Updates..
కవిత మేనల్లుడు మేకా శరన్ నివాసంలోనూ కొనసాగుతున్న సోదాలు
- కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు మేకా శరన్ ద్వార లావాదేవీలు జరిపినట్టు అనుమానం
- ఇద్దరికి ఉన్న కంపెనీల ద్వారా నగదు బదిలీ అయనట్టు ఈడీ అనుమానాలు
- అందుబాటులో లేని మేకా శరన్
- మేకా శరన్ నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు
- ఈడీ అధికారులకు ఫోన్లో అందుబాటులో లేని మేకా శరన్
- ముడుపుల చెల్లింపులో మేకా శరణ్ కీలక పాత్ర గా భావిస్తున్న ఈడీ
లిక్కర్ స్కాంలో తెరపైకి కొత్త పేరు..
- లిక్కర్ స్కాం కేసులో తెరపైకి మేకా శరణ్ పేరు.
- మేకా శరణ్ కవితకు అత్యంత దగ్గరి బంధువు.
- కవిత ఇంట్లో జరిగిన సోదాల్లో శరణ్ ఫోన్ లభ్యం.
- సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్‌దే కీలక పాత్ర.
- కవిత కేసులో ఈడీ ఆఫిడవిట్ దాఖలు.
- రెండు సార్లు పిలిచినా మేక శరణ్ విచారణకు హాజరుకాలేదని కోర్టుకు తెలిపిన ఈడీ.
- మేకా శరణ్ ఇంట్లో సోదాలు జరుపుతున్న ఈడీ.
- కవిత అరెస్ట్ సమయంలో ఇంట్లోనే ఉన్న శరణ్
- లిక్కర్ స్కాంలో మేకా శరణ్‌పై ఈడీ ఫోకస్
జై తెలంగాణ నినాదం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న కవిత
- కస్టడీ పొడిగింపు తర్వాత ఈడీ ఆఫీస్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరలింపు
- మూడు రోజులు కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
- తరలించే టైంలో కోర్టు ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేసిన కవిత
- తన అరెస్ట్ రాజకీయ కుట్రగా అభివర్ణించిన కవిత
- ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల అరెస్టు కక్ష సాధింపే: కవిత
- కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి: కవిత
- ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: కవిత
►కోర్టులో వాడీవేడి వాదనల అనంతరం.. కవితకు మరో మూడు రోజుల కస్టడీని పొడిగించింది.
- కవితకు మూడు రోజుల కస్టడీ పొడిగించిన కోర్టు
- ఈనెల 26 వరకు కస్టడీ పొడిగించిన కోర్టు.
- ఈనెల 26వ తేదీన ఉదయం 11:30 గంటలకు కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశం.
►కవితను మరో ఐదు రోజుల కస్టడీ కోరిన ఈడీ..
►కోర్టులో ముగిసిన ఇరు వర్గాల వాదనలు..
బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ..
- తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన కవిత
- బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ
- ప్రస్తుతం బెయిల్‌కు విచారణ అర్హత లేదన్న ఈడీ
- పిటిషన్‌పై ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరిన కవిత తరపు న్యాయవాది
కవిత కామెంట్స్..
- కోర్టుకు తీసుకెళ్తుండగా మీడియాతో కవిత కామెంట్స్..
- నాపై తప్పుడు కేసులు పెట్టారు.
- ఈడీ అధికారులు అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు
- అక్రమ కేసులపై కోర్టులో పోరాటం చేస్తాను.
ఈడీ వాదనలు..
- ఈడీ తరపు న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు
- కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదు
- మరో ఐదు రోజుల కస్టడీ కావాలి
- నలుగురు స్టేట్మెంట్స్ గురించి కవితని అడిగాం
- కిక్ బ్యాగ్స్ గురించి అడిగాం
- ఫోన్ల డేటా డిలీట్ చేశారు
- కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగాం
- కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు
- రేఖా శరణ్‌కి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదు
- సమీర్ మహేంద్ర కూడా కవిత బినామీనే
- కవితతో కలిపి సమీర్‌ను విచారించాలి.
- లిక్కర్ స్కాంలో రూ. వందల కోట్లు చేతులు మారాయి.
- ఇప్పటికీ ఇంకా సోదాలు జరుగుతున్నాయి.
- కవితకు వైద్య సూచనల మేరకు మందులు, డైట్ ఇస్తున్నాము.
కవిత తరపు న్యాయవాది వాదనలు..
- ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారు?
- కవిత పిల్లలు మైనర్స్.. వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వండి.
- కస్టడీ పూర్తైన రోజే కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపండి.
- కవితకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాం.
- ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేశాం.
- బెయిల్ పిటిషన్స్‌పై ఈడీకి ఆదేశాలు ఇవ్వండి.
► తనను బెయిల్ ఇవ్వాలని సెషన్స్ కోర్టు కవిత పిటిషన్ దాఖలు.
►రౌస్ ఎవెన్యూ కోర్టుకు చేరుకున్న కవిత.
కాసేపట్లో కోర్టుకు కవిత..
- కాసేపట్లో కవితను కోర్టులో హాజరుపరుచనున్న ఈడీ అధికారులు.
- కాగా, కవిత హైబీపీతో బాధపడుతున్నారన్న ఆమె తరఫున నాయ్యవాది
- కవిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రిపోర్టు ఇవ్వాలని కోర్టు ద్వారా కోరిన ఆమె న్యాయవాది.
- కస్టడీలో భాగంగా ప్రతీరోజు హెల్త్ రిపోర్టు కవితకు ఇవ్వాలని ఆదేశించిన కోర్టు.
- రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరచనున్న ఈడీ అధికారులు
- మరోవైపు కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్న ఈడీ
- వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కవిత
- కవితను చూసేందుకు కోర్టుకు వచ్చిన ఆమె భర్త, తనయుడు..
- బీఆర్ఎస్ ఎంపీలు వద్ధిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, మలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ, పలువురు జాగృతి, బీఆర్ఎస్ శ్రేణులు
కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు..
►ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారుల సోదాలు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచే సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు. మాదాపూర్‌లో అనిల్ సోదరి అఖిల నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు. కవిత కాల్ డేటా ఆధారంగా సోదాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు.
►ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చనున్నారు.
►ఇక, కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ వివరించనుంది. కవితకు మరికొన్ని రోజులపాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశముంది. కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరే అవకాశం కూడా ఉంది. కాగా గత ఆరు రోజులుగా ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్‌లో అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు.
►మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్. కేజ్రీవాల్‌ను ఆరు రోజులు కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరిన ఈడీ. ఈ క్రమంలో కేజ్రీవాల్, కవితను కలిపి విచారించేందుకు రెడీ అవుతున్న ఈడీ. ఈ వారం రోజుల్లో లిక్కర్ స్కాంలో కవితను విచారించిన ఈడీ.
►ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత పాత్ర, రూ. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్‌తో ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
►ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత శుక్రవారం(మార్చి 15) ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది.
కేజ్రీవాల్, కవిత అరెస్ట్‌పై కేసీఆర్ స్పందన..
►కేజ్రీవాల్ అరెస్ట్‌ను కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజుగా పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
►ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం పావులుగా వాడుకుంటోంది. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment