సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. కాగా, రేపటితో కవిత కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఇప్పటికే కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో, కవితకు బెయిల్ వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీలో కేజ్రీవాల్, కవిత ఇద్దరూ ప్రధాన సూత్రధారులే అని ఈడీ అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. లిక్కర్ స్కాంలో రూ.100కోట్ల ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌత్ గ్రూపునకు అనుకూలంగా మార్చారనే ఆరోపణలు ఈడీ చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత నడిపించారని ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.
ఇక, లిక్కర్ స్కాం కేసులో కవిత ఈడీ విచారణ తొమ్మిదోరోజుకు చేరుకుంది. నేడు కూడా కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. మద్యం కుంభకోణంలో వచ్చిన అక్రమ సొమ్మును కవిత తన మేనల్లుడు మేకా శరణ్ ద్వారా బదిలీ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. రూ.100 కోట్ల లావాదేవీలో శరణ్‌దే కీలక పాత్ర అని ఈడీ భావిస్తోంది. దీంతో, ఈడీ అధికారులు శరణ్‌పై ఫోకస్ పెట్టారు. అలాగే, నిజామాబాద్‌లో ఉన్న కవిత ఆస్తులపై కూడా ఈడీ దృష్టిసారించింది.
ఇది కూడా చదవండి: కవితకు బిగ్ షాక్.. ఈడీ మరో సంచలన నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment