సాక్షి, ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుంది. దీంతో ఢిల్లీలో కరోనా మూడవ దశకు చేరుకున్నట్లు ఉందన్న అభిప్రాయాలపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. మూడో వేవ్ ప్రారంభమైందనడానికి ఇప్పుడే నిర్ధారణకు రాలేమని, మరో వారం రోజులు వేచి చూడాల్సి ఉందని ఆయన చెప్పారు. అయితే ఢిల్లీలో కరోనా మూడవ దశకు చేరే అవకాశం మాత్రం ఉందన్నారు. ఒక్క రోజులోనే ఎన్నడూ లేని విధంగా కొత్తగా 5,673 కేసులు నమోదు కావడమే ఇందుకు కారణం. గత వారం రోజులుగా ఢిల్లీలో రోజూ సగటున సుమారు 4వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. (ప్రజల్లో తగ్గుతోన్న కరోనా ‘యాంటీ బాడీస్’ )
దేశ వ్యాప్తంగా కేసుల తీవ్రత తగ్గుతున్నప్పటికీ రాజధానిలో మాత్రం అమాంతం కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఊహించలేనిదని మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వచ్చేది పండుగల సీజన్‌తో పాటు శీతాకాలం కావడంతో ఇప్పటివరకు అనుసరిస్తోన్న పద్ధతుల్లో కొన్ని మార్పులు చేశామని తెలిపారు. ఓ వ్యక్తికి కరోనా సోకితే అతని కుటుంబంతో సహా వారి సన్నిహితులకూ కరోనా పరీక్షలు చేస్తామని వివరించారు.
మొదటగా వ్యాధి నిర్ధారణ అయిన 4-5 రోజుల అనందరం తిరిగి మరోసారి పరీక్షలు చేస్తామని చెప్పారు. ఈనెల ప్రారంభంలోనే ఢిల్లీలో రోజుకు సగటున 15వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెచ్చరించింది. లక్షణాలు ఉన్నవారికి మొదట పరీక్షలు చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలని, ఆసుపత్రుల్లో ఇందుకు తగ్గట్లు పడకలు సిద్ధం చేయాలని సూచింంచింది. ప్రస్తుతం ఢిల్లీలో 29,378 యాక్టివ్ కేసులుండగా మొత్తం కేసుల సంఖ్య 3.7 లక్షలకు చేరుకుంది. (కరోనా పాజిటివ్, కేంద్ర మంత్రి ఫన్నీ మీమ్ )
Comments
Please login to add a commentAdd a comment