ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన గురువారం ఉదయం తీహార్ జైలులోని బాత్రూమ్‌లో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో, జైలు అధికారులు సత్యేంద్ర జైన్‌ను వెంటనే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. కాగా, జైన్ గడచిన వారం రోజుల్లో అనారోగ్యంతో రెండుసార్లు ఆసుపత్రిలో చేరారు.
తీహార్ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సత్యేంద్ర జైన్ తన వార్డులోని బాత్రూమ్‌లో పడిపోయారు. దీనికిముందు మే 22న అనారోగ్యం కారణంగా సత్యేంద్ర జైన్‌ను ఢిల్లీ పోలీసులు సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకువచ్చారు. అయితే, బాత్‌రూమ్‌లో పడిపోవడంతో ఆయన వెన్నముకకు గాయమైనట్టు తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి జైన్ మనీ లాండరింగ్ కేసులో నిందితునిగా ఉన్నారు. అందులో భాగంగానే జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
Jailed AAP leader Satyendar Jain admitted to hospital after slipping in washroom#satyendrajain #AAP https://t.co/6L82iMxk83
— Kalinga TV (@Kalingatv) May 25, 2023
ఇది కూడా చదవండి: పార్లమెంట్: రాజ్యసభలో రెడ్, లోక్‌సభలో గ్రీన్ కార్పెట్.. ఎందుకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment