న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జెయిన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం(మార్చ్ 18) కొట్టివేసింది. జైన్ వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బేలా ఎమ్. త్రివేది, పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం జైన్ బెయిల్ పిటిషన్‌ను విచారించింది.‘బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం, పిటిషనర్ వెంటనే లొంగిపోవాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
అనారోగ్య కారణాల వల్ల తన క్లైంట్ లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని సత్యేంద్ర జైన్ తరపు న్యాయవాది కోరగా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. గత సంవత్సరం మే 26 నుంచి సత్యేంద్రజైన్ మధ్యంతర మెడికల్ బెయిల్‌పై బయటే ఉన్నారు. ఈయనకు గతేడాది జులై 21న వెన్నెముక ఆపరేషన్ జరిగింది.
కాగా, 2015 నుంచి 2017 వరకు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేస్తూ అక్రమ ఆస్తులు పోగేశారన్న అభియోగాలపై 2022 జైన్ అరెస్టయ్యారు. ఇదే కేసుకు సంబంధించి జైన్ తన కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడి అక్రమ లావాదేవీలు చేశారని ప్రాథమికంగా తేల్చిన ఈడీ ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment