Conman
-
మహానేరగాడిలో వికసించిన మానవత్వం.. రూ.10 కోట్లు విరాళం
ఒడిశా: రూ. 200 కోట్లు మనీలాండరింగ్ కేసులో అరెస్టై మాండోలి జైలులో ఊచలు లెక్కబెడుతున్న కరుడుగట్టిన ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ మంచివాడిగా మారి ఒడిశా రైలు ప్రమాదంలో బాధితులకు రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు జైలు నుంచే ఒక లేఖ కూడా రాశాడు. ఎవరీ సుఖేష్.. కోర్టు ధిక్కారణతోపాటు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మాల్విందర్ సింగ్ లకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మబలికి వారి భార్యల నుండి సుమారు రూ.200 కోట్లు దోచుకున్న కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్. అయితే తీహార్ జైలులో ఉంటూనే సుఖేష్ ఈ నేరానికి పాల్పడటం ఆశ్చర్యకరం. కేవలం మాటలతోనే మాయ చేయగల ఈ మహా నేరగాడిలో ఉన్నట్టుండి మానవత్వం పరిమళించి రైలు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 1200 మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారికి, అనాథలైన పిల్లలకు రూ. 10 కోట్లు ఆర్ధిక సాయం అందించనున్నట్లు సుఖేష్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. లేఖలో ఏమని రాశాడంటే.. "నేను పంపిస్తున్న మొత్తం నగదు చట్టబద్ధంగా సంపాదించినది. దీనికి టాక్స్ కూడా కట్టాను. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలతో పాటు రూ.10 కోట్ల డీడీను కూడా పంపిస్తాను. ఒడిశా రైలు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎలాగూ అండగా ఉంటుంది. కానీ బాధ్యతగల మంచి పౌరుడిగా నేను కూడా వారికి నా వంతుగా రూ.10 కోట్లు సాయం చేయాలని అనుకుంటున్నాను. ఈ మొత్తం సొమ్ము తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు, పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. దయచేసి నా ఈ అభ్యర్ధనను అంగీకరించి విరాళాలు సేకరించే సంబంధిత శాఖ వివరాలను తెలపగలరు." అని రాశాడు. మహా నేరగాడు, మానవత్వం, రైలు ప్రమాదం, ఒడిశా రైలు ప్రమాదం, సుఖేష్ చంద్రశేఖర్, చట్టబద్ధం, ప్రమాద బాధితులు, ప్రభుత్వం ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త! -
బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చా.: సుఖేశ్ చంద్రశేఖర్
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యి, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సుఖే‹Ôæ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చాడు. 2020లో హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి) కార్యాలయంలో ‘ఏపీ’ అనే వ్యక్తికి రూ.75 కోట్లు అందజేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ తనను ఆదేశించారని వెల్లడించాడు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో భాగస్వామి అయిన ‘ఏపీ’ అనే వ్యక్తికి టీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు అందజేశానని తెలియజేశాడు. ఒక్కో పెట్టెలో 15 కిలోల నెయ్యి (కోడ్ భాషలో రూ.15 కోట్లు) ఉందని, మొత్తం 5 పెట్టెలు (రూ.75 కోట్లు) హైదరాబాద్‌లో సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ తనతో చెప్పారని, ఆయన ఆదేశాల మేరకు వాటిని టీఆర్ఎస్ కార్యాలయంలో సంబంధిత వ్యక్తికి చేరవేశానని స్పష్టం చేశాడు. సదరు వ్యక్తి టీఆర్ఎస్ ఆఫీసు ప్రాంగణంలో రేంజ్ రోవర్ కారులో కూర్చొని ఉండగా డబ్బులు అందజేశానని తెలిపాడు. ఈ మేరకు సుకేశ్ శుక్రవారం తన న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా ఒక లేఖ విడుదల చేశాడు. 2020లో తనకు, కేజ్రీవాల్‌కు మధ్య నడిచిన చాటింగ్ గురించి సుఖేశ్ చంద్రశేఖర్ ఇందులో ప్రస్తావించాడు. కేజ్రీవాల్ కరడుగట్టిన అవినీతిపరుడని, ఆయన బాగోతం మొత్తం బయటపెడతానని లేఖలో పేర్కొన్నాడు. ఇది ట్రైలర్ మాత్రమేనని.. తాను, కేజ్రీవాల్ పరస్పరం పంపించుకున్న సందేశాలను బహిర్గతం చేస్తానని వెల్లడించాడు. 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాటింగ్ తన వద్ద ఉందన్నాడు. తాను బయటపెట్టే నిజాలతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జోక్‌గా మారిపోతున్నాయని ఎద్దేవా చేశాడు. తీహార్ క్లబ్‌లోకి కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీశ్ సిసోడియా తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం తథ్యమని సుఖేశ్ చంద్రశేఖర్ ఇటీవలే వెల్లడించాడు. మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం అతడిని ఇటీవల కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అరవింద్ కేజ్రివాల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని అన్నాడు. ఆయన త్వరలో ‘తీహార్ క్లబ్’లో చేరబోతున్నారని చెప్పాడు. వచ్చేవారం ముఖ్యమైన అంశాలను బయటపెట్టబోతున్నానని తెలిపాడు. సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు, పార్టీకి రూ.60 కోట్లు రూ.200 కోట్లు బలవంతంగా వసూలు చేసిన కేసులో సుఖేష్ చంద్రశేఖర్ గత ఏడాది అరెస్టయ్యాడు. అప్పటినుంచి కేజ్రివాల్‌కు, ఆమ్ ఆద్మీ పారీ్టకి వ్యతిరేకంగా వరుసగా లేఖలు విడుదల చేస్తున్నాడు. కేసుల నుంచి బయటపడడానికి కేజ్రివాల్ సహచరుడు సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు, ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.60 కోట్లు అందజేశానని లేఖల్లో వెల్లడించాడు. అయితే, సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలను కేజ్రివాల్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆదేశాల ప్రకారమే సుఖేష్ పనిచేస్తున్నాడని మండిపడ్డారు. అతడిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించినా ఆశ్చర్యం లేదని తెలిపారు. ఎవరీ సుఖేష్ చంద్రశేఖర్? సుఖేష్ చంద్రశేఖర్ అలియాస్ బాలాజీ 1989లో కర్ణాటక రాజధాని బెంగళూరులో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జని్మంచాడు. కాలేజీ చదువు పూర్తయ్యాక విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. ఖరీదైన లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లపై మోజు పెంచుకున్నాడు. డబ్బు కోసం అడ్డదారులు ఎంచుకున్నాడు. మోసాలే వృత్తిగా మార్చుకున్నాడు. 17 ఏళ్ల వయసులో తమ కుటుంబ మిత్రుడిని రూ.1.5 కోట్ల మేర మోసగించాడు. ఆ కేసులో అరెస్టయి, బెయిల్‌పై బయటకు వచ్చాడు. తనకు ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలామందిని దగా చేశాడు. కోట్ల రూపాయలు దండుకున్నాడు. సినీ నటి లీనా మారియా పాల్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2011లో వారిద్దరూ విడిపోయారు. కొన్నిరోజుల తర్వాత మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. ఓ కేసులో బెయిల్ ఇప్పిస్తానంటూ ఫోరి్టస్ హెల్త్‌కేర్ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య ఆదితీ సింగ్ నుంచి రూ.200 కోట్లు వసూలు చేశాడు. ఇదే కేసులో ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నాడు. తన మోసాలకు బాలీవుడ్ నటీమణులను పావులుగా వాడుకోవడం సుఖేష్‌కు వెన్నతో పెట్టిన విద్య. ప్రముఖ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీకి ఖరీదైన బహుమతులు, కార్లు ఇచి్చన లోబర్చుకున్నట్లు సుఖే‹Ùపై ఆరోపణలున్నాయి. చదవండి: టీఎస్పీఎస్సీకి సిట్ టెస్ట్.. పేపర్ల లీకేజీ వ్యవహారంలో సెక్రెటరీ, సభ్యుడికి నోటీసులు -
ప్రధాని కార్యాలయ అధికారిగా బురిడీ కొట్టించి..చివరికి పోలీసులకు చిక్కి..
ముగ్గురు వ్యక్తులు ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన అధికారనంటూ ఫోజులిస్తూ జమ్ముకాశ్మీర్ యంత్రాంగాన్ని మోసగించారు. ఈ మేరకు గుజరాత్‌కి చెందిన కిరణ్ భాయ్ పటేల్ నేతృత్వంలోని బృందంలో ముగ్గురు వ్యక్తులు పీఎంఓ అధికారులుగా నటిస్తూ.. జమ్మూకాశ్మీర్‌లో పర్యటించి, బుల్లెట్ ప్రూఫ్ మహింద్రా స్కార్పియో కార్లలో తిరుగుతూ ఫైవ్ స్టార్ హోటళ్లలో అతిధ్యం అందుకున్నారు. వారి చేతిలో మోసపోయిన జమ్ము కాశ్మీర్ అధికారులు వారికి సకల రాచమర్యాదలు అందించారు. గతేడాది నుంచి ఈ ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన బృందం కశ్మీర్లో పర్యటిస్తుంది. అదికూడా రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి పర్యటనకు రావడంతో అనుమానం తలెత్తి.. భద్రతా అధికారులు సీఐడీకి సమాచారం అందించారు. కిరణ్ భాయ్ పటేల్ తోపాటు ఉన్న మిగతా ముగ్గురు వ్యక్తులను గుజరాత్‌కు చెందిన అమిత్ హితేష్ పాండియా, జే సితాపరా, రాజస్థాన్‌కి చెందిన త్రిలోక్ సింగ్‌లుగా గుర్తించారు. వీరంతా పీంఎంఓ బృందంగా నటిస్తూ.. గతుడాది అక్టోబర్ నుంచి కాశ్మీర్లో నాలుగు సార్లు పర్యటించారు. అధికారిక వర్గాల ప్రకారం..దక్షిణ కాశ్మీర్లో జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న ఒక ఐఏఎస్ అధికారి సదరు సీనియర్ పీఎంఓ అధికారి సందర్శన గురించి పోలీసుల భద్రతా విభాగానికి సమాచారం అందించినట్లు అధికారికి వర్గాలు తెలిపాయి. దీంతో భద్రతా విభాగం నిందితుడు పటేల్‌కు జెడ్ ప్లస్ భద్రతలను అందించడమే గాక అక్టోబర్ నుంచి నాలుగు పర్యటనల్లో అతను ఎక్కడికి వెళ్లినా వీఐపీ హోదాగా వెంట స్థానిక పోలీసులు కూడా వచ్చారు. సదరు మోసగాడు కిరణ్ భాయ్ పటేల్ అక్కడ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి, నియంత్రణ రేఖ సమీపంలోని ఉరిలోని కమాన్ పోస్ట్ నుంచి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌కు వరకు పర్యటించాడు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. అంతేగాదు అక్కడ దూద్పత్రిని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చడంపై చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. నిందితుడు పటేల్ తొలిసారిగా అక్టోబర్ 27న తన కుటుంబంతో సహా పర్యాటనకు వచ్చాడని ఆ తర్వాత పర్యటనలో ఈ ముగ్గురు వ్యక్తులు చేరినట్లు తెలిపారు. గట్టి నిఘాపెట్టిన సీఐడీ వర్గాలు అతడి గత చరిత్రను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆ వ్యక్తిని చాలా పకడ్బంధింగా అరెస్టు చేశారు. ఐతే పటేల్ అరెస్టు కావడానికి కొద్ది నిమిషాల ముందు మిగతా ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. వారికి సహకరించిన ఇద్దరు పోలీసులపై కూడా చర్యలు తీసుకున్నారు. కాగా, నిందితుడు పటేల్‌ని దర్యాప్తు చేసేందుకు గుజరాత్ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్లు తెలిపారు. (చదవండి: పనిలోంచి తీసేశారని క్లీనర్ రివేంజ్..కార్లపై యాసిడ్ పోసి..) -
‘నేను పెద్ద దొంగనైతే.. కేజ్రీవాల్ మహా దొంగ’
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాశాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అంశం బయటకు రావడంతో ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్, మాజీ డీజీ( తిహార్ జైళ్ల శాఖ)తనను బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. తాను అతిపెద్ద క్రిమినల్ అయితే.. కేజ్రీవాల్ మహా క్రిమినల్ అంటూ ఆరోపించాడు సుకేశ్. ‘కేజ్రీవాల్ జీ నీ ప్రకారం నేను దేశంలోనే అతిపెద్ద నేరస్థుడిని. అప్పుడు నా దగ్గర నుంచి రూ.50 కోట్లు ఎందుకు తీసుకున్నావు, రాజ్యసభ సీటు ఎందుకు ఇస్తానని చెప్పావు? అది నిన్ను ఎలా చూపుతుంది.. మహా నేరస్థుడిగా?’అని లేఖలో పేర్కొన్నాడు సుకేశ్ చంద్రశేఖర్. మరోవైపు.. సీట్ల పంపిణీ విషయంలో 20-30 మంది నుంచి పార్టీకి రూ.500 కోట్లు విరాళం ఇచ్చేలా తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించాడు. అంతకు ముందు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌పై ఆరోపణలు చేశాడు సుకేశ్. జైలులో భద్రంగా ఉండేందుకని సత్యేంద్ర జైన్‌కు రూ.50 కోట్లు ఇచ్చానని పేర్కొంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు లేఖ రాశాడు. కొద్ది రోజుల క్రితం ఈ అంశం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొట్టిపారేశారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు కేజ్రీవాల్. ఇదీ చదవండి: గుజరాత్ నుంచి వైదొలగమని బీజేపీ ఆఫర్ ఇచ్చింది: కేజ్రీవాల్ -
సుకేశ్ నుంచి ఆప్ మంత్రికి నెలకి రూ.2కోట్లు.. చిక్కుల్లో కేజ్రీవాల్!
న్యూఢిల్లి: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్.. జైలు నుంచే అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిన విషయం తెలిసిందే. జైలులో అన్ని సౌకర్యాలు అందించేందుకు సుమారు 80 మందికిపైగా అధికారులకు లక్షల్లో ముడుపులు అందించాడు. ఇలా సుకేశ్ నుంచి లంచాలు పుచ్చుకున్న అధికారులు అతడికి సకల మర్యాదలు చేసినట్లు సమాచారం. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. తాను జైలులో సురక్షితంగా ఉండేందుకు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ముడుపులు ముట్టజెప్పానని వెల్లడించటం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సుకేశ్ లేఖ రాసినట్లు తెలిసింది. తనను జైలులో తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, తనకు రక్షణ కల్పించేందుకు జైలులోనే ఉన్న సత్యేంద్ర జైన్‌కు ప్రొటెక్షన్ మనీ ఇచ్చానని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు సుకేష్ ఇచ్చినట్లు వెల్లడించింది. అందులో రాజ్యసభ నామినేషన్ కోసం రూ.50 కోట్లు తీసుకుందని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఒక మోసాల పార్టీ అంటూ ఆరోపించింది. ఖండించిన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు సుకేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అవన్ని తప్పుడు ఆరోపణలని, గుజరాత్ ఎన్నికలు, మోర్బీ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసిన కుట్రగా ఆరోపించారు. ‘అన్ని కట్టుకథలు. మోర్బీ ఘటనపై దృష్టి మళ్లించే ప్రయత్నాలు. గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో వారు భయపడుతున్నారు. ఆప్ వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆర్థిక నేరస్థుడిని ఉపయోగించి సత్యేంద్ర జైన్‌పై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు.’ అని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇదీ చదవండి: Rs 200 crore extortion case: బాలీవుడ్ హీరోయిన్, భర్తకు ఈడీ షాక్ -
జైలు నుంచే అక్రమాలు.. లక్షల్లో ముడుపులు.. దిమ్మ తిరిగే షాకింగ్ విషయాలు
ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అరెస్టై జైలుకు వెళ్లినా క్రమంలో.. అక్కడి నుంచే అన్ని కార్యక్రమాలు నడిపించాడు. అందుకోసం ఢిల్లీ రోహిణి జైలులోని 81మంది అధికారులకు సుకేష్ భారీగా లంచాలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత సుకేష్‌ను తిహార్ జైలుకు మార్చారు. ఇలా సుకేశ్ నుంచి లంచాలు పుచ్చుకున్న అధికారులు అతడికి సకల మర్యాదలు చేసినట్లు సమాచారం. జైలు బయట ఉన్న తన అనుచరులతో మాట్లాడేందుకు మొబైల్ ఫోన్ వంటివి అందించినట్లు దిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) తేల్చింది. సుకేష్ నుంచి ముడుపులు అందుకున్న జైలు అధికారులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. తన భార్య లీనాతో ఉండేందుకు ఒక్క రాత్రికే జైలు అధికారులకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు సుకేష్ ఇచ్చినట్లు ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు. ఇటీవలే జైలు ఆసుపత్రికి వెళ్లిన సుకేశ్.. అక్కడి నర్సింగ్ స్టాఫ్ సాయంతో అనుచరులతో మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ దిశగానూ ఆర్థిక నేరాల విభాగం విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా.. తిహార్ జైలులో తమకు ప్రాణహాని ఉందని, దిల్లీ వెలుపలి జైలుకు తమని తరలించాలని గత నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు సుకేష్, ఆయన భార్య లీనా. జైలులో తమకు సాయం చేసినట్లు అనుమానిస్తున్న అధికారుల నుంచే తమకు ముప్పు ఉందని కోర్టుకు విన్నవించారు. దిల్లీ బయటి జైలుకు తమని మార్చాలని కోరారు. 2017లో ఎన్నికల సంఘం అధికారులకు లంచం కేసుకు సంబంధించిన మరో మనీలాండరింగ్ కేసులో గత ఏప్రిల్ 4న సుకేష్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అయితే.. ఇప్పటే ఆరోగ్య విభాగం ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ సహా పలువురు ప్రముఖ వ్యక్తులను మోసం చేసి కోట్ల రూపాయలు కాజేసిన నేరం కింద అరెస్టై జైలు జీవితం అనుభవిస్తున్నాడు సుకేష్. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సహా పలువురు మోడల్స్‌ను ఈడీ ప్రశ్నించింది. ఇదీ చదవండి: జాక్వెలిన్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర -
పచ్చి మోసగాడని తెలీదు.. నా కళ్లు తెరిపించారు
నా జీవితం నాశనం అవ్వకుండా కాపాడారు. అతనంత పచ్చి మోసగాడని తెలీదు. విషయం నా దాకా తీసుకొచ్చిన ఆ ముగ్గురికి జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్లు నా కళ్లు తెరిపించారు. అంటోంది అస్సాం(అసోం) నాగావ్‌కు చెందిన ఎస్సై జున్‌మోనీ రభా. సోషల్ మీడియాలో ఈ ధైర్యశాలి పోలీస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అసోంలో ఈ మహిళా పోలీసు అధికారిణి.. తన కాబోయే భర్త మోసగాడని తెలియడంతో ఏమాత్రం వెనుకంజ వేయకుండా అరెస్ట్ చేసింది. జున్‌మోనీ రభా నాగావ్‌లో పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత అక్టోబరులో రానా పోగాగ్ అనే వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో ఆమె వివాహం జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. రానా పోగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(పీఆర్వోగా) జున్‌మోనీ కుటుంబానికి పరిచయం చేసుకున్నాడు. అయితే, అతగాడు ఓఎన్జీసీలో పనిచేస్తున్నానని పలువురిని నమ్మబలికి.. ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. అతనికి కాబోయే భార్య ఒక ఎస్సై అని, పైగా నిజాయితీకి మారుపేరని తెలియడంతో ముగ్గురు బాధితులు ఆమెను ఆశ్రయించారు. దీంతో వాళ్ల నుంచి ఫిర్యాదు తీసుకుని మరి రానా పోగాగ్ ను అరెస్ట్ చేసింది. మధ్యవర్తి ద్వారా వచ్చిన ఆ సంబంధాన్ని పెద్దలే తీసుకురావడంతో తాను మంచోడనే అనుకున్నానంటూ ఆమె చెబుతోంది. ఇదిలా ఉంటే.. జున్మోనీకి ధైర్యశాలి అధికారిణి అనే పేరుంది. గతంలో ఎంతో సంక్షిష్టమైన కేసుల్ని సాహసోపేతంగా డీల్ చేశారామె. అందుకే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలోనూ ఆమె డేరింగ్ స్టెప్ తీసుకుందని పలువురు కొనియాడుతున్నారు. చదవండి: పాక్ నుంచి రిందా కుట్ర -
'మంచి' దొంగ పోలీసులకు చిక్కాడు
ప్రయాణాల్లోనూ, టూర్లలోనూ లగేజీ పోగొట్టుకుంటుంటాం. అలాగే వాల్యుబుల్స్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కోసారి ఎక్కడో పెట్టి మర్చిపోవడమో, ఎవరైనా దోచేయడమో జరుగుతుంటుంది. అయితే అటువంటప్పుడు కనీసం బ్యాగ్ దొరికిన వారు అందులోని డబ్బు, బంగారం వంటివి ఇవ్వకపోయినా... పాస్‌పోర్ట్ సర్టిఫికెట్లు, ఫోన్ డేటా వంటి అత్యవసరమైనవైనా తిరిగి ఇచ్చేస్తే బాగుండునని ఎంతగానో అనుకుంటాం. అయితే దొంగల్లోనూ కొందరు సిన్సియర్లు ఉంటారని, వారు అలాకూడా చేస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా? తాజాగా ముంబైలో అటువంటి ఓ మా మంచి దొంగ పోలీసులకు చిక్కాడు. తనకు కావలసినదేదో తీసుకొని విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను నిజాయితీగా యజమానికి అప్పగించే అలవాటున్న ఆ 61 ఏళ్ళ మంచిదొంగను.. ఓ చోరీకి పాల్పడుతుండగా పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ...ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ఓ 61 ఏళ్ళ వయసున్న వింత దొంగను అరెస్ట్ చేశారు. ఎన్నారైలను మాత్రమే టార్గెట్ చేసి వారివద్ద ఉన్న విలువైన వస్తువులను తస్కరించడంలో మంచి హస్త లాఘవం ఉన్న కిషోర్ సుబ్రహ్మణ్యన్ మద్దాలి అనే దొంగను చాకచక్యంగా పట్టుకొన్నారు. అతనివద్ద నుంచీ ఐదుగురు విదేశీయులకు సంబంధించి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కిషోర్ సుబ్రహ్మణ్యం టార్గెట్ కేవలం ఫారెనర్లే. వారిని తన మాటలతో మస్కాకొట్టించి, నమ్మకం కలిగించి మెల్లగా వారి బ్యాగ్‌లను కొట్టేయడం కొన్నేళ్ళుగా అతని అలవాటుగా మారింది. అయితే ఆ బ్యాగుల్లో వారికి సంబంధించిన పాస్‌పోర్టులు వంటివి ఉంటే మాత్రం వారికి ఎలాగైనా తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించడం ఈ దొంగగారి ప్రత్యేక లక్షణం. అయితే ఎన్నో ఏళ్ళుగా ఈ వ్యవహారం జరుగుతున్నా బయటపడలేదు గానీ, తాజాగా సౌదీ అరేబియాకు చెందిన దేవదాసన్ శివరామ్ సోనారికి చెందిన పాస్‌పోర్ట్ ను తిరిగి ఇవ్వడం ఈ మంచిదొంగ పీకకు చుట్టుకుంది. దేవదాసన్ సోనారీ మంగుళూరు ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా బ్యాగ్ ను కొట్టేసిన మద్దాలి... తర్వాత అతని అడ్రస్ ట్రేస్ చేసి మరీ పాస్‌పోర్టును అందేలా చేశాడు. ''మేం మొత్తం ఐదుగురికి చెందిన విలువైన వస్తువులను మద్దాలి నుంచీ స్వాధీనం చేసుకున్నాం. అతని మరిన్ని దొంగతనాలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నాం. నిందితుడికి తెలుగు, మలయాళం, తమిళ్, ఇంగ్లీష్, హిందీ భాషలతోపాటు మరాఠీ కూడా బాగా తెలుసు. అంతేకాదు అతడు బీఎస్సీ గ్రాడ్యుయేట్ కూడా.'' అని జీఆర్పీ పోలీస్ ఇనస్పెక్టర్ మానిక్ సాథీ తెలిపారు. గతంలో 24 ఏళ్ళ నైజీరియాకు చెందిన రుకో మిగా పాస్‌పోర్టును కూడ మద్దాలి తిరిగి ఇచ్చేశాడు. అతడు చెన్నై మెయిల్ ఎక్కుతుండగా అతగి బ్యాగ్‌ను ఓ ల్యాప్‌టాప్, ఏభై వేల రూపాయల క్యాష్తో పాటు తస్కరించాడు. అయితే ఆ తర్వాత అతడి నెంబర్ యూనివర్శిటీ ద్వారా వివరాలు తెలుసుకొని అతడికి పాస్‌పోర్ట్ చేరేలా చేశాడు. అయితే తరచుగా వస్తున్న ఫిర్యాదులపై దృష్టి సారించిన పోలీసులు మద్దాలిని పట్టుకునేందుకు వల పన్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో సన్ గ్లాస్లు, క్యాప్ పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గమనించారు. అయితే సీసీ కెమెరాలో క్యాప్, కళ్ళజోడు లేకపోవడంతో అతడు మద్దాలి అవునా కాదా అని కాస్త సంశయించారు. కాపు కాసి సివిల్ డ్రస్‌లో ఉన్న పోలీసులు ...ఓరోజు పధ్నాలుగో నెంబర్ ప్లాట్ ఫాం పైకి మంగుళూరు ఎక్స్ ప్రెస్ వచ్చిన వెంటనే ఒకరి నుంచి బ్యాగ్ ను కొట్టేందుకు ట్రై చేస్తున్న మద్దాలిని పట్టుకున్నారు. అయితే మద్దాలి బాధితులను బ్రెయిన్ వాష్ చేసిన తీరు మాత్రం పోలీసులకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అతడు దొంగ అంటే నిజానికి బాధితులే నమ్మలేని పరిస్థితి కనిపించడంతో అతడి హస్త లాఘవ నైపుణ్యానికి విస్తుపోయిన పోలీసులు ఎట్టకేలకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవాడైన మద్దాలి ముంబైలోని టెక్స్టైల్ ఫ్యాక్టరీ లో పనిచేసేవాడు. 58 ఏళ్ళకు మద్దాలి రిటైర్ అయిన తర్వాత తాగుడుకు అలవాటు పడటంతో అతని భార్య కొడుకుతోపాటు అతడిని వదిలి వెళ్ళిపోయింది. చివరికి తాగేందుకు డబ్బులేక మద్దాలి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ముఖ్యంగా విదేశీయులను టార్గెట్ చేసే మద్దాలి... ముందుగా వారిని మాటల్లో పెట్టి, మంచి తనంతో నమ్మించి.. ఆ తర్వాత హెల్స్ చేస్తానంటూ వారు వాష్‌రూమ్ కు వెళ్ళిన సమయంలో లగేజీ జాగ్రత్తగా చూస్తానంటూ నమ్మించి ట్రైన్ నుంచి పరారయ్యే వాడు. ఇంగ్లీష్ భాషలో ఎంతో కమాండ్ ఉన్నమద్దాలి వారిని ఆ భాషతోనే చాకచక్యంగా బుట్టలో వేసుకొని వారి లగేజీనుంచీ ఓ బ్యాగ్ ను తీసుకొని పరుగు లంకించేవాడు. తాను కూడా ప్రయాణీకుడినంటూ మిగిలిన వారిని నమ్మించేందుకు.. మద్దాలి తన చేతిలో కూడా ఎప్పుడూ ఓ బ్యాగ్‌ను పట్టుకొని తిరిగేవాడు.