న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యి, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సుఖే‹Ôæ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చాడు. 2020లో హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి) కార్యాలయంలో ‘ఏపీ’ అనే వ్యక్తికి రూ.75 కోట్లు అందజేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ తనను ఆదేశించారని వెల్లడించాడు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో భాగస్వామి అయిన ‘ఏపీ’ అనే వ్యక్తికి టీఆర్‌ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు అందజేశానని తెలియజేశాడు. ఒక్కో పెట్టెలో 15 కిలోల నెయ్యి (కోడ్ భాషలో రూ.15 కోట్లు) ఉందని, మొత్తం 5 పెట్టెలు (రూ.75 కోట్లు) హైదరాబాద్‌లో సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ తనతో చెప్పారని, ఆయన ఆదేశాల మేరకు వాటిని టీఆర్‌ఎస్ కార్యాలయంలో సంబంధిత వ్యక్తికి చేరవేశానని స్పష్టం చేశాడు.
సదరు వ్యక్తి టీఆర్‌ఎస్ ఆఫీసు ప్రాంగణంలో రేంజ్ రోవర్ కారులో కూర్చొని ఉండగా డబ్బులు అందజేశానని తెలిపాడు. ఈ మేరకు సుకేశ్ శుక్రవారం తన న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా ఒక లేఖ విడుదల చేశాడు. 2020లో తనకు, కేజ్రీవాల్‌కు మధ్య నడిచిన చాటింగ్ గురించి సుఖేశ్ చంద్రశేఖర్ ఇందులో ప్రస్తావించాడు. కేజ్రీవాల్ కరడుగట్టిన అవినీతిపరుడని, ఆయన బాగోతం మొత్తం బయటపెడతానని లేఖలో పేర్కొన్నాడు. ఇది ట్రైలర్ మాత్రమేనని.. తాను, కేజ్రీవాల్ పరస్పరం పంపించుకున్న సందేశాలను బహిర్గతం చేస్తానని వెల్లడించాడు. 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాటింగ్ తన వద్ద ఉందన్నాడు. తాను బయటపెట్టే నిజాలతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జోక్‌గా మారిపోతున్నాయని ఎద్దేవా చేశాడు.
తీహార్ క్లబ్‌లోకి కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీశ్ సిసోడియా తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం తథ్యమని సుఖేశ్ చంద్రశేఖర్ ఇటీవలే వెల్లడించాడు. మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం అతడిని ఇటీవల కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అరవింద్ కేజ్రివాల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని అన్నాడు. ఆయన త్వరలో ‘తీహార్ క్లబ్’లో చేరబోతున్నారని చెప్పాడు. వచ్చేవారం ముఖ్యమైన అంశాలను బయటపెట్టబోతున్నానని తెలిపాడు.
సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు, పార్టీకి రూ.60 కోట్లు
రూ.200 కోట్లు బలవంతంగా వసూలు చేసిన కేసులో సుఖేష్ చంద్రశేఖర్ గత ఏడాది అరెస్టయ్యాడు. అప్పటినుంచి కేజ్రివాల్‌కు, ఆమ్ ఆద్మీ పారీ్టకి వ్యతిరేకంగా వరుసగా లేఖలు విడుదల చేస్తున్నాడు. కేసుల నుంచి బయటపడడానికి కేజ్రివాల్ సహచరుడు సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు, ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.60 కోట్లు అందజేశానని లేఖల్లో వెల్లడించాడు. అయితే, సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలను కేజ్రివాల్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆదేశాల ప్రకారమే సుఖేష్ పనిచేస్తున్నాడని మండిపడ్డారు. అతడిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించినా ఆశ్చర్యం లేదని తెలిపారు.
ఎవరీ సుఖేష్ చంద్రశేఖర్?
సుఖేష్ చంద్రశేఖర్ అలియాస్ బాలాజీ 1989లో కర్ణాటక రాజధాని బెంగళూరులో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జని్మంచాడు. కాలేజీ చదువు పూర్తయ్యాక విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. ఖరీదైన లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లపై మోజు పెంచుకున్నాడు. డబ్బు కోసం అడ్డదారులు ఎంచుకున్నాడు. మోసాలే వృత్తిగా మార్చుకున్నాడు. 17 ఏళ్ల వయసులో తమ కుటుంబ మిత్రుడిని రూ.1.5 కోట్ల మేర మోసగించాడు. ఆ కేసులో అరెస్టయి, బెయిల్‌పై బయటకు వచ్చాడు. తనకు ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలామందిని దగా చేశాడు. కోట్ల రూపాయలు దండుకున్నాడు.
సినీ నటి లీనా మారియా పాల్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2011లో వారిద్దరూ విడిపోయారు. కొన్నిరోజుల తర్వాత మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. ఓ కేసులో బెయిల్ ఇప్పిస్తానంటూ ఫోరి్టస్ హెల్త్‌కేర్ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య ఆదితీ సింగ్ నుంచి రూ.200 కోట్లు వసూలు చేశాడు. ఇదే కేసులో ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నాడు. తన మోసాలకు బాలీవుడ్ నటీమణులను పావులుగా వాడుకోవడం సుఖేష్‌కు వెన్నతో పెట్టిన విద్య. ప్రముఖ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీకి ఖరీదైన బహుమతులు, కార్లు ఇచి్చన లోబర్చుకున్నట్లు సుఖే‹Ùపై ఆరోపణలున్నాయి.
చదవండి: టీఎస్‌పీఎస్సీకి సిట్ టెస్ట్.. పేపర్ల లీకేజీ వ్యవహారంలో సెక్రెటరీ, సభ్యుడికి నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment