయ్యారని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారినపడ్డారని, దాదాపు నెల రోజుల తర్వాత విధుల్లో తిరిగి చేరుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ అంటూ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. జూన్ 17న ఆరోగ్యమంత్రి సత్యేంద్రకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. మొదట రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం విషమించడంతో ఆయనను మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. 55 ఏళ్ల జైన్‌కు ప్లాస్మా థెరఫీ ఇవ్వడంతో ఆరోగ్య పరిస్థితి మెరుగపడింది. దీంతో జూన్ 26న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. — Arvind Kejriwal (@ArvindKejriwal) July 20, 2020 -
ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఢిల్లీ ప్రభుత్వాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నిన్న(సోమవారం) రాత్రి రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. అధిక జ్వరం, శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కోవిడ్-19పరీక్ష చేసిన వైద్యుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని జైన్ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత రాత్రి హై గ్రేడ్ జ్వరం, ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా పడిపోవటంతో ఆసుపత్రిలో చేరానని ఆయన ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యం కారణంగా ఇటీవల స్వీయ నియంత్రణలోకి వెళ్లారు. అయితే అనంతరం ఆయనకు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పిల్చుకున్న సంగతి తెలిసిందే. Due to high grade fever and a sudden drop of my oxygen levels last night I have been admitted to RGSSH. Will keep everyone updated — Satyendar Jain (@SatyendarJain) June 16, 2020 -
‘లాక్డౌన్ పొడగించడం లేదు’
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశరాజధానిలో లాక్డౌన్ పొడగిస్తారంటూ ప్రచారం అవుతున్న వార్తలపై ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర ప్రసాద్ జైన్ స్పందించారు. లాక్డౌన్ పొగించేది లేదని స్పష్టం చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఢిల్లీలో లాక్‌డౌన్‌ను పొడగించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నిజం కాదు. లాక్‌డౌన్‌ను పొడగించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అన్నారు. రెండు రోజులుగా సోషల్‌మీడియాలో ఢిల్లీ, తమిళనాడులో జూన్ 15 నుంచి జూలై 31 వరకు లాక్డౌన్ పొడగిస్తారనే వార్తలు ప్రచారం అయ్యాయి. ‘రీలాక్ ఢిల్లీ’ అనే హ్యాష్‌ట్యాగ్ తెగ ట్రెండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో సత్యేంద్ర జైన్ ఈ వార్తలపై స్పందించారు.(మరోసారి సంపూర్ణ లాక్డౌన్: నిజమేనా?) ఇదిలా ఉండగా ఢిల్లీలో 2,098 కరోనా మరణాలు సంభవించాయన్న మునిసిపల్ కార్పొరేషన్ వ్యాఖ్యలను సత్యేంద్ర జైన్ కొట్టిపారేశారు. ‘మున్సిపల్ అధికారులు చెబుతున మాట వాస్తవమే అయితే ఆ వివరాలను మాకు ఎందుకు పంపించడం లేదు. మృతుల పేర్లు, వయస్సు వంటి అన్ని వివరాలు అవసరం. ఆ జాబితాను పంపించండి’ అన్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 35,000 కరోనా కేసులు నమోదు కాగా.. 1,085 మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, తమిళనాడు తరువాత ఢిల్లీ దేశంలో కరోనా కేసుల సంఖ్యలో మూడవ స్థానంలో ఉంది. జూలై 31 నాటికి రాజధానిలో 5.5 లక్షల కరోనా కేసులు ఉంటాయని కేజ్రీవాల్ ప్రభుత్వం అంచనా వేసింది.