మంత్రిపై చెప్పు విసిరిన మహిళ | Slipper Thrown At Delhi Health Minister Satyendra Jain Again | Sakshi
Sakshi News home page

మంత్రిపై చెప్పు విసిరిన మహిళ

Published Tue, Oct 4 2016 8:32 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

మంత్రిపై చెప్పు విసిరిన మహిళ

మంత్రిపై చెప్పు విసిరిన మహిళ

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌పై ఓ మహిళ చెప్పు విసిరింది. మంగళవారం మధ్యాహ్నం ఆదాయ పన్ను శాఖ కార్యాలయం బయట భావన అరోరా అనే ఆమ్‌ ఆద్మీ సేన కార్యకర్త జైన్‌పై చెప్పు విసిరింది. ఆయన కొద్దిలో తప్పించుకోగా, చెప్పు వాహనంపై పడింది. ఆ సమయంలో వాహనంలో ఆయనతో పాటు ఆప్‌ నేతలు సంజయ్‌ సింగ్‌, అశుతోష్‌  ఉన్నారు.

భారత్‌ సైన్యం చేసిన సర్జికల్‌ దాడులపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, అందుకే దాడిచేశానని భావన చెప్పింది. ఆప్‌ నేతలు పాకిస్థాన్‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసుకు సంబంధించి జైన్‌ ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆమ్‌ ఆద్మీ సేన కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement