సాక్షి, ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్.. ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేఖ రాశాడు. ఈ లేఖలో తీహార్ జైలు క్లబ్‌లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, సుఖేష్ మంగళవారం ఉదయం కవితకు లేఖ రాశారు. ఈ లేఖలో..‘తీహార్ జైలు కౌంట్‌డౌన్ మీకు ప్రారంభమైంది. త్వరలో మీరు తీహార్ జైలు క్లబ్‌లో సభ్యులు కాబోతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదన అంతా బయటపడుతుంది. వాట్సాప్ చాటింగ్, కాల్స్‌పై దర్యాప్తు జరుగుతోంది.
అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడే ప్రయత్నం చేయవద్దని నా సలహా. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు. ఈ కేసులో కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు. మీ అందరికీ తీహార్ జైలులో స్వాగతం పలికేందుకు నేను ఎదురుచూస్తుంటాను’ అని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: కవిత అరెస్టు.. ‘ఈడీ’ ప్రకటనపై ‘ఆప్’ ఫైర్
మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఏడు రోజుల కస్టడీలో భాగంగా నేడు మూడో రోజు ఈడీ అధికారులు కవితను ప్రశ్నించనున్నారు. మరోవైపు.. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. దీంతో, సుప్రీంకోర్టు ఏం చెబుతుందనే అంశంపై సస్పెన్స్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment