న్యూఢిల్లీ : కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నేటి నుంచి తిరిగి విధులు ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మంత్రి నిత్యం ఆసుప్రతులను సందర్శించేవారని, ఆరోగ్య కార్యకర్తలతో సమావేశమయ్యారని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారినపడ్డారని, దాదాపు నెల రోజుల తర్వాత విధుల్లో తిరిగి చేరుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ అంటూ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. జూన్ 17న ఆరోగ్యమంత్రి సత్యేంద్రకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. మొదట రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం విషమించడంతో ఆయనను మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. 55 ఏళ్ల జైన్‌కు ప్లాస్మా థెరఫీ ఇవ్వడంతో ఆరోగ్య పరిస్థితి మెరుగపడింది. దీంతో జూన్ 26న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 20, 2020
Comments
Please login to add a commentAdd a comment