సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కి ఎట్టకేలకు ఊరట లభించింది. అనారోగ్యం రిత్యా ఆయనకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు ఈ కేసులో తాత్కాలిక ఉపశమనం లభించినట్లయ్యింది.
సత్యేందర్ జైన్‌ను ఢిల్లీ వదలి వెళ్లొద్దని చెబుతూ..షరతులతో కూడిని బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ఈ ఉత్తర్వు జూలై 11 వరకు అమలులో ఉంటుందని, అలాగే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కోర్టుకి సమర్పించాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.
ఇదిలా ఉండగా, మనీలాండరిగ్ కేసులో గతేడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సత్యేందర్ జైన్‌ను మే 30న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించగా ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. ఇదిలా ఉంటే ఆహారపు అలవాట్ల మార్పుతో జైన్ అనారోగ్యం పాలయ్యారు.
జైన్ గురువారం శ్వాసకోసం ఇబ్బందులతో అకస్మాత్తుగా జైల్లో కళ్లుతిరిగి పడిపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన్ని హుటాహుటినా జయప్రకాశ్ నారాయణ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. అనారోగ్యం రిత్యా జైన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
(చదవండి: జైల్లో కుప్పకూలిన జైన్)
Comments
Please login to add a commentAdd a comment